Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. Telangana: అక్టోబర్‌ 5 తర్వాత నగారా!
ADVERTISEMENT 

Telangana: అక్టోబర్‌ 5 తర్వాత నగారా!

Telangana Sakshi User Sakshi Sakshi Time Sep 20, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
RR_PAGE1.jpg

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ ఎన్నికల తరుణం ముంచుకొస్తోంది. తెలంగాణతోపాటు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరం శాసనసభల ఎలక్షన్లకు అక్టోబర్‌ తొలి వారం తర్వాత ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో శాసనసభ ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను పరిశీలించడానికి చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్‌కుమార్‌ నేతృత్వంలో ఎలక్షన్‌ కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్‌ గోయల్‌తో కూడిన కేంద్ర ఎన్నికల సంఘం బృందం వచ్చే నెల 3న రాష్ట్ర పర్యటనకు రానుంది. 5 వరకు అంటే మూడురోజులపాటు విస్తృత సమీక్షలు, వరుస సమావేశాలు నిర్వహించనుంది.



మిగతా చోట్ల ఇప్పటికే ముగియడంతో..

ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనకు ముందు సంసిద్ధతను స్వయంగా పరిశీలించడానికి సీఈసీ బృందం రాష్ట్రాల్లో పర్యటనలు నిర్వహిస్తుంది. ఆ తర్వాత షెడ్యూల్‌ను ప్రకటిస్తుంది. ప్రస్తుతం ఎన్నికలు జరగాల్సిన ఐదు రాష్ట్రాలకుగాను.. తెలంగాణ మినహా మిగతా 4 రాష్ట్రాల్లో ఇప్పటికే సీఈసీ బృందం పర్యటనలు ముగిశాయి. అక్టోబర్‌ 5వ తేదీ నాటికి తెలంగాణలోనూ పర్యటన ముగుస్తుంది. అంటే ఆ తర్వాత ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం గత శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను 2018 అక్టోబర్‌ 6న ప్రకటించగా.. అదే ఏడాది డిసెంబర్‌ 7న పోలింగ్, 11న ఫలితాలను ప్రకటించారు.



ఈసారి కొన్ని రోజులు అటూఇటూగా షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికలను ఒక్కో దఫాలోనే పూర్తి చేశారు. అలాగే ఈసారి కూడా ఒకే దఫాలో నిర్వహించవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుత శాసనసభ గడువు వచ్చే ఏడాది జనవరి 16వ తేదీతో ముగుస్తుంది. ఆలోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రత్యేకంగా చేపట్టిన ఓటర్ల జాబితా రెండో సవరణ కార్యక్రమంలో భాగంగా.. అక్టోబర్‌ 4న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. దానితో ఎన్నికలకు సర్వం సిద్ధమైనట్టేనని అధికారవర్గాలు చెప్తున్నాయి.



సీఈసీ బృందం షెడ్యూల్‌ ఇదీ..

► కేంద్ర ఎన్నికల కమిషనర్ల బృందం రాష్ట్ర పర్యటనలో భాగంగా.. అక్టోబర్‌ 3న జాతీయ, రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశమై, అభిప్రాయ సేకరణ జరుపుతుంది. అనంతరం వివిధ కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమై.. ఎన్నికల్లో ధనం, మద్యం, ఇతర ప్రలోభాలు, అక్రమాల నిర్మూలన కోసం తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తుంది. తర్వాత రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్, రాష్ట్ర పోలీసు నోడల్‌ అధికారి (ఎస్‌ఎన్‌పీఓ), కేంద్ర సాయుధ బలగాల నోడల్‌ అధికారి తమ సన్నద్ధతను ప్రజెంటేషన్‌ ద్వారా వివరిస్తారు.



► అక్టోబర్‌ 4న ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు 33 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు/పోలీసు కమిషనర్లతో సీఈసీ బృందం సమావేశం అవుతుంది. జిల్లాల వారీగా క్షేత్రస్థాయిలో ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్లు, ఎస్పీలు/పీసీలు ప్రజెంటేషన్‌ ఇస్తారు.



► అక్టోబర్‌ 5న ఓటర్లలో చైతన్యం కల్పించడానికి అమలు చేస్తున్న ‘స్వీప్‌’ కార్యక్రమం తీరు తెన్నులను సీఈసీ బృందం పరిశీలిస్తుంది. ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రచారకర్తలుగా ఉన్న క్రీడా, సినీ రంగ సెలబ్రిటీలతో సమావేశం అవుతుంది. దివ్యాంగ, యువ ఓటర్లతో ముఖాముఖీగా మాట్లాడుతుంది. చివరిగా ప్రభుత్వ సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌లతో సమావేశమై రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం, భద్రత సంస్థలను సమన్వయం పర్చే అంశంపై సమీక్షిస్తుంది. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి తమ పర్యటన విశేషాలను వెల్లడిస్తుంది.  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Central Election Commission
Legislative Assembly
Rajiv Kumar
TS Assembly Top Stories
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

89 లక్షల మంది ఓటర్లకు నోటీసులు?

89 లక్షల మంది ఓటర్లకు నోటీసులు?

‘కొత్త’ మండలి భవనాన్ని ప్రారంభించిన సీఎం

‘కొత్త’ మండలి భవనాన్ని ప్రారంభించిన సీఎం

అప్పులు తప్ప దాచడానికి ఏమీ లేదు

అప్పులు తప్ప దాచడానికి ఏమీ లేదు

వాళ్లు 11 మందే అయినా.. 1,100 మందితో సమానం

వాళ్లు 11 మందే అయినా.. 1,100 మందితో సమానం

పూటకో బదిలీతో దెబ్బతింటున్న పాలన

పూటకో బదిలీతో దెబ్బతింటున్న పాలన

హెరిటేజ్‌ కోసం టీటీడీ పరువు తీస్తారా?

హెరిటేజ్‌ కోసం టీటీడీ పరువు తీస్తారా?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.