Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. నాలుగు పథకాలపై.. నేడు కీలక భేటీ
ADVERTISEMENT 

నాలుగు పథకాలపై.. నేడు కీలక భేటీ

Telangana Sakshi User Sakshi Sakshi Time Jan 25, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
RECEIVING-AIRPORT-5.jpg

అధికారులు, మంత్రులతో సీఎం సమావేశం  

పథకాల అమలు, ప్రారంభంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం  

లబ్ధిదారుల ఎంపిక మార్గదర్శకాలపై చర్చ

రాష్ట్రవ్యాప్తంగా 16,348 గ్రామ/వార్డు సభలు పూర్తి  

జీహెచ్‌ఎంసీలో మరికొన్ని రోజులు జరగనున్న వార్డు సభలు

సాక్షి, హైదరాబాద్‌: ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతుభరోసా పథకాలను ఈనెల 26వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు ప్రారంభించాలన్న దానిపై కీలకభేటీ జరగనుంది. దావోస్‌ పర్యటన ము గించుకొని శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి శనివారం అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమవుతారు. ఈ నాలుగు పథకాలను జిల్లా స్థాయిలో కార్యక్రమాలు పెట్టి ప్రారంభించాలా లేక రాష్ట్రస్థాయిలో లాంఛనంగా ప్రారంభించాలా అన్న దానిపై నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది.

లబ్ధిదారుల ఎంపిక విషయంలో కూడా ఆ సమావేశంలోనే స్పష్టమైన మార్గ దర్శకాలు జారీ చేస్తారని, అదే సమయంలో లబ్ధిదారుల సంఖ్యపై కూడా పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశమున్నట్టు తెలిసింది. రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గ్రామసభల్లో పేర్లు చదవడంపై కొన్ని జిల్లాల్లో లబ్ధిదారులు ఆందోళన చేయడం, అధికారుల తీరుపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి విదితమే. మంత్రులతో సమావేశానంతరం పథకాల ప్రారంభానికి సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్‌ విడుదల చేయనున్నట్టు సమాచారం.  

నాలుగు రోజుల గ్రామసభలు పూర్తి: ఇందిరమ్మ ఇళ్లతోపాటు ఇతర మూడు పథకాలకు సంబంధించి గ్రామస్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన గ్రామసభలు శుక్రవారంతో ముగిశాయి. రాష్ట్రంలో మొత్తం 16,348 గ్రామ/వార్డు సభలు పూర్తయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మాత్రం వార్డు సభలు మరికొన్ని రోజులు జరగనున్నాయి. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జరిగిన ఈ సభల్లో ఆయా పథకాల కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలు, లబ్ధిదారుల జాబితాలను చదివి వినిపించిన అధికారులు పలు పథకాల కోసం మళ్లీ ప్రజల నుంచి కొత్తగా దరఖాస్తులు కూడా తీసుకున్నారు.

ప్రధానంగా రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు అందినట్టు సమాచారం. ఈ దరఖాస్తులను వడపోసిన తర్వాతే పూర్తిస్థాయి లబ్ధిదారుల జాబితా సిద్ధమవుతుందని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన గత సంవత్సరంలో నిర్వహించిన ప్రజాపాలన సమావేశాల్లో 83 లక్షల దరఖాస్తులు రాగా, అందులో 30 లక్షల మంది అర్హులుగా తేల్చారని, అందులోనూ తొలి విడతలో భాగంగా అత్యంత పేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్‌జెండర్ల, గిరిజనులకు ప్రాధాన్యమివ్వాలని, వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనట్టు సర్టిఫికెట్‌ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం 
యోచిస్తోంది.  


⇒ రేషన్‌కార్డులకు సంబంధించి 6.85లక్షల మంది లబ్ధిదారుల జాబితాను గ్రామసభల్లో చదివి వినిపించారు. ఇందులో అభ్యంతరాలు వచ్చిన దరఖాస్తులను, గ్రామసభల్లో కొత్తగా వచ్చిన దరఖాస్తులను పునఃపరిశీలించనున్నారు. ఆ తర్వాతే కొత్త రేషన్‌కార్డుల లబ్ధిదారుల తుది జాబితా తయారు చేయనున్నారు. 
⇒ రైతు భరోసా కోసం ఈనెల 16 నుంచి 20వ తేదీవరకు గ్రామస్థాయిలో సాగు యోగ్యం కాని భూముల గుర్తింపు ప్రక్రియ జరిగింది. ఈ ప్రక్రియలో భాగంగా 10–15 లక్షల ఎకరాలు సాగు యోగ్యం కావని తేల్చినట్టు తెలిసింది. ఆత్మీయ భరోసా కింద 10 లక్షల మంది వరకు అర్హులను గుర్తించారని, వీరికి తొలి విడతలో భాగంగా అవసరమయ్యే నిధుల చెక్కును కూడా విడుదల చేస్తారని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది.

సీఎం రేవంత్‌కు ఘన స్వాగతం
శంషాబాద్‌: దావోస్‌లో మూడురోజుల పర్యటన ముగించుకొని వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. విమానాశ్రయ లాంజ్‌లో ఎమ్మెల్యేలు శాలువాలతో సీఎంను సత్కరించారు. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Revanth Reddy
Ministers
Telangana
indiramma houses
new ration cards
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.