Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. ‘మూసీ’ నిర్వాసితులకు ‘డబుల్‌’ ఇళ్లు!
ADVERTISEMENT 

‘మూసీ’ నిర్వాసితులకు ‘డబుల్‌’ ఇళ్లు!

Telangana Sakshi User Sakshi Sakshi Time Sep 25, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
revanth.jpg

చెరువులు, నాలాల ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలో నివసిస్తున్న అర్హులైన పేదలకూ కేటాయింపు

మూసీ రివర్‌ఫ్రంట్‌పై సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం 

జల వనరుల పరిరక్షణ చర్యల్లో పేదలు రోడ్డున పడొద్దు 

వారికి డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపాలి 

ఇకపై చెరువులు, నాలాలు ఆక్రమణకు గురవకుండా గట్టి పర్యవేక్షణ 

సీసీ కెమెరాలతో నిఘా పెట్టాలని ఆదేశం 

శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్‌ సిటీకి మెట్రోరైల్‌ విస్తరణ

సాక్షి, హైదరాబాద్‌: మూసీ పరీవాహక ప్రాంతంతోపాటు హైదరాబాద్‌లోని చెరువులు, నాలాల ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్లలో నివసిస్తున్న అర్హులైన పేదలెవరూ నిరాశ్రయులు కావడానికి వీల్లేదని ముఖ్య­మంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. జల వనరుల పరిరక్షణలో పేదలు రోడ్డున పడవద్దని, అర్హులైన వారికి డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపించాలని ఆదేశించారు. నీటి వనరుల పరిరక్షణకు వారు సహకరించేలా ఒప్పించడంతోపాటు అర్హులైన పేదలకు భరోసా కల్పించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. 

ఈ మేరకు అర్హులైన పేదల వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపల ఉన్న చెరువులు, కుంటల పరిరక్షణను బాధ్యతగా చేపట్టాలని.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తుపెట్టుకోవాలని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌ మంగళవారం జూబ్లీహిల్స్‌లోని నివాసంలో మూసీ రివర్‌ ఫ్రంట్, మెట్రో రైలుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఇకపై చెరువులు, నాలాలు ఆక్రమణకు గురికాకుండా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని సీఎం రేవంత్‌ ఆదేశించారు. నగరంలోని అన్ని చెరువుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేయాలన్నారు. 

ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్లు తేల్చండి 
ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలు అన్నింటినీ గుర్తించి ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్లను గుర్తించాలని.. ఆక్రమణల వివరాలన్నీ సేకరించాలని సీఎం రేవంత్‌ అధికారులను ఆదేశించారు. దీనిపై పూర్తి స్థాయి నివేదికను రూపొందించాలని సూచించారు. అదే సమయంలో నిజమైన, అర్హులైన పేదలకు నష్టం జరగకుండా ప్రభుత్వం చేపట్టే చర్యలు ఉండాలని పేర్కొన్నారు. 

ఫ్యూచర్‌ సిటీకి మెట్రో రైలు 
శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్‌ సిటీకి మెట్రో మార్గం ఏర్పాటు చేయాలని, దీనిపై పూర్తిస్థాయి నివేదికను రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. పాతబస్తీ మెట్రో విస్తరణ పనులను వేగంగా చేపట్టాలన్నారు. మెట్రో మార్గాలకు సంబంధించిన భూసేకరణ, ఇతర అడ్డంకులపై ప్రత్యేకంగా దృష్టి సారించి, పరిష్కరించాలని సూచించారు. దసరాలోపు మెట్రో విస్తరణపై పూర్తిస్థాయి డీపీఆర్‌ను సిద్ధం చేసి కేంద్రానికి సమర్పించాలన్నారు. 

నేటి నుంచే ‘మూసీ’ పునరావాస ప్రక్రియ! 
మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో భాగంగా నిర్వాసితులయ్యే కుటుంబాలకు 16 వేల డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ రివర్‌ బెడ్‌ (నదీ గర్భం), బఫర్‌ జోన్లలో నివాసమున్న వారికి పునరావాసం కల్పించేందుకు వీటిని ఉపయోగిస్తారు. మూసీ ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని సీఎం రేవంత్‌ ప్రకటించిన నేపథ్యంలో.. పునరావాస ప్రక్రియను బుధవారం ప్రారంభించనున్నా­రు. 10,200 మందిని నిర్వాసితులుగా గుర్తించారు. 

బుధవారం నుంచి రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌ జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందాలు.. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ఎక్కడెక్కడ డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను కేటాయించారో వివరించనున్నారు. తొలుత రివర్‌ బెడ్‌లోని  1,600 ఇళ్లను తొలగిస్తారు. వారిలో అర్హులైన పేదలకు డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు ఇస్తారు. ఇక మూసీ బఫర్‌జోన్‌లో నివసించే వ్యక్తులు, నిర్మాణాలకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే సదరు నిర్మాణ ఖర్చుతోపాటు పట్టా ఉన్న భూమి విలువను పరిహారంగా చెల్లిస్తారు. డబుల్‌ బెడ్రూమ్‌ ఇంటిని కూడా కేటాయిస్తారు.   

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Revanth Reddy
Double Bedroom Housing Scheme
Musi River
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.