Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. ఇందిరమ్మ రెండో విడతకు నేడు శ్రీకారం
ADVERTISEMENT 

ఇందిరమ్మ రెండో విడతకు నేడు శ్రీకారం

Telangana Sakshi User Sakshi Sakshi Time Jun 1, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
houses.jpg

ఆసిఫాబాద్‌ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి 

మొదటి విడతతో పోలిస్తే తగ్గిన కోటా 

రెండు విడతలు, క్యూర్‌ పరిధి ఇళ్లతో కలిపి 8 లక్షలకు చేరుకోనున్న ఇందిరమ్మ ఇళ్లు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రవేశపెట్టిన పేదలకు సొంటింటిని కల్పించే ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతకు శ్రీకారం చుడుతోంది. కీలక పథకమే అయినప్పటికీ, తొలివిడత కేటాయించిన ఇళ్ల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరగటం, కేంద్రం నుంచి సకాలంలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద ఆర్థిక సాయం అందకపోవటం వెరసి కాస్త గందరగోళంగా మారిన ఈ పథకాన్ని ఎట్టకేలకు పట్టాలెక్కించిన ప్రభుత్వం, సోమవారం రెండో విడత ఇళ్ల కేటాయింపు ప్రారంభిస్తోంది.

ఆసిఫాబాద్‌ జిల్లా కరమెర మండలం కొఠారి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్వయంగా రెండో విడతను ప్రారంభిస్తున్నారు. అక్కడికి సమీపంలోని కొత్తగూడలో మొదటి విడతలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలను కూడా ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా లక్షకుపైగా ఇళ్ల గృహప్రవేశాలు జరగబోతున్నాయి.   

గృహ ప్రవేశానికి 1.13 లక్షల ఇళ్లు..  
గత ఏడాది ఫిబ్రవరి 3న నారాయణపేట జిల్లాలో ఇందిరమ్మ మొదటి విడత ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ విడతలో నియోజకవర్గానికి మూడున్నర వేల ఇళ్లు కేటాయించారు. ప్రభుత్వం కోటా కలుపుకొని 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేశారు. వాటిల్లో ఇప్పటికే 60 వేల ఇళ్ల గృహప్రవేశాలు పూర్తయ్యాయి. ఇప్పుడు 1.13 లక్షల ఇళ్లు సిద్ధమయ్యాయి.

వాటి గృహప్రవేశాలు జరగబోతున్నాయి. 50 వేల మంది లబి్ధదారుల ఇళ్ల నిర్మాణం మొదలుకాలేదు. మిగతావి వివిధ స్థాయిల్లో ఉన్నాయి. ఇప్పుడు రెండో విడతకు వచ్చే సరికి ప్రభుత్వం కోటాను తగ్గించింది. జీహెచ్‌ఎంసీ–కోర్‌ పరిధి పోను మిగతా వంద నియోజకవర్గాలకు సంబంధించి రెండున్నర లక్షల ఇళ్లను మంజూరు చేసింది. ఐటీడీఏ ప్రాంతాల్లోని గిరిజన నియోజకవర్గాలకు అదనంగా 500 నుంచి 1500 వరకు మంజూరు చేయటం విశేషం.  


కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్‌ వద్ద ఏర్పాట్లు పరిశీలిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు 

పేదల ఇళ్ల రికార్డు 
ఈ ఆర్థిక సంవత్సరానికి గాను క్యూర్‌ పరిధిలో లక్ష ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో దాదాపు 10 అంతస్తుల్లో ఉండే భారీ టవర్లు కూడా ఉండనున్నాయి. ఇవి కాకుండా నగరంలో సొంత జాగా ఉన్న లబ్ధిదారులకు వ్యక్తిగత ఇళ్ల­ను కూడా మంజూరు చేస్తారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను కూడా ఇప్పుడే లబ్ధిదారులకు కేటాయించనున్నారు.

డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మంజూరై , లబ్ధిదా­రులు పూర్తి చేసుకోలేకపోయిన నాటి ఇందిరమ్మ ఇళ్ల­కు కూడా ఇప్పుడు నిధులు మంజూరు చేయనున్నా­రు. గత ప్రభుత్వం 2023లో గృహలక్ష్మి పథకంలో మంజూరు చేసిన ఇళ్లకు కూడా నిధులు మంజూరు చేస్తారు. వెరసి మరో ఏడాదిన్నరలో రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లు సిద్ధమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒక రాష్ట్రంలో స్వల్ప సమయంలో ఇంత భారీ సంఖ్యలో పేదల కోసం ఇళ్ల నిర్మాణం జరగటం రికార్డుగా ప్రభుత్వం చెబుతోంది.

నేడు కుమురంభీం జిల్లాకు సీఎం 
రెబ్బెన: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రత్యేక హెలిక్యాప్టర్‌ ద్వారా సాయంత్రం 5:45 గంటలకు కెరమెరి మండలం కొఠారి పంచాయతీ పరిధిలోని కొత్తగూడకు చేరుకుంటారు. గ్రామంలో నిర్మించిన 25 ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొని లబి్ధదారులతో మాట్లాడతారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభిస్తారు. అనంతరం 6.55 గంటలకు కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. 

జిల్లాలో రూ.112.14 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంబోత్సవాలు చేస్తారు. 8.30 గంటల వరకు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌ నివాసానికి వెళ్తారు. అక్కడే భోజనం చేసి రాత్రి 10 గంటలకు రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు బయల్దేరుతారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎం సభ ఇన్‌చార్జి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్, ఎమ్మెల్సీ దండె విఠల్, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ పరిశీలించారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
indiramma houses
asifabad district
Revanth Reddy
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.