Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. మహిళలకు 60 ఎమ్మెల్యే సీట్లు
ADVERTISEMENT 

మహిళలకు 60 ఎమ్మెల్యే సీట్లు

Telangana Sakshi User Sakshi Sakshi Time Jul 8, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
konda-sureka.jpg

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చే బాధ్యత.. గెలిపించే పూచీ నాదే 

త్వరలోనే అసెంబ్లీ ఎన్నికల్లోనూ 33% మహిళా రిజర్వేషన్లు 

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్‌ 

మంత్రి కొండా సురేఖతో కలిసి వనమహోత్సవం ప్రారంభం 

ఏజీ వర్సిటీ (హైదరాబాద్‌): త్వరలోనే నియోజకవర్గాల పునరి్వభజనతో అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 153 అసెంబ్లీ సీట్లకుగాను 50 సీట్లు అంటే 33 శాతం మంది ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు అవుతారని చెప్పారు. 33 శాతం సీట్లకు ఇంకో 10 సీట్లు కలిపి మొత్తం 60 సీట్లను ఆడబిడ్డలకు ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానన్నారు.

మంచిపనులు చేసి పేరు తెచ్చుకొనే మహిళలను గుర్తించి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడమే కాకుండా వారిని గెలిపించే పూచీ కూడా తనదేనన్నారు. సోమవారం హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అటవీ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రుద్రాక్ష మొక్కను నాటడం ద్వారా వనమహోత్సం–2025 కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

ఇంటింటా రెండేసి మొక్కలు.. 
తల్లి పేరుతో ఒక మొక్కను నాటాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని.. దీన్ని స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ కోవలోనే రాష్ట్రంలోని తల్లులంతా వారి పిల్లల పేరుతో ఇళ్ల ఆవరణలో రెండేసి మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. మొక్కలను పిల్లల్లాగే సంరక్షిస్తే తెలంగాణ రాష్ట్రమంతా పచ్చదనంతో నిండిపోతుందన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది అటవీ శాఖ ఆధ్వర్యంలో 18 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపడుతుందని.. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నారు. 

ఆడబిడ్డల ఆత్మగౌరవం కోసం.. 
ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో జీవించేలా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఒకప్పుడు సోలార్‌ పవర్‌ ప్రాజెక్టులను అదానీ, అంబానీలు మాత్రమే ఏర్పాటు చేసేవారని.. కానీ తాము మూడేసి మెగావాట్ల సౌరవిద్యుత్‌ ప్రాజెక్టులను మహిళా స్వయం సేవా సంఘాలకు అప్పగిస్తున్నామని చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను ఆడబిడ్డలకు అప్పగించామని.. ఆర్టిసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాకుండా ఆర్టిసీకి వెయ్యి బస్సులను అద్దెకు ఇచ్చేలా ప్రొత్సహించి వారిని బస్సులకు యజమానులను చేశామని సీఎం వివరించారు. హైటెక్‌ సిటీలో విప్రొ, మైక్రోసాప్ట్‌ లాంటి సంస్థలు ఉండేచోట 3.5 ఎకరాల స్థలాన్ని మహిళా స్వయం సేవా సంఘాలకు కేటాయించి వారు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించడానికి వీలు కల్పించామని చెప్పారు. ఈ ఏడాది మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా రూ. 21 వేల కోట్ల మేర రుణాలు అందించామని తెలిపారు. 

చెట్లు పెంచితేనే సకాలంలో వర్షాలు: మంత్రి కొండా సురేఖ 
చెట్లను కాపాడితే అవి మనల్ని కాలుష్యం నుంచి కాపాడతాయని, జీవవైవిధ్యాన్ని రక్షించుకోవడంలో దోహదపడతాయని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. చెట్లను పెంచడం ద్వారానే వర్షాలు సకాలంలో కురుస్తాయని చెప్పారు. వనమహోత్సవం కార్యక్రమంలో 100 శాతం మొక్కలు నాటి వాటిని కాపాడేందుకు రాష్ట్రంలోని ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు.

ఈ సందర్భంగా అటవీశాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను అధికారులు, ప్రజాప్రతినిదులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి కొండా సురేఖ తిలకించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, కాలె యాదయ్య, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌ శ్రీలత శోభన్, కమిషనర్‌ కర్ణన్, జిల్లా ఆదనపు కలెక్టర్‌ ప్రతిమా సింగ్, వీసీలు జానయ్య, రాజిరెడ్డి, ఉన్నతాదికారులు పాల్గొన్నారు. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Revanth Reddy
MLA tickets
women
womens reservations
Telangana
Assembly Elections
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.