Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. అమ్మో.. ఇవేం ఫీజులు!
ADVERTISEMENT 

అమ్మో.. ఇవేం ఫీజులు!

Telangana Sakshi User Sakshi Sakshi Time Apr 15, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
COLLEGE-FEE--465306814.jpg

ఇంజనీరింగ్‌ కాలేజీల ప్రతిపాదనలపై సర్కార్‌ బెంబేలు 

కన్వీనర్‌ కోటా ఫీజులు భారీగా పెంచాలని కోరుతున్న యాజమాన్యాలు

ఒత్తిడికి తలొగ్గితే ఇబ్బందులు తప్పవని భావిస్తున్న ప్రభుత్వం 

వాస్తవ పరిస్థితులపై అధ్యయనానికి కమిటీ వేసే యోచన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫీజుల పెంపుపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఈ ఏడాది ఫీజులు భారీగా పెంచాలంటూ కాలేజీలు ఒత్తిడి చేస్తున్నాయి. అయితే ఇందుకు ఆమోదం తెలిపితే సర్కారు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని సీఎం సలహాదారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు నివేదించడంతో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ప్రభుత్వ పెద్దలు తర్జనభర్జనలు పడుతున్నట్లు సమాచారం. 

ప్రైవేటు కాలేజీలు ప్రతిపాదించిన కన్వీనర్‌ కోటా ఫీజుల వివరాలను ఇటీవల రాష్ట్ర ఫీజులు, నియంత్రణ మండలి (ఎఫ్‌ఆర్‌సీ) ప్రభుత్వానికి పంపింది. రెండురోజుల క్రితం ఉన్నతాధికారులు ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. సర్కార్‌ ఆమోదం తెలిపితే ఎఫ్‌ఆర్‌సీ ఫీజులను ఖరారు చేసే వీలుందని తెలిపారు. 

అయితే కాలేజీలు ప్రతిపాదించిన ఫీజులపై ప్రభుత్వం నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైనట్టు తెలిసింది. ఫీజులు భారీగా ఉండటం గమనించిన ప్రభుత్వం..కాలేజీలు కోరుతున్నట్టుగా ఫీజులు పెంచితే ప్రభుత్వం పెద్దయెత్తున విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఫీజుల విషయంలో వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచి్చనట్లు తెలిపాయి. 

ఎక్కువ వ్యయంతో ఆడిట్‌ రిపోర్టులు 
ఇంజనీరింగ్‌ ఫీజులను ఎఫ్‌ఆర్‌సీ ప్రతి మూడేళ్ళకోసారి సమీక్షిస్తుంది. చివరిసారిగా 2022లో కొత్త ఫీజులను ఖరారు చేశారు. ఇవి 2022–23, 2023–24, 2024–25 విద్యా సంవత్సరానికి వర్తించాయి. 2025–26, 2026–27, 2027–28 విద్యా సంవత్సరం కోసం కొత్త ఫీజులను ఖరారు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 157 ఇంజనీరింగ్‌ కాలేజీలు కొత్త ఫీజులపై ప్రతిపాదనలు పంపాయి. 

గత మూడేళ్ళుగా కాలేజీల్లో ప్రవేశపెట్టిన కొత్త కోర్సులు, మౌలిక వసతుల కల్పన, ఇతర ఖర్చులతో కూడిన ఆడిట్‌ రిపోర్టులు సమరి్పంచాయి. వీటిని ఎఫ్‌ఆర్‌సీ సూచించిన ఆడిట్‌ బృందాలు కొన్ని నెలలుగా సమగ్రంగా అధ్యయనం చేశాయి. ఆ తర్వాత కాలేజీలతో విడివిడిగా ఎఫ్‌ఆర్‌సీ అధికారులు మాట్లాడారు. ఇందులో వెల్లడైన అంశాల ఆధారంగా ఫీజుల పెంపుపై ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. 

2022 వరకూ అంతకు ముందు ఫీజులపై గరిష్టంగా పది శాతం పెంచుకునే అవకాశం కల్పించే వాళ్ళు. కానీ ఇప్పుడు కాలేజీల ప్రతిపాదనలు ఊహించని స్థాయిలో ఉన్నాయి. కరోనా తర్వాత పెద్దగా ఫీజులు పెంచలేదని, 2022 తర్వాత ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, సైబర్‌ సెక్యూరిటీ, డేటాసైన్స్‌ సహా పలు కోర్సులు తీసుకొచ్చామని, దీనికి ఫ్యాకల్టీతో పాటు, మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున ఖర్చు చేశామని, ఈ మేరకు ఫీజులు పెంచాలని కాలేజీలు అంటున్నాయి.  

ఫీజులు పెంచాల్సిందే.. 
దాదాపు అన్ని కాలేజీలు పెద్ద ఎత్తున ఫీజుల పెంపు ప్రతిపాదనలు చేశాయి. 52 శాతం నుంచి 84 శాతం ఫీజుల పెంపును కోరుతున్నాయి. కనీ్వనర్‌ కోటా ఫీజు పెరిగితే బీ కేటగిరీ ఫీజులు మరింత పెంచుకోవచ్చని కాలేజీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో రూ.1.50 లక్షల వార్షిక ఫీజు ఉన్న 73 కాలేజీలు ఏకంగా రూ. 2.25 లక్షల వరకూ ఫీజు పెంపును ప్రతిపాదించాయి. 33 కాలేజీల్లో ప్రస్తుతం రూ.లక్ష లోపు ఫీజు ఉంది. దీన్ని రెట్టింపు చేయాలని ఎఫ్‌ఆర్‌సీ ముందు ప్రతిపాదించాయి. టాప్‌ టెన్‌ కాలేజీలు తమ ఫీజులను రూ.2.50 లక్షలకు పెంచాలని కోరుతున్నాయి.  

సీఎస్‌ నేతృత్వంలో కమిటీ! 
కాలేజీల ఒత్తిడి నేపథ్యంలో ఫీజులపై వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేయడానికి కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బాధ్యతను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అప్పగించిననట్టు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే అన్ని విశ్వవిద్యాలయాల వీసీల నుంచి ప్రైవేటు కాలేజీల్లో కోర్సులు, మౌలిక వసతులు, ఫీజులపై వివరాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ అయినట్టు తెలిసింది. ఈ నివేదికలు వచి్చన తర్వాత ఇంజనీరింగ్‌ కాలేజీల ఫీజులపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే వీలుందని చెబుతున్నారు.   

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
engineering colleges
private engineering colleges
Telangana Government
Telangana
College fee
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.