Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. ఏకచక్రపురం.. నవనాథపురం
ADVERTISEMENT 

ఏకచక్రపురం.. నవనాథపురం

Telangana Sakshi User Sakshi Sakshi Time Dec 27, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Bodhan-Indranarayana-Temple.jpg

ఘనచరిత్రను ఇముడ్చుకున్న ఇందూరు చుట్టుపక్కల ప్రాంతాలు

పౌరాణిక ప్రాశస్త్యం, చారిత్రక నేపథ్యంతో బోధన్‌గా రూపాంతరం చెందిన ఏకచక్రపురం

 నవసిద్ధుల నేపథ్యం నుంచి ఆర్మూర్‌గా మారిన నవనాథపురం

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: అశ్మక రాష్ట్రంగా ప్రస్థానాన్ని ప్రారంభించి.. ఇందూరు వరకు నామాంతరం చెందిన నిజామాబాద్‌ (Nizamabad) చుట్టుపక్కల ప్రాంతాలు పౌరాణిక, ప్రాచీన చారిత్రక నేపథ్యాన్ని ఇముడ్చుకున్నాయి. మంజీర, గోదావరి పరీవాహకంలో ఉండి ప్రాచీన కాలంలో ఏకచక్రపురంగా, బహుధాన్యపురంగా విరజిల్లి, ప్రస్తుతం సాధారణ పట్టణంగా ఉన్న బోధన్‌ (Bodhan) ఎనలేని ప్రాచీన చరిత్రను కలిగి ఉంది. అయితే దీని చరిత్ర నిరంతరం బయటపడుతూనే ఉంది. తవ్వకాలు చేయడంలో నిర్లక్ష్యం కారణంగా దీని చరిత్ర ఆశించిన స్థాయిలో వెలుగు చూడటం లేదనేది చరిత్రకారుల అభిప్రాయం. ఇక్కడ ఎన్ని తవ్వకాలు జరిపితే అంత చరిత్ర (History) బయటపడే అవకాశముంది. ఈ విషయంలో పాలకులు అంతగా దృష్టి సారించకపోవడంతో.. పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల ఘనమైన చరిత్ర బయటకు రావడం లేదని పలువురి వాదన.

పౌరాణిక నేపథ్యం ప్రకారం ఈ ప్రాంతాన్ని పరశురాముడు(Parasu Ramudu) తన చక్రంతో రక్షించడంతో పాటు చక్రతీర్థమనే చెరువును నిర్మించడంతో ఏకచక్రపురంగా పేరుపొందినట్లు పలువురు చెబుతున్నారు. పౌరాణిక సాహిత్యంలో, జైన సాహిత్యంలో, బౌద్ధ సాహిత్యంలో బోధన్‌ ప్రాశస్త్యం ఉంది. మహాభారతంలో వసుమతి, పద్మపురం నామాలతో, జైన సాహిత్యంలో పోదనపురం నామంతో, బౌద్ధ సాహిత్యంలో పోదన నామంతో పేరొందింది. ఇక ప్రాచీన, మధ్యయుగాల్లో ఈ ప్రాంతం ధన సంపదలతో తులతూగడంతో.. బహుధాన్యపురం పేరుతో పిలిచినట్లు చరిత్ర చెబుతోంది. గొప్ప వర్తక కేంద్రంగా వర్ధిల్లినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అనేక శాసనాలు, పాత్రలు, శిల్పాలు, నాణేలు(Coins) లభించాయి.  

అశ్మకుడనే రాజు పాలనలో.. 
ఈ ప్రాంతాన్ని అశ్మకుడనే రాజు పరిపాలించినట్లు మహాభారతంలో ప్రస్తావన ఉందని పలువురు చెబుతున్నారు. ఇక ఈ ప్రాంతాన్ని శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, వాకాటకులు, బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు, విజయనగర రాజులు, మరాఠా రాజులు, బహమనీ సుల్తానులు, గోల్కొండ రాజులు, మొఘలులు పరిపాలించారు. ఏకచక్రపురంగా, బహుధాన్యపురంగా చాలాకాలం పేరొందిన ఈ పట్టణం ప్రస్తుతం బోధన్‌ పేరుతో స్థిరపడింది. ఈ ప్రాంతం గురించి ఎంత శోధిస్తే అంత చరిత్ర బయటపడే అవకాశముందని చరిత్రకారులు స్పష్టం చేస్తున్నారు.

నాటి నవనాథపురం.. నేటి ఆర్మూర్‌ 
ప్రస్తుతం పసుపు పంట అత్యధికంగా పండించే ప్రాంతంగా ఉన్న ఆర్మూర్‌ (Armoor) ప్రాంతం సైతం ఘనమైన చరిత్రను కలిగి ఉంది. నవనాథపురంగా ప్రసిద్ధి చెందిన ఈ పట్టణం.. నేడు ఆర్మూర్‌ నామాంతరంతో స్థిరపడింది. ఆర్మూర్‌ పట్టణానికి దక్షిణ నైరుతి భాగంలో కొన్ని కిలోమీటర్ల మేర సిద్ధులగుట్ట విస్తరించి ఉంది. ఈ గుట్టపై నవనాథ సిద్ధులు తపస్సు చేశారు. దీంతో గుట్ట చుట్టూ ఉన్న ప్రాంతానికి నవనాథపురంగా పేరు వచ్చింది. కాలక్రమంలో నవనాథపురం నుంచి ఆర్మూర్‌గా నామాంతరం చెందింది.


వందల ఏళ్ల క్రితం దేశం నలుమూలల నుంచి నవనాథులైన గోరఖ్‌నాథ్, జలంధర్‌నా, చరఫట్‌నాథ్‌, అపభంగనాథ్‌, కానీషనాథ్‌, మచ్చింద్రనాథ్, చౌరంగీనాథ్‌, రేవనాథ్‌, బర్తరినాథ్‌ తదితరులు ఇక్కడికి వచ్చారు. నల్లని రాళ్లు పేర్చినట్లున్న ఈ గుట్టపై ఒక ఇరుకైన గుహలో తమ ఇష్టదైవమైన సిద్ధేశ్వరుడిని ప్రతిష్టించి పూజలు చేశారని ప్రతీతి. వారి పేరిట గుట్టకు నవనాథ సిద్ధుల గుట్టగా పేరు వచ్చింది. దీంతో గుట్టను ఆనుకున్న గ్రామానికి నవనాథపురంగా నామకరణం చేసుకున్నారు. 

చ‌ద‌వండి: ఆ గుడిలో దేవుడు లేడు.. అయినా జనాల క్యూ!

కాలక్రమంలో ఈ తొమ్మిది మంది సాధువుల్లో ఆరుగురు ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. మిగిలిన ముగ్గురు సాధువులు ఇక్కడే ఉండి పూజలు చేయడంతో ఆరు.. మూరు.. అంటూ కాలక్రమంలో ఆర్మూర్‌గా పేరు స్థిరపడింది. మరికొందరు చరిత్రకారులు ఆర్మూర్‌ అనే పదం.. ఆరావం అనే పదం నుంచి వచ్చిందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సిద్ధుల గుట్ట ఆధ్యాత్మికతకు చిరునామాగా మారింది. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
induru
Bodhan
ARMOOR
Nizambad District
Historical Areas
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.