Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. జనవరి 15కల్లా ‘యాదాద్రి’ జాతికి అంకితం
ADVERTISEMENT 

జనవరి 15కల్లా ‘యాదాద్రి’ జాతికి అంకితం

Telangana Sakshi User Sakshi Sakshi Time Aug 23, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Bhatti-Vikramarka.jpg

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటన 

గ్రీన్‌ పవర్‌ ఉత్పత్తిలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబెడతామని వెల్లడి  

విద్యుత్‌ కేంద్రం పరిధిలో 500 మంది భూనిర్వాసితులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేత 

నాడు వై.ఎస్‌. ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇవ్వబట్టే నేడు గిరిజనులకు ఉద్యోగాలు వచ్చాయని వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్‌: యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని వచ్చే ఏడాది జనవరి 15 నాటికి జాతికి అంకితం చేస్తామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇప్పటికే రెండు యూనిట్లను అందుబాటులోకి తెచ్చామని.. గ్రీన్‌ పవర్‌ ఉత్పత్తిలో తెలంగాణను దేశంలోనే ముందు వరుసలో నిలబెడతామన్నారు. యాదాద్రి విద్యుత్‌ కేంద్రం పరిధిలో భూములు కోల్పోయిన 500 మందికి ప్రజాభవన్‌లో భట్టి శుక్రవారం ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కరెంట్‌ ఉండదన్న దు్రష్పచారాన్ని తిప్పికొట్టామన్నారు.

‘కాంగ్రెస్‌ అంటేనే కరెంట్‌... కరెంట్‌ అంటేనే కాంగ్రెస్‌’అని వ్యాఖ్యానించారు. వాస్తవానికి యాదాద్రి పవర్‌ ప్లాంట్‌కు 2022 అక్టోబర్‌లోనే పర్యావరణ అనుమతులపై జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ స్టే ఇచి్చందని.. అయినా గత ప్రభుత్వ పాలకులు ప్లాంట్‌ నిర్మాణ పనుల్లో చేసిన జాప్యం వల్ల ప్రాజెక్టుపై తీవ్ర ఆర్థిక భారం పడిందన్నారు. తాము అధికారంలోకి రాగానే తిరిగి పర్యావరణ అనుమతులు తీసుకొచ్చి నిర్మాణ పనుల్లో వేగం పెంచామని చెప్పారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో 1978లోనే జపాన్‌ సంస్థ మిత్సుబిషి సాంకేతికతను ఉపయోగించి పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్‌ ఉత్పత్తి తీసుకొచ్చామని చెప్పారు. విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతున్నప్పటికీ రాష్ట్రంలో రెప్పపాటు కూడా విద్యుత్‌ అంతరాయం లేకుండా చూస్తున్నామని భట్టి అన్నారు. రాష్ట్రంలోని 29 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు, 51 లక్షల మంది పేదలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌కు అయ్యే రూ. 17 వేల కోట్ల మొత్తాన్ని విద్యుత్‌ సంస్థలకు ప్రభుత్వమే చెల్లిస్తోందని వివరించారు.

ఆలస్యం వల్ల ఆర్థిక భారం.. ప్రతి మండలానికీ అంబులెన్స్‌ 
కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) నిధుల నుంచి పవర్‌ ప్లాంట్‌ పరిసర గ్రామాల్లోని వారికి విద్య, వైద్యాన్ని ఉచితంగా అందిస్తామని భట్టి తెలిపారు. ప్రతి మండలానికీ ఒక అంబులెన్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. సీసీ రోడ్లు, ఫ్లై ఓవర్లు నిర్మిస్తామని, భూసేకరణకు అవసరమైన నిధులను ఇస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి హయాంలోనే లక్షలాది మంది గిరిజనులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు అందాయని భట్టి గుర్తుచేశారు. వారిలో చాలా మంది భూ నిర్వాసితులు ఇప్పుడు ఉద్యోగాలు పొందారన్నారు.  జెన్‌కో విధుల్లో ఉండి ప్రాణాలు కోల్పోయిన 159 మంది కుటుంబ సభ్యులకు రెండోసారి కారుణ్య నియామక ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి, ఉన్నతా ధికారులు నవీన్‌ మిత్తల్, హరీశ్‌ పాల్గొన్నారు. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Bhatti Vikramarka Mallu
yadadri power plant
Praja Bhavan
Employment
appointment letters
Yadadri thermal power plant
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.