Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. నేను చెప్పినా.. నిర్లక్ష్యమేనా?
ADVERTISEMENT 

నేను చెప్పినా.. నిర్లక్ష్యమేనా?

Telangana Sakshi User Sakshi Sakshi Time Jun 15, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
cm.jpg

వర్షాకాల సన్నద్ధతలో సమన్వయ లోపం: అధికారులపై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్‌

జూన్‌ 9న వర్షంతో ‘క్యూర్‌’లో రోడ్లపై భారీ వరద.. ట్రాఫిక్‌ జామ్‌ 

వాతావరణ శాఖ హెచ్చరించినా సిబ్బంది అప్రమత్తం కాలేదు 

మున్సిపల్, పోలీసు అధికారుల మధ్య తీవ్ర సమన్వయ లోపం ఉందన్న సీఎం 

బాధ్యులైన అధికారులపై చర్యలకు సీఎస్, డీజీపీకి ఆదేశం 

ఇకపై వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని స్పష్టీకరణ 

అధికారులు, పోలీసులు రోడ్లపై ఉండాల్సిందేనని, అవసరమైతే తానూ రోడ్డు మీదకి వస్తానన్న ముఖ్యమంత్రి 

అలసత్వం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలకు హెచ్చరిక  

సాక్షి, హైదరాబాద్‌: కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (క్యూర్‌) పరిధిలో జూన్‌ 9న భారీ వర్షం కారణంగా ఏర్పడిన పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సైబరాబాద్‌తో పాటు అనేక ప్రాంతాల్లో రోడ్లను వరద ముంచెత్తి గంటల తరబడి ట్రాఫిక్‌ జామ్‌ కావడం, నగరవాసులు ఇబ్బందులు పడటంపై మండిపడ్డారు. వర్షంతో పలుచోట్ల చెట్లు కూలిపోవడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని చెప్పారు. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ మున్సిపల్, పోలీసు, ట్రాఫిక్‌ సిబ్బంది అప్రమత్తం కాలేదన్నారు. వర్షాకాల సన్నద్ధతపై జూన్‌ 1న సమీక్ష సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పడంతో పాటు తాను అనేక సూచనలు చేశానని..అయినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 9వ తేదీన వర్షం సమయంలో, ఆ తర్వాత మున్సిపల్, పోలీసు అధికారుల మధ్య సమన్వయం లోపించిందన్నారు. ఈ పరిస్థితికి గల కారణాలను విశ్లేషించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ సీవీ ఆనంద్‌లను ఆదేశించారు. మరోసారి ఇలాంటి పరిస్థితి తలెత్తితే కఠిన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. వర్షాకాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి ఆదివారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.  

పోలీస్‌ కమిషనర్, అవసరమైతే నేనూ.. 
‘అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఇకపై వర్షాల సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. అలసత్వంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవు. వాతావరణ శాఖ సూచనల మేరకు వర్షాలపై ముందస్తు చర్యలు తీసుకోవాలి. వర్షం సమయంలో పురపాలక, హైడ్రా, ట్రాఫిక్, జలమండలి సిబ్బందితో పాటు పోలీసులూ క్షేత్రస్థాయిలో ఉండాల్సిందే. పోలీసు కమిషనర్‌ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు రోడ్లపైకి రావాల్సిందే. అవసరమైతే నేను కూడా రోడ్డుపైకి వస్తా.  

ట్రాఫిక్‌ జామ్‌ అయితే కఠిన చర్యలు 
వర్షం కారణంగా ట్రాఫిక్‌ జామ్‌ అయితే ఇకపై కఠిన చర్యలు తప్పవు. ట్రాఫిక్‌ విభాగంలోని ఖాళీలను డీజీపీ తక్షణమే భర్తీ చేయాలి. మానవ తప్పిదాల వల్ల సమస్యలు తలెత్తితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించను. వర్షాల సమయంలో ఏర్పడే వాటర్‌ లాగింగ్‌ పాయింట్లు, బ్లాక్‌ స్పాట్లు, ట్రాఫిక్‌ జామ్‌ అయ్యే ప్రాంతాల డేటా ఆధారంగా అధికారులు సన్నద్ధం కావాలి. విద్యుత్‌ పునరుద్ధరణ వెంటనే జరగాలి. అవసరమైన చోట్ల మొబైల్‌ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలి. వర్షం సమయంలో విద్యుత్‌ శాఖ సిబ్బంది అంతా క్షేత్రస్థాయిలో పనిచేసేలా చూడాలి. 

ఇంజనీర్లు ప్రాజెక్టుల వద్దే ఉండాలి 
వర్షాల నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులు రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టుల వద్ద పటిష్ట చర్యలు తీసుకోవాలి. మాన్యువల్‌ ప్రకారం ప్రాజెక్టుల నిర్వహణ ఉండాలి. వర్షాకాలంలో ప్రాజెక్టుల వద్ద సంబంధిత ఇంజినీర్లు తప్పనిసరిగా స్థానికంగా ఉండాలి. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ప్రాజెక్టులను వదిలి వెళ్లే ఇంజినీర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రాజెక్టుల గేట్ల మరమ్మతులు, నిర్వహణకు అవసరమైన నిధులను ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా వెంటనే మంజూరు చేయాలి..’ అని సీఎం ఆదేశించారు. 

విత్తనాలు, యూరియాపై దృష్టి పెట్టండి             
‘వ్యవసాయ సీజన్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలలి. ముఖ్యంగా విత్తనాలు, యూరియా పంపిణీపై దృష్టి సారించాలి. రైతు వేదికల ద్వారా యూరియా పంపిణీ చేయాలి. యూరియా నిల్వ, పంపణి కోసం స్థానిక వ్యవసాయ అధికారిని బాధ్యుడిగా నియమించడంతో పాటు రెవెన్యూ సిబ్బందిని కూడా భాగస్వామ్యం చేయాలి. సన్న వడ్ల కోసం వ్యవసాయ శాఖ ప్రకటించిన 8 రకాల విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలి. 

తాగునీరు కలుషితం కావొద్దు.. 
వర్షాల కారణంగా తాగునీరు కలుషితం కాకుండా చూడాలి. గతంలో తాగునీటి కాలుష్యంతో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి. జలమండలి అధికారులు ఎప్పటికప్పుడు నీటి పరీక్షలు నిర్వహించాలి. నీటి కాలుష్యం వల్ల  అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలి. సీజనల్‌ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని అవసరమైన మందులను సిద్ధం చేసుకోవాలి. వర్షాలతో నీటి నిల్వలు ఏర్పడి అపరిశుభ్ర వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నందున పారిశుధ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి..’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

పురపాలక, జలమండలి, వైద్య ఆరోగ్య శాఖలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌ను ఆదేశించారు. పోలీసు, ట్రాఫిక్, ఫైర్, హైడ్రా, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు. సమీక్షలో డీజీపీ, సీఎస్‌లతో పాటు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Revanth Reddy
Rain
Officials
Meteorological Department (IMD)
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.