Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. గల్ఫ్‌ కార్మీకులకు జీవిత బీమా..: సీఎం రేవంత్‌రెడ్డి
ADVERTISEMENT 

గల్ఫ్‌ కార్మీకులకు జీవిత బీమా..: సీఎం రేవంత్‌రెడ్డి

Telangana Sakshi User Sakshi Sakshi Time Apr 17, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
REVANTH3.jpg

రాష్ట్ర రైతుల తరహాలోనే.. ఆయా దేశాల ప్రతినిధులతో భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి 

ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం..

ప్రజాభవన్‌లో ప్రత్యేక వ్యవస్థ.. టోల్‌ ఫ్రీ నంబర్‌ 

ఏజెంట్లకు చట్టబద్ధత ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ 

కొన్నిసార్లు ఓటమి కూడా మంచి భవిష్యత్తుకు దోహదపడుతుందని వ్యాఖ్య 

జీవన్‌రెడ్డి కేంద్ర మంత్రి అవుతారని భావిస్తున్నట్లు వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రైతుల తరహాలోనే గల్ఫ్‌ కార్మీకులకు కూడా జీవిత బీమా సౌకర్యం కల్పిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. తెలంగాణకు చెందిన 15 లక్షల కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి పొందుతున్నాయని.. వీరి సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గల్ఫ్‌తో పాటు ఇతర దేశాల్లో ఉండే తెలంగాణ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం కోసం సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నేతృత్వంలో 24 గంటలూ అందుబాటులో ఉండేలా ప్రజాభవన్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నంబర్‌ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. సెప్టెంబర్‌ 17లోపు ఈ వ్యవస్థను పకడ్బందీగా ఏర్పాటు చేసే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. గల్ఫ్‌ దేశాల ప్రతినిధులు మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 



అధికారంలోకి రాగానే గల్ఫ్‌ సమస్యలపై దృష్టి 

ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయ పార్టీలు గల్ఫ్‌ కార్మీకుల సమస్యలను పట్టించుకుంటాయన్న అభిప్రాయం ఉందని, కానీ తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శేషాద్రి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసి, తెలంగాణ గల్ఫ్‌ అండ్‌ అదర్‌ ఓవర్సీస్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ బోర్డు ద్వారా గల్ఫ్‌తో పాటు ఇతర దేశాల్లో ఉన్న తెలంగాణ వారి హక్కులకు రక్షణ కల్పించాలని నిర్ణయించామని రేవంత్‌ చెప్పారు. చనిపోయిన కార్మీకుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేయాలని కూడా నిర్ణయించినట్లు తెలిపారు.



పలు రాష్ట్రాల గల్ఫ్‌ విధానాలు అధ్యయనం చేసి రూపొందించిన డాక్యుమెంట్‌లో సవరణలు, సూచనల కోసం లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజాభవన్‌లో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ భేటీకి గల్ఫ్‌ కార్మీకుల ప్రతినిధులను ఆహ్వానించి చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారు. ఏజెంట్లకు చట్ట బద్ధత ఉండేలా..రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నమోదు కాకుండా ఏ కార్మీకుడినీ ఏజెంట్లు దేశం దాటించే పరిస్థితి లేకుండా పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు.  



జీవన్‌రెడ్డి కేంద్రమంత్రి అవుతారని భావిస్తున్నా.. 

‘కొన్నిసార్లు ఓటమి కూడా మంచి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. అందుకు నేనే ఉదాహరణ. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నేను ఓడిపోయా. అప్పుడు నా మిత్రులు బాధపడితే శత్రువులు మాత్రం నా పని అయిపోయిందని సంతోషించారు. కానీ మూడు నెలలు తిరిగేసరికి ఎన్నికలొచ్చి ఎంపీనయ్యా. ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడిని అయ్యా. ఆ తర్వాత ముఖ్యమంత్రిని అయ్యా. జీవన్‌రెడ్డి కూడా అదృష్టం వరించి కేంద్రంలో మంత్రి అవుతారని భావిస్తున్నా. కేంద్రంలో తెలంగాణ గల్ఫ్‌ కార్మీకుల పక్షాన మాట్లాడేందుకు, విదేశాంగ మంత్రితో సంప్రదింపులు జరిపేందుకు నిజామాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డిని గెలిపించాలి..’అని ముఖ్యమంత్రి కోరారు.  



సాయం చేసేందుకు కేసీఆర్‌కు మనసు రాలేదు: జీవన్‌రెడ్డి 

గత పదేళ్లలో రూ.2 లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని తీసుకురావడం ద్వారా గల్ఫ్‌ కార్మీకులు రూ.20 వేల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వానికి సమకూర్చారని జీవన్‌రెడ్డి తెలిపారు. గల్ఫ్‌ నుంచి ప్రతి యేటా 200 వరకు శవపేటికలు వచ్చేవని, పదేళ్లలో 2 వేల మంది చనిపోతే వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.100 కోట్లు ఇచ్చేందుకు కేసీఆర్‌కు మనసు రాలేదని విమర్శించారు.  



గల్ఫ్‌ గోస లేకుండా చూడండి 

సమావేశంలో పాల్గొన్న పలువురు ప్రతినిధులు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు గల్ఫ్‌ గోస లేకుండా చూడాలని సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి చేశారు. ఎన్నారై సెల్‌ను పటిష్టం చేయాలని, గల్ఫ్‌ దేశాల్లోని ఎంబసీల్లో తెలుగువారిని నియమించాలని, ప్రత్యేక గల్ఫ్‌ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, కేరళ తరహా పాలసీని రూపొందించాలని కోరారు.



గల్ఫ్‌లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించినందుకు కృతజ్ఞతగా గల్ఫ్‌ నుంచి తెచ్చిన ఖర్జూరాలను ముఖ్యమంత్రికి అందజేశారు. టీపీసీసీ ఎన్నారై సెల్‌ అంతర్జాతీయ కన్వీనర్‌ మంద భీంరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సెల్‌ చైర్మన్‌ డాక్టర్‌ వినోద్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, ఖైరతాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.    

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Revanth Reddy
Gulf countries
Life insurance
Workers
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

దుబాయ్‌ భారత కాన్సులేట్‌లోకి ఇక నేరుగా నో ఎంట్రీ!

దుబాయ్‌ భారత కాన్సులేట్‌లోకి ఇక నేరుగా నో ఎంట్రీ!

‘ఆనాడు మీరు నాటిన మొక్క ఇప్పుడు ఇలా’

‘ఆనాడు మీరు నాటిన మొక్క ఇప్పుడు ఇలా’

కేంద్రమంత్రి ఖట్టర్‌తో.. సీఎం రేవంత్ భేటీ

కేంద్రమంత్రి ఖట్టర్‌తో.. సీఎం రేవంత్ భేటీ

ట్రంప్‌-ఇరాన్ డీల్‌.. గల్ఫ్ దేశాల్లో గుబులు!

ట్రంప్‌-ఇరాన్ డీల్‌.. గల్ఫ్ దేశాల్లో గుబులు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.