Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. బీజేపీ వైపే ప్రజలు
ADVERTISEMENT 

బీజేపీ వైపే ప్రజలు

Telangana Sakshi User Sakshi Sakshi Time May 11, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
bandi_3.jpg

వారి మూడ్‌ పార్టీకి, మోదీకి పూర్తి అనుకూలంగా కన్పిస్తోంది

రాష్ట్రంలో 10 నుంచి 12 సీట్లలో గెలవబోతున్నాం

కరీంనగర్‌లో నా గెలుపు కూడా పక్కాబీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు ఓ ప్లాన్‌ ప్రకారం మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకున్నాయి

ప్రజల దృష్టిని మళ్లించేందుకే రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల రద్దు ప్రచారం

‘సాక్షి’తో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌

(కె.రాహుల్‌) : ‘కరీంగనగర్‌లోనే కాదు, రాష్ట్రంలో దేశ వ్యాప్తంగా ప్రజల మూడ్‌ బీజేపీకి, మోదీకి పూర్తి అనుకూలంగా కనిపిస్తోంది. ప్రధానిగా మోదీ ఉండాలని, తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీలు అత్యధిక సంఖ్యలో గెలవాలని ప్రజలు డిసైడ్‌ అయ్యారు..’ అని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ చెప్పారు. ప్రధాని మోదీ అభివృద్ధి ఎజెండాతో వివిధ వర్గాల ఓట్లు సాధించి లోక్‌సభ ఎన్నికల్లో తాను కూడా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. 

వేములవాడలో 8న జరిగిన ప్రధాని మోదీ సభకు ఉదయం 9 గంటలకే వెల్లువలా వచ్చిన ప్రజలు సంజయ్‌దే విజయమని ప్రకటించేశారన్నారు. తనపై పోటీచేస్తున్న బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థులు రెండోస్థానం కోసమే పోటీపడాల్సి ఉంటుందన్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వినోద్‌కుమార్‌ నాన్‌ లోకల్‌ అయితే, కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరో కూడా ప్రజలకు తెలియదన్నారు. ‘నేను ఈ గడ్డమీదే పుట్టిన. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఎన్నికల్లో గెలిచినా ఓడినా ఇక్కడే ఉన్నా. ప్రజల కష్టాల్లో అండగా ఉన్న. నాకు ఈ గడ్డతో ఉన్నది పేగు బంధం. 

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఎన్నడైనా ఈ గడ్డ ప్రజల కోసం పోరాటాలు చేశారా? మళ్లీ గెలిపిస్తే నాకున్న పరిచయాలు, ఢిల్లీ పెద్దలతో ఏర్పడ్డ  సంబంధాలతో మరింత అభివృద్ధి చేస్తా..’ అని చెప్పారు. కరీంనగర్‌తో పాటు రాష్ట్రంలో పరిస్థితి, కాంగ్రెస్‌ పాలన, అభివృద్ధి, పలు రాజకీయ అంశాలపై బండి సంజయ్‌ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.\

నేనేం చేశానో గ్రామాల్లో కన్పిస్తోంది
మా పోరాటాల వల్లే కేసీఆర్‌ సర్కార్‌ పీడ విరగడైంది. తెలంగాణ ప్రజలను అరిగోస పెడుతున్న కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గల్లిలోకి గుంజుకొచ్చి గడీల పాలనను బద్దలు కొట్టినం. ఏ ప్రభుత్వమైతే ధర్నాలు, నిరసనలను నిషేధించిందో అదే ప్రభుత్వాన్ని ధర్నా చౌక్‌కు గుంజుకొచ్చిన. కేసీఆర్‌ పాలనలో విసిగి, అన్యాయాలకు గురైన ప్రజలకు అండగా ఉంటూ పోరాటాలు చేసిన. కేసీఆర్‌ ప్రభుత్వం అన్నో ఇన్నో ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చింది అంటే నా పోరాటం వల్లనే. జిల్లాకు సంబంధించిన అనేక రోడ్ల పనులకు కేంద్రం నిధులు ఇచ్చేలా ఒప్పించి పనులు స్టార్ట్‌ చేయించిన. రూ.12 వేల కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చిన వివరాలు గ్రామ గ్రామాన కళ్లకు కన్పిస్తుంటే ఏమీ చేయలేదనే వాళ్లను ఏమనాలి ?  

మేం పక్కా హిందుత్వవాదులం
హిందువులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేది ఎంఐఎం. ఆ పార్టీతో పదేళ్ల పాటు సంసారం చేసింది బీఆర్‌ఎస్‌. మనుగడ కోసం ఒవైసీతో అంటకాగుతోంది కాంగ్రెస్‌. హిందువుల ఆత్మ గౌరవం కోసం నేను కొట్లాడుతా. నేను ఎన్నడూ రాజకీయం కోసం హిందుత్వాన్ని వాడుకోను కానీ హిందూ ధర్మ పరిరక్షణ కోసం బరాబర్‌ రాజకీయం చేస్తా..దేవుడు పేరు చెప్పుకుని ఓట్లు అడుక్కునే బిచ్చగాళ్లు బీజేపోళ్లని రేవంత్‌రెడ్డి హేళన చేశారు. హామీల అమలుపై కాంగ్రెస్‌ మాటలు జనం నమ్మడం లేదని ఆ దేవుడి మీదే ఒట్టేసే పరిస్థితికి వచ్చిండు. రాముడి అక్షింతలను, తీర్ధ ప్రసాదాలను హేళన చేసిన కేసీఆర్‌ పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో బొంద పెట్టారు. ఆ పార్టీని పాతాళంలోకి తొక్కడం ఖాయం.

నాకే బాధ్యత ఇవ్వాలో పార్టీ నిర్ణయిస్తుంది
రాష్ట్రవ్యాప్తంగా 10 నుంచి 12 సీట్లలో బీజేపీ గెలవబోతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. అంతకు మించి గెలిచినా ఆశ్చర్యపోవడానికి లేదు. నేను గెలిచిన తర్వాత కేంద్రమంత్రి పదవి ఇస్తారా? ఏ బాధ్యత అప్పగిస్తారనేది మోదీ నాయకత్వంలోని మా కేంద్ర పార్టీ నిర్ణయిస్తుంది. నేను బీజేపీ సైనికుడిని. కరీంనగర్‌ ప్రజల సేవకుడిని. పార్టీ అప్పగించిన పని వంద శాతం నిర్వహించడమే నా బాధ్యత.

ఫోన్‌ ట్యాపింగ్‌ డబ్బులు ఇక్కడ ఖర్చు చేస్తున్నారు
ఫోన్‌ ట్యాపింగ్‌ డబ్బులు తీసుకొచ్చి కరీంనగర్‌లో ఖర్చు చేస్తున్నారు. ఓటుకు వెయ్యి ఇచ్చి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ కలిసి నాటకాలు ఆడుతున్నాయి. కాళేశ్వరం అవినీతిపై, ఫోన్‌ ట్యాపింగ్‌పై కాంగ్రెస్‌ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీల అమలు, ఆ పార్టీపై, ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలపై బీఆర్‌ఎస్‌ ప్రశ్నించడం లేదు. ఈ రెండు పార్టీలు ఓ ప్లాన్‌ ప్రకారం మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకుని పైకి డ్రామాలు ఆడుతున్నాయి.

రిజర్వేషన్లకు కాంగ్రెస్‌ తూట్లు
కాంగ్రెస్‌ పార్టీ రిజర్వేషన్లకు తూట్లు పొడిచింది. ముస్లిం రిజర్వేషన్ల అమలు పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణ పేదలకు అన్యాయం చేసింది. అగ్రకులాల్లోని పేదలకు కూడా 10% రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి మోదీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తున్న నేత. అలాంటి నాయకుడు రిజర్వేషన్లను రద్దు చేస్తారంటే ఎవరూ నమ్మరు. కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీలు, ఇతర హామీలు అమలు చేయకపోవడంతో మోసం చేసిందనే భావన ప్రజల్లో ఉంది. దీన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల రద్దు, హైదరాబాద్‌ను యూటీ చేస్తారనే ప్రచారాన్ని కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ చేస్తున్నాయి.  

ఆ పార్టీలకు మధ్యవర్తి ఎంఐఎం
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలకు మధ్యవర్తి ఎంఐఎం. ఈ పార్టీలన్నీ అవినీతి ఎలా చెయ్యాలి, ప్రజలను ఎలా మోసం చెయ్యాలి.. తిరిగి ఎన్నికలొస్తే డబ్బులతో ఓట్లు ఎలా కొనాలి? అనే చూస్తాయి. దేశాన్ని దోచుకోవడంలో కాంగ్రెస్, రాష్ట్రాన్ని దోచుకోవడంలో బీఆర్‌ఎస్‌ పార్టీలు పీహెచ్‌డీ చేశాయి. కేసీఆర్‌ కుటుంబం అవినీతిలో గుడిని మింగితే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం గుడిలో లింగాన్ని కూడా వదలిపెట్టనట్లుగా అవినీతికి తెరదీస్తూ... ఆ డబ్బుతో ఢిల్లీకి కప్పం కడుతోంది. గ్యారెంటీలను నమ్మి గెలిపించిన ప్రజలకు పంగనామాలు పెట్టింది. వంద రోజుల పేరుతో 6 గ్యారంటీల్లో 5 హామీలను అమలు చేశామనడం పెద్ద అబద్ధం.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Bandi Sanjay
interview with sakshi
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.