Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. ఉచిత విద్యుత్‌ మా పాలసీ
ADVERTISEMENT 

ఉచిత విద్యుత్‌ మా పాలసీ

Telangana Sakshi User Sakshi Sakshi Time Jul 25, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
kcr.jpg

సాక్షి, హైదరాబాద్‌: ‘వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ మా ప్రభుత్వ పాలసీ. ఈ విషయానికి సంబంధించి కొందరు తెలిసీ తెలియక మాట్లాడుతున్నారు. వాటిని నేను పట్టించుకోను. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ పథకం నిలబడాలి. గ్రామీణ ప్రాంతాలు, రైతులు బాధలు తొలగిపోయి వంద శాతం బాగుండాలి..’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. భూముల డిజిటలైజేషన్‌ కోసం తెచ్చిన ధరణిని సమస్యగా చిత్రీకరించేందుకు కొన్ని దుష్టశక్తులు పనిచేస్తున్నాయని విమర్శించారు. ధరణితో భూముల మీద యజమానులకు సంపూర్ణ అధికారం వచ్చిందని చెప్పారు.

ఈ అధికారాన్ని మీ వద్దే పెట్టుకుంటారా? లేక వదిలేసుకుంటారా? అనేది మీరే నిర్ణయించుకోవాలని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ సమక్షంలో భారత్‌ రాష్ట్ర సమితిలో చేరారు. అనిల్‌కుమార్‌ రెడ్డితో పాటు ఆయన వెంట వచ్చిన అనుచరులకు కేసీఆర్‌ గులాబీ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 



లోతుగా ఆలోచించిన తర్వాతే..  

‘తెలంగాణ ఉద్యమంతో పాటు రాష్ట్ర సాధనను ఒక టాస్క్‌గా తీసుకుని పనిచేశాం. మాకు రాజకీయం ఒక టాస్క్‌ లాంటిది. నేను సిద్దిపేట శాసనసభ్యుడిగా పనిచేసిన నాటి నుంచి మొదలుకుని తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు కరెంటు విషయంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు వర్ణనాతీతం. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్‌ ఇచ్చేందుకు అధికారులతో జరిపిన చర్చల ద్వారా సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు తదితర మౌలిక వసతుల్లో సమతుల్యత సాధించాం.

ప్రభుత్వ సంపూర్ణ మద్దతు ఉంటే 24 గంటల ఉచిత విద్యుత్‌ సాధ్యమవుతుందనే అధికారుల వాదనకు కట్టుబడి, పూర్తిస్థాయిలో అండగా నిలిచి ఏడెనిమిది నెలల్లోనే విద్యుత్‌ సరఫరా లేక ఏర్పడిన దుష్పరిణామాలను సరిదిద్దాం.ఏడు గంటల పాటు ఒకేమారు వ్యవసాయ అవసరాలకు విద్యుత్‌ ఇవ్వడం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకునే 24 గంటల కరెంటుకు మొగ్గు చూపాం. గ్రిడ్‌ కుప్పకూలకుండా అవసరమైన సమయంలో విద్యుత్‌ కొనుగోలుకు అవసరమైన విచక్షణాధికారం అధికారులకు ఇవ్వడంతో పాటు సాంకేతిక అంశాలపై అవగాహన ఉండదనే ఉద్దేశంతో ట్రాన్స్‌కో, జెన్‌కో తదితర సంస్థల నుంచి ఐఏఎస్‌ అధికారులను తొలగించాం.

విద్యుత్‌ అంశంపై ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించిన తర్వాతే తొమ్మిదేళ్లుగా అమలు చేస్తున్నాం. మూడు గంటల కరెంటు అంటే రైతులు తిడుతున్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, ధాన్యం కొనుగోలు అంశంపై ఆర్థికవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నా గ్రామీణ ప్రాంతాలు కుదుటపడే వరకు కొనసాగిస్తాం. దీంతో ఆర్థికాభివృద్ధి జరిగి తెలంగాణ అన్ని రంగాల్లోనూ అగ్రస్థానానికి చేరుతుంది.  



ధాన్యం ప్రాసెసింగ్‌.. జపాన్‌ కంపెనీతో చర్చలు 

ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు, చెక్‌డ్యాంలు తదితరాలతో భూగర్భ జలాలు పెరిగి పంటల దిగుబడి పెరిగింది. తెలంగాణలో ఇసుక పండినట్లు 3 కోట్ల టన్నుల ధాన్యం వస్తుండటంతో గిర్నీల సామర్ధ్యం కూడా సరిపోవడం లేదు. 2.5 కోట్ల టన్నుల ధాన్యం ప్రాసెసింగ్‌ కోసం జపాన్‌ సటాకా కంపెనీతో మాట్లాడుతున్నాం. నేను రైతుబిడ్డగా సిద్దిపేట మార్కెట్‌లో పడిగాపులు పడిన రోజులను దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు వేస్తున్నాం..’అని సీఎం చెప్పారు.  



భూములపై సర్వాధికారాలు యజమానులకు.. 

‘వీఆర్వోలు భూముల వివరాలు గందరగోళం చేశారు. ధరణి ద్వారా భూముల డిజిటలైజేషన్‌తో వాటిపై సర్వాధికారాలు యజమానుల చేతికి వచ్చాయి. రాష్ట్రంలోని 2.76 కోట్ల ఎకరాల్లో 1.56 కోట్ల భూమి ఇప్పటికే ధరణిలోకి వచ్చింది. ధరణి మూలంగా రైతుబంధు, భూమికి రక్షణ, ధాన్యం కొనుగోలు వంటివి సులభంగా సాధ్యమవుతాయి. ఇప్పుడు రాష్ట్రంలో భూముల విలువ ఎంతో పెరిగింది. ధరణి లేకపోతే శాంతిభద్రతల సమస్యలు తలెత్తేవి. కొందరు చెప్తున్నట్లు ధరణి తీసేస్తే మళ్లీ లంచాలు మొదలవుతాయి..’అని కేసీఆర్‌ అన్నారు.  



జోడెడ్ల బండిలా ముందుకు తీసుకెళ్లండి 

‘భువనగిరిలో ఇద్దరూ పోటీ పడి డబ్బులు తగలేయొద్దు. చెరి ఒక పదవి తీసుకుని జోడెడ్ల బండిలా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లండి.. అని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, అనిల్‌ కుమార్‌రెడ్డికి చెప్పా. కోడె లేగల మాదిరిగా వెలపల, దాపల సమానంగా ఉంటే కచ్చురంగా బాగా ముందుకు పోతుంది. అనిల్‌కుమార్‌ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు నాదే బాధ్యత. నాకు ఫిబ్రవరిలో 70 ఏళ్లు వస్తాయి. రేపటి తెలంగాణను పాలించేది మీరే. దారి చూపించి వెళతా..’అని కేసీఆర్‌ అన్నారు. సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డితో పాటు ప్రభు త్వ విప్‌లు బాల్క సుమన్, గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, కె.ప్రభాకర్‌రెడ్డి, గ్యాదరి కిషోర్, భాస్కర్‌రావు, రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ సందీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మహారాష్ట్రలో రెండేళ్లలో ఉచిత విద్యుత్‌: కేసీఆర్‌ 

మహారాష్ట్రలో రైతు ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. మహారాష్ట్రలోని వివిధ పారీ్టలకు చెందిన 76 మంది సర్పంచ్‌లు కూడా సోమవారం బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వ్యవసాయంతో పాటు అనేక రంగాల్లో అభివృద్ధి చెంది దేశానికే ఆదర్శంగా నిలిచామని సీఎం చెప్పారు.

మహారాష్ట్రలో కూడా రైతులు, ప్రజల జీవన ప్రమాణాలు మారాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా పరిశీలించాల్సిందిగా సర్పంచ్‌లకు సూచించారు. వారిని తెలంగాణ గ్రామాల పర్యటనకు తీసుకెళ్లాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని ఆదేశించారు. బీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో మహారాష్ట్ర అమరావతి డివిజన్‌ నుంచి బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీతో పాటు రైతు సంఘటన, వంచిత్‌ బహుజన్‌ అఘాడీ, షెట్కారీ సంఘటనతో పాటు వివిధ పారీ్టలకు చెందిన 76 మంది సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, మహారాష్ట్ర మీడియా యూనియన్‌ ప్రతినిధులు ఉన్నారు.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Agriculture
KCR
Free electricity
government
policy
dharani
anilkumar reddy
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

గులాబీ గూటిలో 'కొత్త లెక్కలు'!

గులాబీ గూటిలో 'కొత్త లెక్కలు'!

ఈ చెట్టుకు ఔషధ గుణాలు ఉన్నాయని చరిత్ర చెబుతోంది..!

ఈ చెట్టుకు ఔషధ గుణాలు ఉన్నాయని చరిత్ర చెబుతోంది..!

పారిశ్రామికవేత్తగా గృహిణి..! ఏడాదికి రూ. 1.85 కోట్లు..

పారిశ్రామికవేత్తగా గృహిణి..! ఏడాదికి రూ. 1.85 కోట్లు..

అశ్లీల, కుల వివక్ష పాటలు పెడితే ఇక జైలుకే!

అశ్లీల, కుల వివక్ష పాటలు పెడితే ఇక జైలుకే!

ఎల్‌నినోను తట్టుకునే ఉపాయాలు!

ఎల్‌నినోను తట్టుకునే ఉపాయాలు!

 కేసీఆర్‌ బస్సు యాత్ర అప్పుడే: కేటీఆర్‌

కేసీఆర్‌ బస్సు యాత్ర అప్పుడే: కేటీఆర్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.