Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. బతుకమ్మ పుట్టినిల్లు!
ADVERTISEMENT 

బతుకమ్మ పుట్టినిల్లు!

Telangana Sakshi User Sakshi Sakshi Time Oct 10, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
batukamma.jpg

పర్వతగిరి మండలంలోని చౌటపల్లి గ్రామానికి ప్రత్యేక గుర్తింపు

పదెకరాల ప్రాంగణంలో ఇక్కడ గుడి నిర్మించేందుకు ప్రణాళికలు 

ఇప్పటికే విరాళాల సేకరణలో శ్రీశాంతికృష్ణ సేవా సమితి 

నాలుగు నెలల్లో పనులు ప్రారంభించేందుకు కసరత్తు 

సాక్షి, వరంగల్‌: బతుకమ్మ పండుగ అంటేనే తెలంగాణ పూల వేడుక. తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకలకు పుట్టినిల్లుగా గుర్తింపు పొందింది వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామం. ఈ మేరకు పలు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ గుర్తింపునకు చిహ్నంగానే ఆ ప్రాంతంలో పదెకరాల విస్తీర్ణంలో బతుకమ్మ ఆలయం నిర్మించే దిశగా అడుగులు పడుతున్నాయి. 

శ్రీశాంతికృష్ణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వ కళావిరాట్‌ డాక్టర్‌ శాంతికృష్ణ ఆచార్య.. ఈ గ్రామం బతుకమ్మకు పుట్టినిల్లని పలు చారిత్రక పరిశోధనల్లో తేల్చారు. అటు రాష్ట్ర దేవాదాయ శాఖ, ఇటు కేంద్ర పర్యాటక శాఖను సమన్వయం చేసుకుంటూ, ఎన్‌ఆర్‌ఐలు, ప్రజల నుంచి విరాళాలు సేకరించే బృహత్తర కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. 

అంతా అనుకూలిస్తే మరో నాలుగు నెలల్లో ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించే దిశగా అడుగులు పడతాయని అక్కడి ప్రజలు చెబుతున్నారు. సాధ్యమైనంత త్వరగా నిర్మాణమైతే ఓవైపు ఆధ్యాతి్మకంగా, మరోవైపు పర్యాటకంగా చౌటపల్లి విరాజిల్లనుంది. ఇప్పటికే చారిత్రక నగరంగా పేరుగాంచిన వరంగల్‌ జిల్లాలో మరో చారిత్రక ప్రాంతం చేరనుంది.  

రూ.100 కోట్లతో ఆలయ నిర్మాణం 
గ్రామంలోని పదెకరాల్లో నిర్మించే బతుకమ్మ గుడికి రూ.100 కోట్ల వ్యయం కానుంది. ఇందులో రూ.70 కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించనుండగా.. రూ.30 కోట్ల మేరకు భక్తుల నుంచి విరాళాలు సేకరించాలని నిర్ణయించారు. ఇప్పటికే చౌటపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి రూ.కోటి నిధులు మంజూరు చేసిన బెంగళూరు రోటరీ క్లబ్‌ ప్రెసిడెంట్‌ దాఖోజు రవిశంకర్‌ దాదాపు రూ.15 కోట్లు బతుకమ్మ గుడి నిర్మాణానికి ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారు. 

బతుకునిచ్చిన అమ్మ!
17వ శతాబ్దంలో తెలంగాణను నిజాం నవాబులు పరిపాలిస్తున్నారు. ఆ సమయంలో ఓరుగల్లు పట్టణంలోని విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వంగాల రామయ్య 16వ ఏటనే నిజాం ప్రభువులకు చెందిన వెండి నాణేల ముద్రణ కర్మాగారంలో పనిచేస్తూ అనతికాలంలోనే పాలకులను ఆకట్టుకొని కొంత మాన్యం పొందారు. ఆ ప్రాంతమే ఇప్పటి పర్వతగిరి మండలంలోని చౌటపల్లి. రామయ్య ఆ స్థలంలో ప్రజల సౌకర్యార్థం చెరువు తవ్వించి వసతులు కల్పించారు. సౌటమట్టి కలిగిన ప్రాంతం కనుక సౌటపల్లిగా, కాలక్రమంలో చౌటపల్లిగా  మారింది. 

కొంత కాలానికి చౌటపల్లి గ్రామ శివారు గ్రామాల ప్రజలు కలరా సోకి చనిపోతున్నారని తెలిసి గ్రామ ప్రజలు రామయ్యను సంప్రదించారు. సమస్య పరిష్కారానికి ఆయన గాయత్రిదేవిని ఉపాసించాడు. ఆ తల్లి నామస్మరణలో మూడు రోజులు గడిపాడు. దీంతో గాయత్రీమాత ఆయనకు స్వప్నంలో కనిపించింది. అశరీర వాణిగా గ్రామ సౌభాగ్యానికి తన సంతానాన్ని ఆర్పించాలని, ప్రత్యేక పూజా విధానం, పాత్ర కాని పాత్రలో ఎంగిలిపడని పూలను పేర్చి గౌరీమాత స్వయంగా వెలుగొందిన గుమ్మడి పూలను పేర్చాలి. 

పేర్చిన పూలపై పెట్టి గౌరీమాతను నవదినాలు గ్రామంలో అందరూ కలిసి పూజించాలని ప్రబోధించినట్లు ప్రచారంలో ఉంది. బతుకునీయమ్మా.. బతికించమ్మా అనే పదాల నుంచే బతుకమ్మ అవిర్భవించిందని చెబుతున్నారు. దీనిపై చారిత్రక పరిశోధన చేసిన డాక్టర్‌ శాంతికృష్ణ ఆచార్య.. ఈ వివరాలన్నీ పుస్తక రూపంలోకి తెచ్చారు.  

యాదాద్రి తరహాలోనే బతుకమ్మ గుడి.. 
40 ఏళ్ల పాటు నేను చేసిన చారిత్రక పరిశోధనలతో చౌటపల్లి బతుకమ్మ పుట్టినిల్లుగా తేలింది. అందుకే ఇక్కడా యాదాద్రి తరహాలోనే బతుకమ్మ గుడిని నిర్మించాలనుకుంటున్నాం. ఈ గుడి నిర్మాణ నమూనాకు యాదాద్రి టెంపుల్‌ డిజైనర్‌ ఆనంద్‌సాయి, స్థపతిగా పద్మశ్రీ వేణు ఆనందాచార్య వ్యవహరిస్తారు. 

తెలంగాణ తల్లి రూపశిల్పి బైరోజు వెంకటరమణాచార్యులు (బీవీఆర్‌ చార్యులు) ఇప్పటికే బతుకమ్మ చిత్రపటాన్ని విడుదల చేశారు. 2019లోనే బతుకమ్మపై బృంద నృత్యం ద్వారా గిన్నిస్‌ రికార్డు సాధించాం. బతుకమ్మ గుడి నిర్మాణం పూర్తయ్యే వరకు అకుంఠిత దీక్షతో పనిచేస్తా. 
– డాక్టర్‌ శాంతికృష్ణ ఆచార్య, శ్రీ శాంతికృష్ణ  సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Telangana
bathukamma
warangal
Bathukamma 2024
choutapalli
Dussehra 2024
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.