Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. ఆ ‘ప్యాలెస్‌ బురుజు’ ఇక కానరాదు!
ADVERTISEMENT 

ఆ ‘ప్యాలెస్‌ బురుజు’ ఇక కానరాదు!

Telangana Sakshi User Sakshi Sakshi Time Nov 17, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
5214.jpg

కాలగర్భంలో కలసిపోనున్న నిజాం కాలం నాటి నిర్మాణం  

పూర్తిగా నేలమట్టమయ్యేలా 17.6 మీటర్ల మేర మార్కింగ్‌  

రసూల్‌పురా–పాటిగడ్డ– నెక్లెస్‌రోడ్డు ఫ్లైఓవర్‌ పనులు  

రోడ్డు విస్తరణలో కనుమరుగు కానున్న వారసత్వ కట్టడం  

అది 1892 నాటి దేవడి నజీర్‌ నవాజ్‌ జంగ్‌ ప్యాలెస్‌.. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) జాబితాలో గ్రేడ్‌–3 హెరిటేజ్‌ బిల్డింగ్‌గా నమోదై ఉంది. అంతేకాదు.. దక్కన్‌ స్టైల్‌ ఆర్కిటెక్చర్‌లో నిర్మించిన ఈ ప్యాలెస్‌కు 1996లో ఇండియన్‌ నేషనల్‌ ట్రస్ట్‌ ఫర్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ (ఇన్‌టాక్‌) నుంచి అవార్డు కూడా లభించింది. ప్యాలెస్‌కు ప్రవేశ ద్వారంగా తూర్పు వైపు ఉన్న పాత బురుజు ఇప్పుడు కాలగర్భంలో కలసిపోనుంది. ఒకప్పుడు బేగంపేటలో నిజాం కాలం నాటి బురుజు ఒకటి ఉండేదని భవిష్యత్‌ తరాలు ఇక చరిత్ర పుటల్లోనే చదువుకోవాలి. ఎందుకంటే.. ఫ్లైఓవర్‌ నిర్మాణంలో భాగంగా రోడ్డు విస్తరణలో ఈ బురుజు కథ ముగిసిపోనుంది. కోట ప్రాకారంపై ఉండే పహారా టవర్‌ (బురుజు) కనుమరుగవుతుండడంతో వికార్‌ ఉల్‌ ఉమ్రా సంతతికి చెందిన పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని దేశాలు తమ వారసత్వ కట్టడాలను కాపాడుకుంటుంటే.. ఇక్కడ మాత్రం వాటి ఆనవాళ్లను చెరిపేస్తుండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో ఇర్రంమంజిల్‌ కూల్చివేతపై ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.       

ఇక్కడి 1680.18 ఎకరాల్లో భాగంగా దేవడి నజీర్‌ నవాజ్‌ జంగ్‌ ప్యాలెస్‌ కూడా ఉంది. ఐదో నిజాం కుమార్తె జహందరున్నీసాబేగంను వికార్‌ ఉల్‌ ఉమ్రాకు వివాహం చేశారు. వికార్‌ ఉల్‌ ఉమ్రా సంతతికి చెందిన వారే ఇక్కడ ఉంటూ వచ్చారు. ఈ ప్యాలెస్‌కు తూర్పు వైపు ఉన్న పాత కాలం నాటి బురుజుపై 17.6 మీటర్లను సూచిస్తూ మార్కింగ్‌ చేశారు. అంటే 50 అడుగుల పైగా ఇక్కడి స్థలం రోడ్డు విస్తరణలో కోల్పోతుందన్న మాట. ఈ నేపథ్యంలో వారు సూచించిన కొలతల ఆధారంగా స్వా«దీన ప్రక్రియ జరిగిందంటే ప్యాలెస్‌కు ప్రవేశద్వారంగా ఉన్న బురుజు పూర్తిగా కూల్చివేయాల్సిన పరిస్థితి నెలకొంది.  

అసలు ప్రాజెక్టు ఉద్దేశమేమిటంటే.. 
⇒ హైదరాబాద్‌– సికింద్రాబాద్‌ల మధ్య రాకపోకలు మరింత సులువు చేసేందుకు.. రసూల్‌పురా జంక్షన్‌ నుంచి వయా పాటిగడ్డ, సంజీవయ్య పార్కు రైల్వేస్టేషన్‌ మీదుగా నెక్లెస్‌రోడ్డుకు ఫ్లైఓవర్‌ నిర్మాణానికి 2007లో ప్రతిపాదించారు. బేగంపేట, రాణిగంజ్, సోమాజిగూడ మార్గాల్లో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించవచ్చని అధికారులు ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన పుష్కరంన్నర కాలం తర్వాత ఎట్టకేలకు పట్టాలెక్కించే పనిలో పడ్డారు. రసూల్‌పురా వద్ద ప్రారంభమయ్యే ఎలివేటెడ్‌ కారిడార్‌ పాటిగడ్డ మీదుగా వెళ్లి సంజీవయ్య పార్కు ఎంఎంటీఎస్‌ స్టేషన్‌ పైగా చివరకు నెక్లెస్‌రోడ్డుకు కలిసే ఈ మార్గంలో ఫ్లైఓవర్‌ నిర్మాణ క్రమంలో రోడ్డును భారీగా విస్తరించాల్సి ఉంది. ప్రస్తుతం కేవలం 60 (30 ప్లస్‌ 30) ఫీట్లు మాత్రమే ఉండగా దానిని 120 ఫీట్లకు విస్తరించనున్నారు.  

⇒ ఈ క్రమంలో పాతకాలం నాటి బురుజు వద్ద 17.6 మీటర్లు, అది దాటిన తర్వాత వచ్చే మూల మలుపు తిరగ్గానే అత్యధికంగా 20.2 మీటర్ల మేర స్థలాన్ని ఈ రోడ్డు వెడల్పులో స్వా«దీనం చేసుకోవాలని అధికారులు మార్కింగ్‌లు చేశారు. ఇలా అత్యల్పంగా 9 మీటర్ల నుంచి అత్యధికంగా 20.2 మీటర్ల మేర మార్కింగ్‌లు చేశారు. ఇందులో నిజాం కాలం నాటి బురుజుతో పాటు సంజీవయ్య పార్కు ఎంఎంటీఎస్‌ స్టేషన్‌ ముందు భాగం కూడా 13.3 మీటర్ల మేర స్వా«దీనం చేసుకోనున్నారు. ఈ మార్గంలోని ఇళ్లు కూడా ప్రభావితం కానున్నాయి. రోడ్డుకు కుడివైపు 36 ఆస్తులు, ఎడమ వైపు 11 ఆస్తులను స్వాధీనం చేసుకునే క్రమంలో మార్కింగ్‌ చేశారు. వారసత్వ కట్టడాలకు ఎలాంటి హాని చేయకుండా ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మించవచ్చని వికార్‌ ఉల్‌ ఉమ్రా సంతతికి చెందిన పలువురు అభిప్రాయపడుతున్నారు.  

 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
palace
ghmc
markings
Flyover
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.