Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. మళ్లీ తెరపైకి ‘డీజీపీ’
ADVERTISEMENT 

మళ్లీ తెరపైకి ‘డీజీపీ’

Telangana Sakshi User Sakshi Sakshi Time Dec 25, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
dg.jpg

తాజాగా పంపే జాబితా ప్రకారం డీజీ కేడర్‌లో వీపీ ఆప్టే, సీవీ ఆనంద్, శివధర్‌రెడ్డి, అభిలాష బిస్త్, శిఖాగోయల్, సౌమ్యామిశ్రా

గతంలో పంపిన జాబితాకు కొనసాగింపుగానే జాబితాను పంపుతారా? లేక తాజాగా మరో జాబితా పంపుతారా?  

డీజీపీ జాబితాలో ఉన్న వారికి ఉద్యోగ విరమణకు కనీసం 6 మాసాల గడువుండాలన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలు  

డీజీపీ శివధర్‌రెడ్డికి ఇంకా నాలుగు నెలల సర్వీసే.. 

రెండు వారాల్లోగా జాబితా పంపాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో డీజీపీ ఎవరన్నది ఆసక్తికరం  

సాక్షి, హైదరాబాద్‌: శివధర్‌రెడ్డి పూర్తిస్థాయి డీజీపీగా కొనసాగుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. రెండు వారాల్లోగా పూర్తిస్థాయి డీజీపీ ఎంపికకు జాబితాను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ)కి పంపించాలని హైకోర్టు ఆదేశించడంతో డీజీపీ నియామక వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. శివధర్‌రెడ్డిని డీజీపీగా నియమించే సమయంలో అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం డీజీ కేడర్‌ ఉన్న అధికారుల జాబితాను యూపీఎస్సీకి పంపించింది. రాష్ట్ర కేడర్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వినాయక్‌ ప్రభాకర్‌ ఆప్టే పేరు ఆ జాబితాలో లేకపోవడంతో దానిని యూపీఎస్సీ తిప్పి పంపించింది. రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో పంపించిన జాబితాలోని ఇద్దరు అధికారులు జితేందర్, రవిగుప్తా ఉద్యోగ విరమణ చేశారు. 

ఈ జాబితా పంపించే సమయానికి అభిలాష బిస్త్‌ ఏపీ కేడర్‌ అధికారిగా డీఓపీటీ నిర్ణయించింది. దీంతో ఆమె పేరును కూడా పరిగణనలోకి తీసుకోలేదు. యూపీఎస్సీకి జాబితా తిరిగి పంపే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేసింది. ఈ తరుణంలో ఓ సామాజిక కార్యకర్త డీజీపీ నియామకం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా లేదని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పుల్లా కార్తీక్‌ ధర్మాసనం డీజీపీ నియామకంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని, అందుకు అనుగుణంగా డీజీ ప్యానల్‌ జాబితాను యూపీఎస్సీకి రెండు వారాల్లోగా పంపించాలని ఆదేశించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా డీజీ కేడర్‌లో ఉన్న 1:2 నిష్పత్తిలో యూపీఎస్సీకి పంపించాల్సి ఉంటుంది. 

సుప్రీంకోర్టు మార్గదర్శకాల్లో కీలకమైన వాటిలో డీజీ పోస్టు కోసం పంపించే జాబితాలోని అధికారులకు ఉద్యోగ విరమణకు ఇంకా కనీసం ఆరు మాసాల గడువు ఉండాలని స్పష్టం చేసింది. ప్రస్తుత ఇన్‌చార్జ్‌ డీజీపీ శివధర్‌రెడ్డి ఉద్యోగ విరమణకు ఇంకా నాలుగు నెలలు మాత్రమే సర్వీసు ఉన్న నేపథ్యంలో ఆయన పేరును యూపీఎస్సీ పరిగణనలోకి తీసుకుంటుందా? లేదా ? అన్నది కీలకంగా మారుతుందని సీనియర్‌ అధికారులు అంటున్నారు. ప్రభుత్వం యూపీఎస్సీకి పంపించే జాబితాలో ఇదివరకు వచ్చిన కొర్రీకి కొనసాగింపుగా సమాధానంగా పంపిస్తున్నట్టు పేర్కొంటే.. శివధర్‌రెడ్డికి ఇబ్బంది లేదని, లేని పక్షంలో ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం మొదట జాబితా పంపించే సమయంలో వినయ్‌ ప్రభాకర్‌ ఆప్టే పేరును ఎందుకు చేర్చలేదన్నది చర్చనీయాంశంగా మారింది. ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులను ఆయా రాష్ట్రాల కేడర్‌కు కేటాయిస్తారు. వీరిలో కొందరు కేంద్రంలో పనిచేసేందుకు డిప్యుటేషన్‌పై వెళుతుంటారు. వినయ్‌ ప్రభాకర్‌ ఆప్టే కూడా డిప్యుటేషన్‌పై వెళ్లిన అధికారి మాత్రమే.. ఆయన సుదీర్ఘకాలంగా కేంద్ర సర్వీసుల్లో కొనసాగినంత మాత్రాన ఆయన రాష్ట్ర కేడర్‌కు చెందకుండాపోరని సీనియర్‌ అధికారులు అంటున్నారు. 

యూపీఎస్సీ ఎత్తిచూపే వరకు జరిగిన పొరపాటును రాష్ట్ర అధికారులు గుర్తించకపోవడం గమనార్హమని ఓ అధికారి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు వారాల్లోగా పంపే జాబితాలో డీజీ కేడర్‌ అధికారులు వినయ్‌ ప్రభాకర్‌ ఆప్టే, సీవీ ఆనంద్, శివధర్‌రెడ్డి, అభిలాష బిస్త్, శిఖాగోయల్, సౌమ్యామిశ్రా ఉండనున్నట్టు తెలిసింది. ఈ జాబితా వెళ్లిన తర్వాత అందులో నుంచి ముగ్గురి పేర్లను యూపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే.. ఆ ముగ్గురిలో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా నియమిస్తుంది. ఈ నియామక తేదీ నుంచి రెండేళ్లపాటు ఆయన అ పదవిలో కొనసాగుతారు.  

గతంలో తెచ్చిన చట్టాన్ని అబయన్స్‌లో పెట్టిన సుప్రీం  
బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు డీజీపీ నియామకానికి సంబంధించి తీసుకొచ్చిన చట్టాన్ని సైతం సుప్రీంకోర్టు తప్పుపట్టడంతోపాటు అబయన్స్‌లో పెట్టింది. ‘తెలంగాణ డీజీపీ అపాయింట్‌మెంట్‌ యాక్ట్‌’సీనియర్‌ అధికారిని డీజీపీ నియమించుకునే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం చట్టం ద్వారా తీసుకొచ్చింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కాదని తెచ్చిన ఈ చట్టంపై సుప్రీంకోర్టుకు వెళ్లడంతో దానిని సుప్రీంకోర్టు అబయన్స్‌లో పెట్టిందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.    

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Shivadhar Reddy
CV Anand
UPSC
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.