Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. Telangana: కొత్త పీఆర్సీ
ADVERTISEMENT 

Telangana: కొత్త పీఆర్సీ

Telangana Sakshi User Sakshi Sakshi Time Oct 3, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
prc.jpg

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీపి కబురు అందించారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఎన్‌.శివశంకర్‌ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర రెండో వేతన సవరణ సంఘం (పీఆర్సీ)ను ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి బి.రామయ్య కమిటీ సభ్యుడిగా వ్యవహరించనున్నారు. వేతన సవరణ సంఘం నివేదిక సమర్పించే వరకు ఉద్యోగులు, పెన్షనర్ల మూలవేతనం/మూల పెన్షన్‌పై 5 శాతం మధ్యంతర భృతి (ఐఆర్‌)ని చెల్లించాలని కూడా సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.



ప్రస్తుత అక్టోబర్‌ నెల నుంచే ఐఆర్‌ను వర్తింపజేయనున్నారు. ఈ మేరకు కొత్త పీఆర్సీ ఏర్పాటు, మధ్యంతర భృతి చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. ఆరు నెలల్లోగా నివేదికను సమర్పించాలని కమిటీని ఆదేశించారు. వేతన సవరణ సిఫారసుల కోసం దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలపై మార్గదర్శకాలు జారీ చేశారు.



‘రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రస్తుత వేతనాలను పరిగణనలోకి తీసుకుని ఉద్యోగుల వేతన సవరణపై సిఫారసులు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వృద్ధి, రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత, భవిష్యత్తు మూలధన పెట్టుబడి అవసరాలు/ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి..’ అని సూచించారు.     



5% ఐఆర్‌తో రూ.2 వేల కోట్లకు పైగా భారం! 

ప్రస్తుతం అమల్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర తొలి వేతన సవరణ గడువు గత జూన్‌ 30తో ముగిసింది. జూలై 1 నుంచి ఉద్యోగులకు కొత్త వేతన సవరణ వర్తింపజేయాల్సి ఉంది. తాజాగా ఏర్పాటైన రాష్ట్ర రెండో పీఆర్సీ.. వేతన సవరణ ఫిట్‌మెంట్‌ శాతాన్ని సిఫారసు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. ఆ తర్వాత ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరిపి కొత్త పీఆర్సీ అమలుపై నిర్ణయం తీసుకుంటుంది. అప్పటివరకు 5 శాతం మధ్యంతర భృతిని ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లించనుంది.



వేతన సవరణ అమల్లోకి వచ్చిన తర్వాత అప్పటివరకు చెల్లించిన ఐఆర్‌ను సర్దుబాటు చేసి ఉద్యోగులకు రావాల్సిన మిగిలిన వేతన సవరణ బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తుంది. కాగా 5 శాతం ఐఆర్‌ అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2 వేల కోట్లకు పైగా భారం పడనుందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. దీనికి ముందు 2018 జూలై 1 నుంచి కొత్త పీఆర్సీని వర్తింప చేయాల్సి ఉండగా.. కోవిడ్‌ కారణంగా ప్రభుత్వం వాయిదా వేసింది. 2020 ఏప్రిల్‌ 1 నుంచి ఉద్యోగులు, పెన్షనర్లకు 30 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ప్రయోజనాలను అమలు చేసింది. 

ఐఆర్‌ వీరికి వర్తిస్తుంది..  

► రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, స్థానిక సంస్థల ఉద్యోగులు, వర్క్‌ చార్జ్‌డ్‌ ఉద్యోగులు, ప్రభుత్వం నుంచి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ అందుకుంటున్న సంస్థల ఉద్యోగులకు మాత్రమే ఐఆర్‌ను వర్తింపజేయనున్నారు. 



కాంట్రాక్టు ఉద్యోగులకు వర్తించదు.. 

► తెలంగాణ ఉన్నత న్యాయ సేవలు, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవలు, అఖిల భారత సర్వీసు అధికారులు, యూజీసీ/ఏఐసీటీఈ/ఐసీఏఆర్‌/ కేంద్ర ప్రభుత్వ వేతనాలు/పెన్షన్లు అందుకుంటున్న ఉద్యోగులు/పెన్షనర్లతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులు, సొసైటీల ఉద్యోగులు, స్వయం ప్రతిపత్తి గల సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఐఆర్‌ వర్తించదని  ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.   

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
PRC
Assembly Elections
government employees
pensioners
KCR
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

గులాబీ గూటిలో 'కొత్త లెక్కలు'!

గులాబీ గూటిలో 'కొత్త లెక్కలు'!

బాబు మోసపూరిత ప్రకటనలు..! కొత్త పింఛన్లు గాలికేనా..?

బాబు మోసపూరిత ప్రకటనలు..! కొత్త పింఛన్లు గాలికేనా..?

ఆక్రమిత కశ్మీర్‌ కల్లోలం

ఆక్రమిత కశ్మీర్‌ కల్లోలం

 కేసీఆర్‌ బస్సు యాత్ర అప్పుడే: కేటీఆర్‌

కేసీఆర్‌ బస్సు యాత్ర అప్పుడే: కేటీఆర్‌

కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్‌: మంత్రి ఉత్తమ్‌

కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్‌: మంత్రి ఉత్తమ్‌

2028లో మళ్లీ కేసీఆరే సీఎం..

2028లో మళ్లీ కేసీఆరే సీఎం..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.