Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్‌
ADVERTISEMENT 

మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్‌

Telangana Sakshi User Sakshi Sakshi Time May 8, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
comittee.jpg

బ్యారేజీ వివరాలు, నష్టంపై ఆరా.. సర్కారుకు నివేదిక ఇస్తామన్న కాళేశ్వరం కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ చంద్రఘోష్‌ 

ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలను స్టడీ చేయాల్సి ఉందని వెల్లడి 

కాళేశ్వరం:  కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీ (లక్ష్మి) కుంగిపోయిన అంశంపై ఏర్పాటు చేసిన జ్యుడీíÙయల్‌ కమిషన్‌ చైర్మన్, రిటైర్డ్‌ జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ మంగళవారం.. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. ఆయన రాష్ట్ర ఇరిగేషన్‌ ముఖ్య కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌తో కలసి మంగళవారం మధ్యాహ్నం 1.40 గంటలకు బ్యారేజీకి వద్దకు చేరుకున్నారు. 

బ్యారేజీ 7వ బ్లాక్‌లో కుంగిన 20వ నంబర్‌ పియర్‌.. దానికి అటూఇటూ ఉన్న 19, 21 పియర్లను.. వాటి కింది భాగంలో వచ్చిన పగుళ్లను పరిశీలించారు. వంతెనపై కాలినడకన వెళ్లి చూశారు. మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్న పరిస్థితులు, పియర్ల కుంగుబాటు, ఇతర అంశాలపై ఇరిగేషన్‌ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. తర్వాత ఎల్‌అండ్‌టీ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. భోజనం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విచారణ కోసం వచ్చినట్టు తెలిపారు. ఇరిగేషన్‌ నిపుణులతో కలసి మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించామని, ఇందుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్‌ఏ బృందం ఇచ్చిన నివేదికలను స్టడీ చేయాల్సి ఉందన్నారు. తాను ఇంజనీర్‌ను కాదని, టెక్నికల్‌ టీం వాటిని పరిశీలిస్తుందని వివరించారు.

మేడిగడ్డకు ఇంకా గండమే!
» బ్యారేజీకి మరింత ముప్పును తోసిపుచ్చలేమన్న నిపుణుల కమిటీ
»  తాత్కాలిక చర్యలను సిఫార్సు చేస్తూ మధ్యంతర నివేదిక
» నివారణ చర్యలు తీసుకున్నా తాత్కాలికమేనని వెల్లడి
»  మూడు బ్యారేజీల గేట్లన్నీ ఎత్తి ఉంచాల్సిందేనని సూచన
సాక్షి, హైదరాబాద్‌: మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్‌ వద్ద ప్రస్తుతం చేపట్టే ఎలాంటి చర్యలైనా తాత్కాలికమే నని.. మరింత దెబ్బతినకుండా ఉండటాకేనని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలోని నిపుణుల కమిటీ పేర్కొంది. 7వ బ్లాక్‌ మరింత ప్రమాదానికి లోన య్యే అవకాశాలను తోసిపుచ్చలేమని పేర్కొంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై నీటి ఒత్తి డి పడకుండా.. వర్షాకాలం ప్రారంభానికి ముందే అన్ని గేట్లను పూర్తిగా పైకి ఎత్తి ఉంచాలని.. బ్యారేజీ ల దిగువన కొట్టుకుపోయిన సీసీ బ్లాకులు, అప్రాన్‌ లను పునరుద్ధరించాలని సూచించింది. మేడిగడ్డలో మొరాయించిన గేట్లను అవసరమైతే తొలగించాల ని స్పష్టం చేసింది. 

కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్లోని లోపాలపై అధ్యయనం చేసి, పునరుద్ధరణకు తీసు కోవాల్సిన చర్యలను సిఫారసు చేయడానికి ‘నేషన ల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ)’ అయ్యర్‌ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కమిటీ పరిశీలన జరిపి.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు అత్యవసరంగా చేపట్టాల్సిన తా త్కాలిక మరమ్మతులు, తదుపరి అధ్యయనా లను సిఫారసు చేస్తూ మధ్యంతర నివేదిక సమర్పించింది. ఎన్డీఎస్‌ఏ చైర్మన్‌ అనిల్‌ జైన్‌ ఈ నెల 1న రాష్ట్ర నీటిపారుదల శాఖకు ఈ నివేదికను పంపించారు.

కుంగిపోయిన 7వ బ్లాక్‌కు సంబంధించి చేసిన సూచనలివీ..
» పియర్లు, ర్యాఫ్ట్‌ ఫ్లోర్‌కు ఏర్పడిన పగుళ్లలో వచ్చే మార్పులను టెల్‌–టేల్స్‌ వంటి తగిన సాంకేతిక పరిజ్ఞానంతో నిరంతరం సమీక్షిస్తూ ఉండాలి.
»   16 నుంచి 20వ నంబర్‌ వరకు పియర్లు స్వల్పంగా ఒరిగిపోవడం/ పగుళ్లు ఏర్పడటం జరిగింది. ఆ పగుళ్లు మరింత చీలకుండా తగిన రీతిలో బ్రేసింగ్‌ చేయాలి. అవసరమైతే బాక్స్‌ గ్రిడ్డర్, లాటిస్‌ గ్రిడ్డర్‌/ట్రస్‌ వంటిని వాడవచ్చు.
»   బ్యారేజీ పునాదిలోని ప్రెషర్‌ రిలీజ్‌ వాల్వŠస్‌ దెబ్బతిన్నాయి. మరమ్మతులైనా చేయాలి, కొత్తవైనా ఏర్పాటు చేయాలి.
»    బ్లాక్‌–7లోని అన్ని పియర్లపై ఆప్టికల్‌ టార్గెట్‌ పరికరాలను ఏర్పాటు చేసి, మార్పులను సమీక్షిస్తూ ఉండాలి.
»   ఎగువ, దిగువ సెకెంట్‌ పైల్స్, ఎగువ, దిగువ పారామెట్రిక్‌ జాయింట్ల పరిస్థితిని సమగ్రంగా మదించాలి.
»   దెబ్బతిన్న ప్లింత్‌ శ్లాబును తొలగించి నదీ గర్భాన్ని సరిచేయాలి. బ్యారేజీ కింద ఇసుక కొట్టుకుపోకుండా చూసే ఇన్వర్టెడ్‌ ఫిల్టర్లను తగిన ప్రాంతంలో ఏర్పాటు చేయాలి.
»   7వ బ్లాక్‌కు దిగువన నదీ గర్భంలో షీట్‌పైల్స్‌ను 9 మీటర్ల లోతు వరకు ఏర్పాటు చేయాలి. ర్యాఫ్ట్‌ చివరి కొన, ప్లింత్‌ శ్లాబు, షీట్‌పైల్‌ ఉపరితల భాగం మధ్యలో సిమెంట్, ఇసుక మిశ్రమంతో సీల్‌ వేసినట్టు జాయింట్లు వేయాలి.
»    ర్యాఫ్ట్‌కు సాధ్యమైనంత తక్కువ సంఖ్యలో రంధ్రాలు చేసి... దాని దిగువన ఏర్పడిన ఖాళీల్లోకి ఇసుక, సిమెంట్, నీటి మిశ్రమాన్ని పంపి పూడ్చివేయాలి.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Kaleshwaram Lift Irrigation Project
Inquiry Commission
CWC
Medigadda Barrage
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

మేడిగడ్డతో ముడిపడి ఉన్న కాళేశ్వరం భవిష్యత్తు!

మేడిగడ్డతో ముడిపడి ఉన్న కాళేశ్వరం భవిష్యత్తు!

మళ్లీ తెరపైకి గోదావరి నీటి లభ్యత

మళ్లీ తెరపైకి గోదావరి నీటి లభ్యత

‘మేడిగడ్డ లోపాలపై ఎలా ముందుకెళ్లాలో క్లారిటీ  వచ్చింది’

‘మేడిగడ్డ లోపాలపై ఎలా ముందుకెళ్లాలో క్లారిటీ వచ్చింది’

నేడు మేడిగడ్డకు సీఎం రేవంత్‌

నేడు మేడిగడ్డకు సీఎం రేవంత్‌

నీటి కేటాయింపులు లేకున్నా అడ్డగోలుగా ప్రాజెక్టులు

నీటి కేటాయింపులు లేకున్నా అడ్డగోలుగా ప్రాజెక్టులు

మేడిగడ్డకు బోర్‌హోల్‌ ‘పరీక్ష’

మేడిగడ్డకు బోర్‌హోల్‌ ‘పరీక్ష’

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.