Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. నేడు జగిత్యాలలో గులాబీ గర్జన
ADVERTISEMENT 

నేడు జగిత్యాలలో గులాబీ గర్జన

Telangana Sakshi User Sakshi Sakshi Time Apr 24, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
KCR-FILTER.jpg

ఏడాది తర్వాత ప్రజా ఆశీర్వాద సభ ద్వారా జనంలోకి కేసీఆర్‌

గత ఏడాది వరంగల్‌లో పార్టీ రజతోత్సవ సభకు కేసీఆర్‌ హాజరు 

2023 తర్వాత అడపాదడపా బీఆర్‌ఎస్‌ పార్టీ బహిరంగ సభలు 

జగిత్యాల బహిరంగసభ గేమ్‌ ఛేంజర్‌ అంటున్న బీఆర్‌ఎస్‌ 

జీవన్‌రెడ్డి చేరికతో ఉత్తర తెలంగాణలో పూర్వ వైభవంపై ఆశలు  

సాక్షి, హైదరాబాద్‌ /జగిత్యాల: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ సుమారు ఏడాది తర్వాత జగిత్యాల సభ వేదికగా ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్నారు. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన మాజీమంత్రి టి.జీవన్‌రెడ్డి సోమవారం జగిత్యాల సభ వేదికగా కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నారు. ప్రజా ఆశీర్వాద సభ పేరిట బీఆర్‌ఎస్‌ నిర్వహిస్తున్న ఈ సభను పార్టీ శ్రేణులు జగిత్యాల జైత్రయాత్రగా అభివర్ణిస్తున్నాయి. 2023లో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌ తిరిగి జగిత్యాల సభతో పూర్వ వైభవం సాధిస్తుందనే ధీమా పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. బహిరంగసభను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు శ్రమిస్తున్నారు. 

అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత... 
2023 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి అనంతరం కేసీఆర్‌ అడపాదడపా మాత్రమే ప్రజాక్షేత్రంలో కనిపిస్తూ వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తుంటి ఎముక శస్త్ర చికిత్సతో కొద్దినెలలు ఎర్రవల్లి నివాసానికి పరిమితమయ్యారు. కొద్దిగా కోలుకున్న కేసీఆర్‌ 2024 ఫిబ్రవరి 13న ‘చలో నల్గొండ’పేరిట సభ నిర్వహించారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించడంపై ఈ సభలో మండిపడ్డారు. 2024 ఏప్రిల్, మేలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు రోడ్‌షోలు, బస్సుయాత్రలో కేసీఆర్‌ పాల్గొన్నారు. 

గత ఏడాది వరంగల్‌లో ‘రజతోత్సవం’ 
బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గత ఏడాది ఏప్రిల్‌ 27న వరంగల్‌ సమీపంలోని ఎల్కతుర్తి వద్ద ‘రజతోత్సవ సభ’నిర్వహించారు. ఆ తర్వాత తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గం, పార్లమెంటరీ పార్టీ భేటీలో కేసీఆర్‌ పాల్గొని దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు కూడా దూరంగా ఉంటున్న కేసీఆర్‌ ఏడాది తర్వాత జగిత్యాల సభ వేదికగా తిరిగి ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం మేడిగడ్డ పర్యటనకు వెళ్తుండటంతో జగిత్యాల సభ వేదికగా కేసీఆర్‌ చేసే ప్రసంగంపై అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది. 

జీవన్‌రెడ్డి చేరికతో కొత్త ఉత్సాహం 
నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌ పార్టీలో అగ్రశ్రేణి నాయకుడిగా పేరొందిన మాజీమంత్రి జీవన్‌రెడ్డి కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరుతుండటంతో పార్టీ యంత్రాంగంలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పార్టీ ఆవిర్భావ సమయం నుంచి పార్టీకి గట్టి పట్టున్న ఉత్తర తెలంగాణలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తీవ్రంగా నష్టపోయింది. జీవన్‌రెడ్డి చేరిక ఉత్తర తెలంగాణలో పార్టీకి కొత్త ఊపునిస్తుందని పార్టీ అంచనా వేస్తోంది. జగిత్యాల సభ వేదికగా బీఆర్‌ఎస్‌ ప్రస్థానం, పదేళ్ల పాలన, కాంగ్రెస్‌ పాలనావైఫల్యం వంటి అంశాలపై కేసీఆర్‌ ప్రసంగించే అవకాశముంది. పార్టీ యంత్రాంగానికి దిశా నిర్దేశం చేయడంతోపాటు భవిష్యత్‌ కార్యాచరణను కేసీఆర్‌ ప్రకటిస్తారని భావిస్తున్నారు. జగిత్యాల సభ బీఆర్‌ఎస్‌ ప్రస్థానంలో మైలు రాయిగా నిలవడంతోపాటు రాష్ట్ర రాజకీయాల్లో ‘గేమ్‌ ఛేంజర్‌’గా ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు.  

లక్ష మందికి పైగా సభకు వచ్చేలా... 
జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీస్టేడియంలో జరగనున్న బహిరంగ సభకు లక్షకు పైగానే జనాన్ని తరలించేందుకు బీఆర్‌ఎస్‌ నాయకులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాల నుంచి పార్టీ శ్రేణులను తరలించేలా చర్యలు తీసుకున్నారు. జగిత్యాల సభలో పాల్గొనేందుకు కేసీఆర్‌ సోమవారం సాయంత్రం 4.45కు ఎర్రవల్లి నివాసం నుంచి బయలుదేరి వెళతారు. సాయంత్రం 5.30 గంటలకు హెలికాప్టర్‌లో కేసీఆర్‌ కలెక్టరేట్‌లోని హెలిప్యాడ్‌ వద్దకు చేరుకొని అక్కడి నుంచి కారులో పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు.

అక్కడ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులతో కేసీఆర్‌ భేటీ అవుతారు. అనంతరంసాయంత్రం 6 గంటలకు పార్టీ ఆఫీస్‌ నుంచి బయలుదేరి బహిరంగ సభ ప్రాంగణానికి  కేసీఆర్‌ చేరుకుంటారు. సభకు వచ్చే కార్యకర్తలు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మినీస్టేడియం పట్టణం నడి»ొడ్డున ఉండటంతో అత్యధికంగా రద్దీ ఏర్పడే అవకాశం ఉండటంతో ఎక్కడికక్కడే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్‌ రెండుసార్లు పర్యటించి ప్రజల కోసం 3 లక్షల వాటర్‌ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలని పార్టీ నేతలకు సూచించారు.  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
jagtial
BRS Party
public meeting
Telangana
KCR
KTR
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.