Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. ఉద్యాన వనంలో ‘కుంకుమ’ సోయగం
ADVERTISEMENT 

ఉద్యాన వనంలో ‘కుంకుమ’ సోయగం

Telangana Sakshi User Sakshi Sakshi Time Nov 14, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
safron.jpg

వనపర్తిలోని మోజర్ల వర్సిటీలో ఏరోపోనిక్‌ విధానంలో ప్రయోగాత్మకంగా పంట సాగు  

తెలంగాణలో కూడా కుంకుమ పువ్వు సాగు చేయొచ్చు : వీసీ రాజిరెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: కుంకుమ పువ్వు సాగు తెలంగాణలో కూడా సాధ్యమని శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వ విద్యాలయం నిరూపించింది. నాబార్డు ఆర్థిక సాయంతో ఏరోపోనిక్‌ పద్ధతిలో వనపర్తి జిల్లాలోని మోజర్ల ఉద్యాన కళాశాలలో ప్రొఫెసర్‌ పిడిగం సైదయ్య నేతృత్వంలో ప్రయోగాత్మకంగా కుంకుమ పువ్వును సాగు చేశారు. అతిశీతల వాతావరణంలో మాత్రమే ఈ కుంకుమ పువ్వు సాగవుతోంది. 

కశ్మీర్‌ తరహా వాతావరణాన్ని మెషీన్లతో కృత్రిమంగా రూపొందించిన ప్రయోగశాలలోని 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేశారు. రెండు నెలలుగా చేస్తున్న పరిశోధనలో ఈ పంటకు సంబంధించి కుంకుమ పువ్వులు వచ్చాయని ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ డాక్టర్‌ దండ రాజిరెడ్డి తెలిపారు. దీంతో తెలంగాణలో సైతం నియంత్రిత వాతావరణంలో కశ్మీర్‌లో పండే కుంకుమపువ్వును ఇక్కడ కూడా పండించవచ్చని ఉద్యాన విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నిరూపించారు. 

కశ్మీర్‌లో తగ్గినా..... 
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని ప్యాంఫోర్‌ గ్రామానికే సంప్రదాయక కుంకుమ పువ్వు సాగు పరిమితమైంది. ప్రపంచంలో అత్యధికంగా ఇరాన్‌ కుంకుమ పువ్వు సాగు చేసి ఉత్పత్తి చేస్తుండగా, ఆ తర్వాత కశ్మీర్‌లోనే ఈ కుంకుమ పువ్వు ఎక్కువగా సాగవుతోంది. అయితే పర్యావరణ మార్పులతో కుంకుమ పువ్వు సాగు విస్తీర్ణం తగ్గడమే కాకుండా, నాణ్యత కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ సాగు మార్గాల్లో కుంకుమ పువ్వు ఉత్పత్తికి పరిశోధనలు మొదలయ్యాయి. 

తెలంగాణ ఉద్యాన వర్సిటీ శాస్త్రవేత్తలు ఏరోపోనిక్‌ విధానంలో కుంకుమ పువ్వు సాగును ఎన్నుకొన్నారు. కశ్మీర్‌ తరహాలో రాత్రి, పగలు వేర్వేరు ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ, అక్కడి సూర్యరశ్మి, కర్బన వాయువు మోతాదును అందించేలా మెషీన్లతో ప్రయోగశాలను రూపొందించి, అవసరమైనప్పుడు మార్పులకు వీలుగా ఉండేలా పరికరాలు ఏర్పాటు చేసుకొని, కశ్మీర్‌ నుంచి తీసుకొచ్చిన కుంకుమపువ్వు గడ్డలను ఈ ప్రయోగశాలలో ఉంచి మొలకెత్తించారు.

మొక్కలు పెరగడం, పూత ఇచ్చేందుకు అవసరమైన ఉష్ణోగ్రత, కృత్రిమ లైట్లను ఎప్పటికప్పుడు మారుస్తూ కుంకుమ పువ్వు తీస్తున్నారు. ఈ కుంకుమ పువ్వు సాగుకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన ఓ యాప్‌ ద్వారా ఉష్ణోగ్రతలను నియంత్రించినట్టు శాస్త్రవేత్త పిడిగం సైదయ్య తెలిపారు. ఎక్కువగా కూలీల అవసరం లేకపోవడం, పూర్తిస్థాయిలో సేంద్రీయం కావడం, దిగుబడి నాణ్యత ఆధారంగా భవిష్యత్‌లో కృత్రిమ పద్ధతిలో సాగు పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.  

రైతులను త్వరలో పరిచయం చేస్తాం  
రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందించే విధంగా వర్సిటీలో పరిశోధనలు చేపడుతున్నాం. అందులో భాగంగా కశ్మీర్‌లోని చల్లని వాతావరణంలో పండే కుంకుమ పువ్వును విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలలో పైలట్‌ ప్రాతిపదికన చేపట్టాం. 

దీనిని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ త్వరలోనే పరిచయం చేస్తాం. పూర్తిస్థాయి వివరాలు అందిస్తాం. అవసరమైతే ప్రాంతాల వారీగా సైతం వర్సిటీ పరిధిలోని కళాశాలలు, ఉద్యాన పరిశోధన సంస్థలలో సాఫ్రాన్‌ మోడల్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేసి స్థానిక రైతులకు శిక్షణ ఇస్తాం.  – డాక్టర్‌ దండా రాజిరెడ్డి, వీసీ, ఉద్యాన విశ్వవిద్యాలయం

రైతుల ఆదాయం     మెరుగుపరిచేందుకు..
రైతుల ఆదాయం మెరుగు పరచాలనే ఉద్దేశంతో నూతన పరిజ్ఞానాన్ని అందరికీ అందించే పథకాలకు అండగా నిలుస్తున్నాం. తెలంగాణలో కుంకుమ పువ్వు సాగు సాధ్యాసాధ్యాలపై నిగ్గు తేల్చేందుకుగాను ఉద్యాన వర్సిటీకి నిధులు అందించాం. కుంకుమ పువ్వు ఏరోఫోనిక్‌ పద్ధతిలో ఇక్కడ వచ్చింది. వీటిపై ఔత్సాహికులకు శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తాం. గ్రామీణ అభివృద్ధికి, రైతుల ఆదాయాలు పెంపొందించేందుకు ఉపయోగపడే అన్ని టెక్నాలజీలను కూడా ప్రోత్సహిస్తాం.  - బి. ఉదయ్‌భాస్కర్, చీఫ్‌ జనరల్‌ మేనేజర్, నాబార్డ్, హైదరాబాద్‌  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Telangana
saffron
NABARD
Horticultural
university
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.