Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. చేతులు లేకున్నా చెక్కుచెదరలేదు
ADVERTISEMENT 

చేతులు లేకున్నా చెక్కుచెదరలేదు

Telangana Sakshi User Sakshi Sakshi Time Jan 11, 2024 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
hands.jpg

కాగజ్‌నగర్‌టౌన్‌: పుట్టుకతోనే చేతులు లేకపోయినా ఆత్మవిశ్వాసం చెక్కుచెదరలేదు. కాళ్ల వేళ్లే కుంచగా మారి అందమైన బొమ్మలెన్నో వేశాయి..కంప్యూటర్‌ కీ బోర్డుపై టక్‌టక్‌ శబ్దం వినిపిస్తూ ఎన్నో ఎంట్రీలు చేశాయి. ఆర్థిక ఇబ్బందులెన్ని ఎదురైనా నిరుత్సాహపడకుండా పీజీ వరకూ చదివి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు జాకీర్‌పాషా. కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఆటో డ్రైవర్‌ షేక్‌ బాబా–మెహరా దంపతుల మొదటి సంతానమైన జాకీర్‌ పాషా డిగ్రీ వరకు కాగజ్‌నగర్‌లోనే చదివాడు. ఆపై నాగార్జున యూనివర్సిటీ నుంచి పీజీ పట్టా అందుకున్నాడు. పీజీ చదువుతుండగానే కంప్యూటర్‌ కోర్సులు కూడా పూర్తి చేశాడు.  

♦ జాకీర్‌పాషా కాళ్లతో పెయింటింగ్స్‌ వేయడమే కాకుండా.. ఆ వీడియోలను యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నాడు. 

♦ హరితహారం కార్యక్రమంలో వందలాది మొక్కలను కాళ్ల సాయంతో నాటి ఆదర్శంగా నిలిచాడు. 

♦ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వయంగా కేంద్రానికి వెళ్లి కాలి సాయంతో ఓటుహక్కు వినియోగించుకున్నాడు.  

♦ తాజాగా కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీకి పలువురు ఆపరేటర్లను ఎంపిక చేశారు. అందులో జాకీర్‌పాషాకు అవకాశం దక్కింది. కాళ్లతోనే వివరాలను అప్‌లోడ్‌ చేస్తున్నాడు. 

రుణంరాలేదు.. కొలువూదొరకలేదు

గత నవంబర్‌లో తెలంగాణ స్టేట్‌ మైనార్టీ ఫైనాన్స్‌ కమిషన్‌ ద్వారా వెలువడిన రుణాల కోసం జాకీర్‌పాషా దరఖాస్తు చేసుకున్నా, ఇప్పటివరకు మంజూరు కాలేదు. ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు ప్రాతిపదికన కొలువు ఇప్పించాలని పలుమార్లు కలెక్టర్‌కు వినతిపత్రం అందించాడు. ఇటీవల హైదరాబాద్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సైతం కొలువు ఇప్పించి ఆదుకోవాలని దరఖాస్తు సమరి్పంచాడు.

ప్రభుత్వ సాయంకోసం ఎదురుచూపు 

మాది నిరుపేద కుటుంబం. నాతోపాటు ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారు. నాన్న ఆటో నడిపితే వచ్చే డబ్బు ఇంటి ఖర్చులకే సరిపోతున్నాయి. ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నా. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగావకాశం కల్పిస్తే ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. దాతలు ముందుకొచ్చి సాయం చేస్తే నా కుటుంబానికి మేలు జరుగుతుంది.  – జాకీర్‌ పాషా, దివ్యాంగుడు 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Hands
Disabled
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

చేతులు లేవు కానీ పెయింటింగ్‌లో ప్రపంచ రికార్డు..!

చేతులు లేవు కానీ పెయింటింగ్‌లో ప్రపంచ రికార్డు..!

దివ్యాంగుల పాలిట శాపంగా మారిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం

దివ్యాంగుల పాలిట శాపంగా మారిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం

వినతి పత్రం విసిరిపడేశాడు.. వికలాంగులపై దౌర్జన్యం

వినతి పత్రం విసిరిపడేశాడు.. వికలాంగులపై దౌర్జన్యం

మీ బతుకంతా మోసమేనా?: వైఎస్‌ జగన్‌

మీ బతుకంతా మోసమేనా?: వైఎస్‌ జగన్‌

రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల ఆందోళన

రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల ఆందోళన

AP: ఫించన్ రాదనే ఆందోళనతో ఆత్మహత్య చేసుకున్న దివ్యాంగుడు

AP: ఫించన్ రాదనే ఆందోళనతో ఆత్మహత్య చేసుకున్న దివ్యాంగుడు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.