Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. కలెక్టర్, పీవో అడవిబాట
ADVERTISEMENT 

కలెక్టర్, పీవో అడవిబాట

Telangana Sakshi User Sakshi Sakshi Time Jul 31, 2024 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ccccccc.jpg

దట్టమైన అటవీ ప్రాంతంలో 10 కి.మీ. నడిచిన భద్రాద్రి కలెక్టర్, ఐటీడీఏ పీఓ

పోడు చేసుకోనివ్వడం లేదని హైకోర్టులో గిరిజనుల పిటిషన్‌

కోర్టు ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఐఏఎస్‌లు

దుమ్ముగూడెం: ఇద్దరు ఐఏఎస్‌లు.. వారిలో ఒకరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్, మరొకరు భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్‌. పోడు సాగు అంశంపై హైకోర్టులో రైతులు పిటిషన్‌ దాఖలు చేయగా.. కోర్టు సూచనలతో క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు అడవిబాట పట్టారు. వాహనాలు వెళ్లే మార్గం లేకపోవడంతో రానుపోను 10కి.మీ. నడిచారు. 

సమస్య ఏంటంటే...
భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం గౌరారం అటవీ రేంజ్‌ పరిధిలో పలువురు రైతులకు కొన్నాళ్ల క్రితం పోడు పట్టాలు అందాయి. అయితే, ఈ భూమిలో అటవీ అధికారులు తమను సాగు చేసుకోనివ్వడం లేదని, పంటలను ధ్వంసం చేస్తున్నారంటూ 23మంది గిరిజన రైతులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈమేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలన్న కోర్టు సూచనలతో కలెక్టర్‌ పాటిల్, పీవో రాహుల్‌ మంగళవారం అక్కడకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దుమ్ముగూడెం మండలంలోని ములకనాపల్లి ప్రధానరహదారి వరకు మాత్రమే రహదారి ఉండడంతో వాహనాల్లో వెళ్లారు.

అక్కడినుంచి దట్టమైన అడవిలో రెవెన్యూ, అటవీ అధికారులతో కలిసి కాలిబాటన వాగులు, వంకలు దాటుతూ గౌరారం వరకు 5 కి.మీ. వెళ్లి సమస్యపై రైతులు, అటవీ అధికారులతో మాట్లాడారు. అడవిని నరికారని అధికారులు వివరించారు. ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించగా, ఫారెస్ట్‌ భూమిని కొందరు ఆక్రమించినట్టు తమ దృష్టికి వచ్చిందని కలెక్టర్‌ పాటిల్‌ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ హక్కు పత్రాల్లో ఉన్నంత మేరకు భూమి సాగు చేసుకోవాలని సూచించారు. మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతున్న సమయాన అటవీ ప్రాంతంలో ఇద్దరు ఐఏఎస్‌లు పర్యటించడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
forest
bhadradri
collectorate
Jitesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

అరణ్యరోదన

అరణ్యరోదన

ఆన్‌లైన్‌ ఆంక్షలతో అడవి బిడ్డల ఆవేదన

ఆన్‌లైన్‌ ఆంక్షలతో అడవి బిడ్డల ఆవేదన

మహిళ పట్ల అసభ్య ప్రవర్తన.. కలెక్టరేట్ అటెండర్ కు దేహశుద్ధి

మహిళ పట్ల అసభ్య ప్రవర్తన.. కలెక్టరేట్ అటెండర్ కు దేహశుద్ధి

అటవీ సంపదకు చెదలు

అటవీ సంపదకు చెదలు

ఆదివాసీల జీవితాల్లో మార్పు మొదలైందా?

ఆదివాసీల జీవితాల్లో మార్పు మొదలైందా?

 గజేంద్ర ‘మోక్షం’

గజేంద్ర ‘మోక్షం’

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.