Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. 21 ఏళ్ల తర్వాత సీవీ ఆనంద్‌కు అరుదైన అవకాశం
ADVERTISEMENT 

21 ఏళ్ల తర్వాత సీవీ ఆనంద్‌కు అరుదైన అవకాశం

Telangana Sakshi User Sakshi Sakshi Time Sep 9, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
cv-1.jpg

ఏడాది కాలంలో ‘నాలుగో’ సీపీ 

11 నెలల్లో మారిన ముగ్గురు అధికారులు  

మహారాష్ట్ర తరహాలో డీజీపీ కంటే సీనియర్‌ కాప్‌ 

21 ఏళ్ల తర్వాత సీవీ ఆనంద్‌కు అరుదైన అవకాశం

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా సీవీ ఆనంద్‌ మరోసారి నియమితులయ్యారు. కొత్తకోట శ్రీనివాసరెడ్డిని హఠాత్తుగా బదిలీ చేసిన సర్కారు.. కొత్త కొత్వాల్‌గా సీవీ ఆనంద్‌ను తీసుకువచ్చింది. దీంతో ఏడాదిలో ఈయన నాలుగో కమిషనర్‌గా రికార్డులకు ఎక్కారు. మొదటి, నాలుగు స్థానాలు ఆనంద్‌వే కాగా.. మధ్యలో మాత్రం శాండిల్య, శ్రీనివాసరెడ్డి పని చేశారు. మరో విశేషం ఏమిటంటే.. 21 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌కు డీజీపీ స్థాయి అధికారిని సీపీగా నియమించడం. నగరానికి 61వ పోలీసు కమిషనర్‌గా ఆనంద్‌ సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నారు. 

2021లో తొలిసారిగా నియామకం..  
హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని ఈస్ట్‌ జోన్, సెంట్రల్‌ జోన్లకు డీసీపీ, ట్రాఫిక్‌ విభాగం అదనపు సీపీగా పని చేసిన ఆనంద్‌ 2021లో తొలిసారిగా సిటీ కొత్వాల్‌ అయ్యారు. ఆ ఏడాది డిసెంబర్‌ 25 నుంచి గత ఏడాది అక్టోబర్‌ 12 వరకు విధులు నిర్వర్తించిన సీవీ ఆనంద్‌... ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆ మరుసటి రోజు బదిలీ అయ్యారు. అప్పటి నుంచి గత ఏడాది డిసెంబర్‌ 13 వరకు సందీప్‌ శాండిల్య పోలీసు కమిషనర్‌గా వ్యవహరించారు. ఆ మరుసటి రోజు బాధ్యతలు స్వీకరించిన కొత్తకోట శ్రీనివాస రెడ్డిని శనివారం బదిలీ చేసిన ప్రభుత్వం మళ్లీ సీవీ ఆనంద్‌నే కొత్వాల్‌గా నియమించింది.  

నగర కమిషనరేట్‌ చరిత్రలో తొలిసారి..  
హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌కు 177 ఏళ్ల చరిత్ర ఉంది. అయితే సుదీర్ఘకాలం నిజాం ఏలుబడిలో ఉన్న హైదరాబాద్‌ 1948 సెప్టెంబర్‌లో జరిగిన ఆపరేషన్‌ పోలోతో దేశంలో విలీనమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 45 మంది పోలీసు కమిషనర్లుగా పని చేశారు. కేవలం రెండు సందర్భాల్లోనే ఏడాదిలో ముగ్గురు కమిషనర్లుగా పని చేశారు. ఈసారి ఆ కాలంలో ఏకంగా నలుగురు మారారు. ఆనంద్‌ది పునరాగమనం అయినప్పటికీ... ఈయన నాలుగో అధికారే. 1990లో మాత్రం మత కలహాలు సహా అప్పటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఏడాదిలో నలుగురు పోలీసులు కమిషనర్లుగా బాధ్యతలు నిర్వర్తించారు.  

ఇప్పటి వరకు ఏడుగురికే... 
హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ తొలి కొత్వాల్‌ హసన్‌ అలీ ఖాన్‌ నుంచి గత ఏడాది పోలీసు కమిషనర్‌గా వచి్చన కొత్తకోట శ్రీనివాసరెడ్డి వరకు మొత్తం 60 మంది అధికారులు ఈ పోస్టులో పని చేశారు. సీవీ ఆనంద్‌ సంఖ్య 61 కాగా.. ఇప్పటి వరకు ఏడుగురికి మాత్రమే రెండోసారి నగర పోలీసు చీఫ్‌గా పని చేసే అవకాశం దక్కింది. గతంలో సి.రంగస్వామి అయ్యంగర్, బీఎన్‌ కాలియా రావు, ఎస్‌పీ సత్తారు, కె.విజయరామారావు, ఆర్‌.ప్రభాకర్‌రావు, వి.అప్పారావు, ఆర్పీ సింగ్‌లకు మాత్రమే ఇలా పని చేయగలిగారు. 2003లో ఆర్పీ సింగ్‌ తర్వాత 21 ఏళ్లకు సీవీ ఆనంద్‌కు ఈ అరుదైన రికార్డు సాధించారు. 

చట్టం లేకపోయినా మహారాష్ట్ర తరహాలో.. 
నగర కొత్వాల్‌గా పునరాగమనం చేసిన ఆనంద్‌ 1991 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. ప్రస్తుతం డీజీపీ హోదాలో పోలీసు విభాగానికి నేతృత్వం వహిస్తున్న పోలీసు బాస్‌ డాక్టర్‌ జితేందర్‌ది 1992 బ్యాచ్‌. ఇలా డీజీపీ కంటే సీనియర్‌ అయిన అధికారి సిటీ కొత్వాల్‌గా నియమితులయ్యారు. ఈ విధానం ప్రత్యేక చట్టం ద్వారా మహారాష్ట్రలో ఉంది. అక్కడి ప్రత్యేక పరిస్థితులు, అనివార్య కారణాల నేపథ్యంలో డీజీపీ కంటే సీనియర్‌ అధికారినే ముంబై కమిషనర్‌గా నియమిస్తుంటారు. క్షేత్రస్థాయిలోనూ మహారాష్ట్ర డీజీపీ కన్నా ముంబై నగర కమిషనర్‌గా ఎక్కువ బాధ్యతలు, అధికారాలు ఉంటాయి.

ఆదర్శ్‌నగర్‌ టు ‘బంజారాహిల్స్‌’..
క్రికెట్, బ్యాడ్మింటన్, గోల్ఫ్‌ తదితర క్రీడల్లోనూ తనదైన మార్కు కలిగిన సీవీ ఆనంద్‌ పూరీ్వకులది రంగారెడ్డి జిల్లాలోని కుంట్లూరు. ఆనంద్‌ కుటుంబం మాత్రం ఆదర్శ్‌నగర్‌లో నివసించేది. ఆయన పాతబస్తీలోని ప్రభుత్వ మెటరి్నటీ ఆస్పత్రిలో జని్మంచారు. హెచ్‌పీఎస్‌ నుంచి మొదలైన ఆయన విద్యాభ్యాసం ఐపీఎస్‌ వరకు వెళ్లింది. బంజారాహిల్స్‌లోని తెలంగాణ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (టీజీ సీసీసీ), అందులోని పోలీసు కమిషనర్‌ కార్యాలయం సైతం ఆయన హయాంలోనే ప్రారంభమైంది. ఆయన కొత్వాల్‌గా ఉండగా హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌–న్యూ) సహా అనేక విభాగాలకు అంకురార్పణ జరిగింది. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
CV Anand
appointed
City Commissioner
Hyderabad
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.