Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. ఆరోగ్య అక్షరాస్యత అత్యవసరం
ADVERTISEMENT

ఆరోగ్య అక్షరాస్యత అత్యవసరం

Telangana Sakshi User Sakshi Sakshi Time Jan 26, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Soumya-Swaminathan.jpg

అవగాహనాలోపం వల్లే దేశంలో వివిధ అనారోగ్య సమస్యలు 

ప్రజల్లో అవగాహన పెంచడం సామాజికవేత్తలు, శాస్త్రవేత్తల బాధ్యత

‘సాక్షి’తో డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ సైంటిస్ట్‌ డా.సౌమ్యా స్వామినాథన్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య అక్షరాస్యత అవసరమని ప్రముఖ వైద్యురాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ సైంటిస్ట్‌ డా.సౌమ్య స్వామినాథన్‌ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌లో రెండోరోజైన శనివారం నిర్వహించిన పలు చర్చాగోష్టుల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా సంభాషించారు. ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే.. 

రోగాలపై సరైన సమాచారమేదీ? 
వ్యాక్సిన్‌ వల్ల అనారోగ్యాలు ఆఖరికి మరణాలు సైతం అపోహల దగ్గర నుంచీ ప్రస్తుతం వైద్య ప్రపంచం తీవ్రంగా ఆందోళన చెందుతున్న యాంటీమైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌ 
(ఏఎమ్‌ఆర్‌) దాకా చాలా సమస్యలకు కారణం అవగాహన లోపమే కదా. అంతేకాదు అనారోగ్యానికి కారణాలు తెలియకపోవడం వల్ల వచ్చే వ్యాధులు ఎక్కువవుతున్నాయి. నీటి ద్వారా వ్యాపించే రోగాలేమిటి? గాలి ద్వారా వ్యాపించేవి ఏమిటి? వైరస్‌ ద్వారా వచ్చేవి ఏమిటి? సరైన తిండి తినకపోతే ఎలాంటి వ్యాధులు వస్తాయి? ఏది సరైన తిండి? ఇలాంటి చాలా ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడా లభించవు. అందువల్ల జనం వాట్సాప్‌ మొదలు సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఆధారపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో హెల్త్‌ ఎడ్యుకేషన్‌ ఆవశ్యకతను గుర్తించి అందరూ ముందుకు రావాలి. అనారోగ్యాలపై ప్రజల్లో అవగాహన పెంచడం సామాజికవేత్తలు, శాస్త్రవేత్తల బాధ్యత. 

ఇంటర్నెట్‌లోని సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి 
ఇంటర్నెట్‌ ఓ అద్భుతమైన సమాచార సేకరణ మార్గం. ఆరోగ్య అక్షరాస్యతకు ఉపకరించే అత్యున్నత మార్గం. అయితే టెక్నాలజీ వల్ల మంచితోపాటు చెడు కూడా జరుగుతోంది. తీవ్రమైన అనారోగ్య విషయాలపైనా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది. కాబట్టి ప్రజలు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వాటిలో ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని నిర్ణయించుకోవాలి.   

మన మహిళలకు మల్టీటాస్కింగ్‌ కొట్టిన పిండే.. 
ఇంటి పని, వంట పని, బయటి పని... ఇలా పలు పాత్రలు పోషించే మల్టీ టాస్కింగ్‌ భారతీయ మహిళలకు స్వతహాగానే వచి్చంది. అదే సమర్థతతో ఇప్పుడు అనేక వృత్తుల్లో అతివలు రాణిస్తున్నారు. అయితే ప్రపంచంలో చాలా చోట్ల ఉన్నట్లుగానే మన దగ్గర కూడా ఇప్పటికీ లింగ వివక్ష ఉంది. దీన్ని మనం అధిగమించాల్సి ఉంది. 

మితాహారం.. వ్యాయామం నా ఆరోగ్య రహస్యం 
నేను క్రమబద్ధమైన జీవనశైలిని పాటిస్తా. ప్రతిరోజూ కనీసం 45 నిమిషాలపాటు వ్యాయామం చేస్తా. రోజూ రాత్రి 7 
గంటలకే నిద్రపోతా. అన్ని రకాల ఆహారపదార్థాలను మితంగా తింటా. మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు నవ్వు ఓ మార్గం. మన చుట్టూతా ఎల్లప్పుడూ మంచి స్నేహితులతోపాటు ఆహ్లాదకరమైన ఇంటి వాతావరణం ఉండటం మనసును ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో ప్రభుత్వ విధానాలు స్పష్టంగా ఉండాలి 
ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడంలో ప్రభుత్వాల విధివిధానాలు స్పష్టంగా ఉండాలని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ సైంటిస్ట్‌ డా.సౌమ్య స్వామినాథన్‌ పేర్కొన్నారు. ఒక విధానాన్ని రూపొందించేటప్పుడు బహుళ రంగాల నిపుణులను భాగస్వాములను చేయాలని సూచించారు. అప్పుడే పటిష్టమైన విధానాలు రూపొందుతాయన్నారు. వాటిని ఆచరణలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌లో వాతావరణ పరిరక్షణ సదస్సులో పాల్గొన్న సౌమ్య స్వామినాథన్, పంకజ్‌ సెఖ్సారియా, సుల్తాన్‌ ఇస్మాయిల్‌లు పాలసీ పర్‌స్పెక్టివ్స్‌ అండ్‌ ద ప్లానెట్‌ అనే అంశంపై చర్చించారు. ఆహారం, ఆరోగ్యం, మహిళలు, పిల్లల అంశాన్ని సౌమ్యా స్వామినాథన్‌ ప్రత్యేకంగా ప్రస్తావించారు.

వాతావరణ మార్పుల ప్రభావం ప్రజారోగ్యంపై తీవ్రంగా ఉంటోందని.. శిశువుల్లో జన్యు లోపాలకు ఇది ఒక కారణం అవుతోందన్నారు. కృత్రిమ ఎరువుల వాడకంతో పండించే పంటల్లో పోషకాలు తగ్గిపోవడం, పంట ఉత్పత్తులను రుచిగా మార్చుకొనే క్రమంలో కృత్రిమ రసాయనాల వాడకం పెరగడం కూడా ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తోందని చెప్పారు. రసాయన ఎరువులు మట్టిని, పంటలను నిస్సారం చేస్తుంటే, ఎరువుల తయారీ పర్యావరణానికి హాని చేస్తోందని సౌమ్యా స్వామినాథన్‌ చెప్పారు. అయితే భారతదేశపు మట్టి పరిపూర్ణమైనదని.. ఆ మట్టిని కాపాడుకుంటే మన దేశం ప్రపంచ దేశాలకు అవసరమైన ఆహారాన్ని పండించగలిగే దేశంగా ఎదుగుతుందన్నారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి యువత ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Hyderabad Literary Festival
Soumya Swaminathan
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.