Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. 32 అడుగుల ఎత్తు.. 45 కి.మీ. నిడివి
ADVERTISEMENT 

32 అడుగుల ఎత్తు.. 45 కి.మీ. నిడివి

Telangana Sakshi User Sakshi Sakshi Time Oct 8, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
road.jpg

హైదరాబాద్‌–శ్రీశైలం మార్గంలోఎలివేటెడ్‌ కారిడార్‌కు ఎట్టకేలకు కేంద్రం ఓకే 

మన్ననూరు నుంచి పాతాళగంగ వరకునాలుగు వరుసలుగా రోడ్డు విస్తరణ 

రూ. 8 వేల కోట్ల అంచనా వ్యయం..సగం ఖర్చు భరించనున్న రాష్ట్ర ప్రభుత్వం 

తీరనున్న ట్రాఫిక్‌ సమస్య.. రాత్రివేళల్లోవాహనాల రాకపోకలపై ఆంక్షలకూ ఇక తెర 

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి వెళ్లే మార్గంలో సుమారు 32 అడుగుల ఎత్తు, 45 కి.మీ. నిడివితో నాలుగు వరుసల ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. దాదాపు ఏడాదిన్నర నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ ప్రతిపాదనను అంగీకరిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. మన్ననూరు నుంచి తెలంగాణ పరిధి ఉన్న పాతాళగంగ వరకు 62.40 కి.మీ. మేర రోడ్డును విస్తరించాలని నిర్ణయించగా అందులో వన్యప్రాణులు సంచరించే 45.42 కి.మీ. మేర ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మించి మిగతా భాగాన్ని దానికి అప్రోచ్‌ రోడ్డుగా నిర్మించనుంది. 

ఈ ప్రాజెక్టుకు రూ. 7,690 కోట్లు ఖర్చవుతుందని గతంలో అంచనా వేయగా అందులో సగం వ్యయం భరిస్తామని అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసింది. ప్రస్తుతం ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి సవరించిన అంచనాలను తయారు చేయాల్సి ఉంది. ప్రస్తుత అంచనాల ప్రకారం నిర్మాణ వ్యయం రూ. 8 వేల కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. అందులో రూ. 4 వేల కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. 

విస్తరణ జరగక పెరిగిన ట్రాఫిక్‌.. 
శ్రీశైలం క్షేత్రానికి వెళ్లే రోడ్డును గతంలో మన్ననూరు వరకు విస్తరించగా అక్కడి నుంచి దట్టమైన అడవి ఉండటం.. అదే మార్గంలో అమ్రాబాద్‌ పులుల అభయారణ్యం కూడా ఉండటంతో రోడ్డు విస్తరణకు కేంద్రం అనుమతించలేదు. దీంతో మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు సాధారణ రోడ్డే కొనసాగుతోంది. దీనికితోడు వన్యప్రాణుల కదలికల దృష్ట్యా నిత్యం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతుండటం వల్ల ఉదయం వేళల్లో ట్రాఫిక్‌ పెరిగిపోతోంది. దీంతో రోడ్డు విస్తరణ తప్పనిసరైంది. 

అయితే భూఉపరితలంలో విస్తరణ సాధ్యం కానందున వన్యప్రాణులకు అంతరాయం కలగని రీతిలో ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రతిపాదన ఏడాదిన్నర క్రితం తెరపైకి వ చ్చింది. కానీ దాని బదులు కేబుల్‌ కార్‌ నిర్మిస్తే రూ. 2,270 కోట్లు ఖర్చవుతుందన్న ఉద్దేశంతో ఆ మేరకు ప్రతిపాదన సమర్పించా లని కేంద్రం రాష్ట్రాన్ని ఆదేశించింది. అలాగే సొరంగ మార్గం ప్రతిపాదన కూడా తెరపైకి వ చ్చింది. ఎట్టకేలకు ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇ చ్చింది. 

కారిడార్‌కు ఇరువైపులా ఇనుపకంచెలు, నాయిస్‌ బ్యారియర్లు.. 
వన్యప్రాణులకు ఆటంకం కలగని విధంగా ఎలివేటెడ్‌ కారిడార్‌ను చేస్తున్నారు. వాహనాల చప్పుడు ఎక్కువ వినిపించకుండా ఉండేందుకు, జంతువులు రోడ్డుపైకి రాకుండా ఉండేందుకు 32 అడుగుల ఎత్తులో వంతెన నిర్మించనున్నారు. వాహనాలు కింద పడకుండా.. వాహనదారులు కింద ఉండే అటవీ ప్రాంతంలోకి చెత్త విసరకుండా రోడ్డుకు ఇరువైపులా ఎత్తయిన ఇనుప కంచెలు ఏర్పాటు చేయనున్నారు. అదే సమయంలో వాహనాల శబ్దంతో జంతువులు ఇబ్బంది పడకుండా రోడ్డుకు ఇరువైపులా నాయిస్‌ బ్యారియర్లను కూడా ఏర్పాటు చేయనున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Hyderabad
Srisailam - Hyderabad highway
elevated corridor
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.