Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. రెస్క్యూ ఆపరేషన్‌ @ 50!
ADVERTISEMENT 

రెస్క్యూ ఆపరేషన్‌ @ 50!

Telangana Sakshi User Sakshi Sakshi Time Apr 13, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
slbc.jpg

ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రమాదంలో గల్లంతైన కార్మికుల వెలికితీతకు 50 రోజులుగా ప్రయత్నాలు

ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, ఆర్మీ తదితర 12 సంస్థల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనులు 

దేశంలో కనీవిని ఎరుగని రీతిలో సుదీర్ఘంగా సాగుతున్న సహాయక చర్యలు

సాక్షి, నాగర్‌కర్నూల్‌: శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం కుప్పకూలి శనివారానికి సరిగ్గా 50 రోజులైంది. దేశంలో ఇప్పటివరకు కనీవిని ఎరుగని రీతిలో సుదీర్ఘంగా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. 12 సంస్థలతోపాటు నిపుణులను రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దించినా.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నా.. వందల మంది సిబ్బంది రేయింబవళ్లు శ్రమిస్తున్నా గల్లంతైన వారిలో ఇంకా ఆరుగురు కార్మికుల జాడ బయటపడకపోవడం అందరినీ ఆవేదనకు గురిచేస్తోంది.

150 మీటర్ల మేర మట్టిని తొలగించి.. 
ఈ ప్రమాదంలో సొరంగం శిథిలాల కింద మొత్తం 8 మంది కార్మికులు కూరుకుపోగా ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలను సహాయ సిబ్బంది వెలికితీశారు. మిగితా ఆరుగురి జాడ కోసం నిత్యం మూడు షిఫ్టుల్లో మొత్తం 560 మంది సిబ్బంది శ్రమిస్తున్నారు. ఇప్పటివరకు అడ్డుగా ఉన్న టీబీఎం భాగాలను తొలగించడంతోపాటు సుమారు 150 మీటర్ల మేర టన్నులకొద్దీ మట్టిని తొలగించి 13.9 కి.మీ. అవతల సొరంగం నుంచి బయటకు తరలించారు. ఇంకా 100 మీటర్ల వరకు మట్టి, శిథిలాలను తొలగించేందుకు మరో 4 రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. 

రంగంలోకి ఎన్నో సంస్థలు.. 
నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్, స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్, ఆర్మీ, నేవీ, సింగరేణి, బార్డర్‌ రోడ్స్‌ అండ్‌ ఆర్గనైజేషన్, హైడ్రా, దక్షిణమధ్య రైల్వే, మేఘా, ఎల్‌ అండ్‌ టీ, రాబిన్స్, జేపీ సంస్థలతోపాటు ఉత్తరాఖండ్‌ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న 41 మందిని సురక్షితంగా బయటకు తీసిన ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌ ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదస్థలి వద్ద సేవలు అందిస్తున్నారు.  

అత్యాధునిక సాంకేతికత వినియోగం.. 
బురద, శిథిలాల కింద కూరుకుపోయిన కార్మికుల ఆనవాళ్లను గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజా్ఞనాన్ని సైతం రాష్ట్ర ప్రభుత్వం వినియోగంలోకి తెచ్చింది. ఇప్పటివరకు గ్రౌండ్‌ పెనెట్రేటింగ్‌ రాడార్, మానవ అవశేషాలను గుర్తించే కడావర్‌ డాగ్స్, నీటిలో సైతం మానవ రక్తం, అవశే షాలను గుర్తించే అక్వా–ఐ, ప్రోబోస్కోప్‌ టెక్నాలజీతోపాటు ఎన్జీఆర్‌ఐ, నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీలు రెస్క్యూ ఆపరేషన్‌లో పనిచేస్తున్నాయి.

టీబీఎం భాగాలను కట్‌ చేసేందుకు అల్ట్రా థర్మల్, గ్యాస్‌ కట్టర్లను వినియోగిస్తుండగా మ ట్టిని వేగంగా కన్వేయర్‌ బెల్టుపై వేసేందుకు నాలుగు ఎస్కలేటర్లు, సైన్యానికి చెందిన మినీ బాబ్‌కట్‌ మెషీన్లను ఉపయోగిస్తున్నారు. సొరంగం చివరి భాగంలో అత్యంత ప్రమాదకరంగా ఉన్న 40 మీటర్ల ప్రాంతంలో ఎన్వీ రోబోటిక్స్‌కు చెందిన రొబోటిక్‌ యంత్రాలను వినియోగించనున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
recover
Workers
missing
SLBC Tunnel
Accident
Telangana
Rescue Operation
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

టూరిస్టు బోటు బోల్తా.. 10 మందికి పైగా మృతి

టూరిస్టు బోటు బోల్తా.. 10 మందికి పైగా మృతి

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.