Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. నేరం వెనుక నిజం
ADVERTISEMENT 

నేరం వెనుక నిజం

Telangana Sakshi User Sakshi Sakshi Time Dec 30, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
14444.jpg

కుటుంబ కలహాలతోనే అత్యధిక హత్యలు 

రేప్‌ కేసుల్లో నిందితులు పరిచయస్తులే.. 

నేర గణాంకాల విశ్లేషణ

సాక్షి, హైదరాబాద్‌: సమాజంలో జరిగే ప్రతి నేరం వెనుక ఓ కారణం కచ్చితంగా ఉంటుంది. వార్షిక విలేకరుల సమావేశం సందర్భంగా ఆదివారం డీజీపీ డాక్టర్‌ జితేందర్‌ నేరాల సంబంధిత గణాంకాలను విడుదల చేశారు. 2024కు (నవంబర్‌ వరకు) సంబంధించి రాష్ట్రంలో నమోదైన నేరాలను పరిశీలిస్తే..వీటిల్లో అనేక ఆసక్తికరమైన కోణాలు కూడా ఉన్నాయి.  

కుటుంబీకులే కత్తికడుతున్నారు... 
బాడీలీ అఫెన్స్‌గా పిలిచే హత్య కేసులకు పోలీసులు చాలా ప్రాధాన్యం ఇస్తారు. వీటి దర్యాప్తు కోసం అవసరమైతే ప్రత్యేక బృందాలనూ రంగంలోకి దింపుతారు. సాధారణంగా ఓ వ్యక్తి/వ్యక్తులు మరొకరిని చంపడానికి ఆర్థిక లావాదేవీలే కారణమని భావిస్తాం. అయితే ఈ ఏడాది రాష్ట్రంలో నమోదైన 856 హత్య కేసుల్లో అత్యధికంగా 229 (26.75 శాతం) కేసులు కుటుంబ కలహాల వల్లే జరిగాయి. అక్రమ సంబంధాల కారణంగా 102, భూ వివాదాలతో 82, చిరు వివాదాల వల్ల మరో 82 హత్యలు జరిగితే.. ఆర్థిక కారణాల వల్ల 53 హత్యలు జరిగాయి. మరో 259 మాత్రం రకరకాలైన ఇతర కారణాల వల్ల జరిగాయి.  

పిల్లలు తప్పిపోయినా కిడ్నాపే... 
డబ్బు కోసం లేదా ఇతరత్రా లబ్ధి కోసం వ్యక్తులో, ముఠానో ఎవరినైనా ఎత్తుకుపోయి నిర్భంధిస్తే కిడ్నాప్‌గా పరిగణిస్తారు. అయితే ఈ ఏడాది తెలంగాణలో 1,525 అపహరణ కేసులు నమోదయ్యాయి. ఇంతమంది కిడ్నాప్‌కు గురయ్యారని అనుకుంటున్నారా? కానే కాదు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మైనర్ల మిస్సింగ్‌ కేసుల్ని కూడా కిడ్నాప్‌గా నమోదు చేయడం తప్పనిసరి. దర్యాçప్తుల్లో నిర్లక్ష్యాన్ని నిరోధించడానికి న్యాయస్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది. కాగా ఈ ఏడాది నమోదైన కిడ్నాపుల్లో మిస్సింగ్‌ సంబంధిత కేసులే 1,251 (82.03 శాతం) ఉన్నాయి. మిగిలినవి ప్రేమ వ్యవహారాలు, కుటుంబ కలహాలు, చిరు వివాదాల నేపథ్యంలో జరిగినవి ఉన్నాయి.  

చోరీలకు సెల్‌ఫోన్ల లింకు 
ప్రతి వ్యక్తి చేతిలోకి అందుబాటులోకి వచ్చిన సెల్‌ఫోన్‌ ప్రభావం కేవలం సైబర్‌ నేరాల పైనే కాదు. చోరీ, దోపిడీ, బందిపోటు దొంగతనం (డెకాయిటీ) కేసుల పైనా ఉంటోంది. ఈ ఏడాది 58 డెకాయిటీ కేసులు నమోదు కాగా.. వీటిలో 5 సెల్‌ఫోన్లు లాక్కుపోవడానికి సంబంధించివే. 703 దోపిడీ కేసుల్లో 67, 19480 చోరీ కేసుల్లో 1960 ఫోన్లతో ముడిపడి ఉన్నవే కారణం కావడం గమనార్హం.

పరిచయస్తులే చెరబట్టారు! 
మహిళలపై జరుగుతున్న నేరాల్లో అత్యాచారాన్ని తీవ్రంగా పరిగణిస్తారు. రాష్ట్రంలో ఈ ఏడాది నమోదైన అత్యాచారం కేసుల్లో పరిచయస్తులే నిందితులుగా ఉన్న ఉదంతాలు ఎక్కువగా ఉండటం గమనార్హం. మొత్తం 2,945 కేసులు నమోదు కాగా...వీటిలో 2,922 (99.21 శాతం) పరిచయస్తుల వల్ల జరిగినవే కావడం ఆందోళన కలిగించే అంశం. కేవలం 23 కేసుల్లో మాత్రమే బాధితులకు పరిచయం లేని వాళ్లు నిందితులుగా ఉన్నారు. మైనర్‌ను ప్రేమ పేరుతో మోసం చేయడం, పెళ్లి చేసుకోవడం తరహాకు చెందినవీ మొదటి కేటగిరీలోనే ఉంటున్నాయి. రేప్‌ కేసు బాధితుల్లో 15 ఏళ్ల లోపు వాళ్లు 87 మంది, 15–18 ఏళ్ల మధ్య వయసు్కలు 1,970 మంది, మేజర్లు 888 మంది ఉన్నారు.  

మోసాల్లో సైబర్‌ నేరాలదే అగ్రస్థానం 
ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 33,618 చీటింగ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో 24,643 (73.3 శాతం) సైబర్‌ నేరాలే కావడం గమనార్హం. చిన్న చిన్న మొత్తాలతో కూడిన సైబర్‌ నేరాలు ఫిర్యాదు దశలోనే ఆగిపోతున్నాయి. పెద్ద మొత్తాలు కోల్పోయిన వారిలోనూ దాదాపు సగం మంది పరువు, ప్రతిష్ట కోసం, సమాజానికి భయపడి ఫిర్యాదుల వరకు వెళ్లట్లేదు. ఇవి కూడా రికార్డుల్లోకి ఎక్కితే మోసం కేసుల సంఖ్య లక్షల్లోనే ఉండే అవకాశం ఉంది.  

ప్రమాదాలు, మరణాలు పైపైకే.. 
రాష్ట్ర వ్యాప్తంగా 2023లో (నవంబర్‌ వరకు) 20,702 రోడ్డు ప్రమాదాలు జరగ్గా... 6,541 మంది చనిపోయారు. ఈ ఏడాది నవంబర్‌ వరకు మొత్తం 23,491 రోడ్డు ప్రమాదాల్లో 6,640 మంది మరణించారు. మృతులు నమోదు కాని రోడ్డు ప్రమాదాలు సైతం పెరిగాయి. 2023లో వీటి సంఖ్య 14,161 కాగా.. ఈ ఏడాది ఈ సంఖ్య 16,851కి చేరింది. 2023లో అన్ని రకాల నేరాలూ కలిపి 1,38,312 నమోదు కాగా, 2024లో 1,69,477 నమోదయ్యాయి.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
jitender
Telangana
murder case
kidnapping
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.