Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. నిజాం ఆస్తుల్లో వాటా దక్కకుండా కుట్ర
ADVERTISEMENT 

నిజాం ఆస్తుల్లో వాటా దక్కకుండా కుట్ర

Telangana Sakshi User Sakshi Sakshi Time Jan 23, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Azam-Jah.jpg

అవే నన్ను కుంగదీస్తున్నాయి.. వారసత్వానికి దూరం చేసే యత్నం 

బాల్యంలో ప్యాలెస్‌లలో గడిపాను.. నేడు హోటల్‌లో ఉండాల్సిన దుస్థితి 

నిజాం వస్తువులను అక్రమంగా తరలించుకుపోతుంటే బాధ వేస్తోంది 

‘సాక్షి’తో ఎనిమిదో నిజాం ముకరం జా కుమారుడు ఆజం జా

గౌరీభట్ల నరసింహమూర్తి
‘నా బాల్యం ఈ చారిత్రక నగరంలోనే సాగింది. హైదరాబాద్‌ రోడ్లపై విహరించాను, ఇక్కడి చెరువులను చూ శాను, నాటి ఉద్యానవనాల్లో తిరిగాను, మైదానాల్లో ఆట లాడాను. ఇక్కడి ప్రజల జీవనగమనాన్ని పరిశీలించాను. ఈ నగరానికి, ఇక్కడి ప్ర జలకు, ముఖ్యంగా పేదలకు ఏదో చే యాలన్న తపన ఉంది. వేగంగా పురోగమిస్తున్న పది ప్రపంచ నగరాల్లో హైదరాబాద్‌ కూడా ఒకటి అన్న విషయం చాలా గర్వంగా అనిపిస్తుంది. కానీ, నిజాం వా రసుడిగా నాకు దక్కాల్సిన స్థానాన్ని కూ లదోసేందుకు, ఆ ఆస్తుల్లో నాకు వాటా రాకుండా చేసేందుకు జరుగుతున్న కుట్రలు నన్ను కుంగదీస్తున్నాయి. నేను ఆస్ట్రేలియాలో ఉన్నా హైదరాబాదీనే’... ఇవీ ఎనిమిదో నిజాం ముకరం జా తనయుడు అలెగ్జాండర్‌ ఆ జం జా చెబుతున్న ఆసక్తికర అంశాలు. నిజాం ఆస్తులపై సవతి తల్లి కుటుంబ సభ్యు లతో ఉన్న వ్యాజ్యాల కోసం నగరానికి వచ్చిన ఆజం జా గురువారం ‘సాక్షి’తో ప్రత్యే కంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... 

హైదరాబాద్‌ను రెండు శతాబ్దాల పాటు పాలించి న అసఫ్‌ జాహీ వారసుడిని నేను. ఎనిమిదో నిజాంగా స్వయంగా ప్రభుత్వం గుర్తించిన ముకరం జా కుమారుడిని. వాస్తవానికి నేను ఆయన వారసుడిని. కానీ, ఆయన మాజీ భార్య, ఆమె పిల్లలు న న్ను ఆ వారసత్వానికి దూరం చేసే కు ట్రలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్‌లో నిజాం ఆస్తులు ఎన్నో ఉన్నాయి. ఎన్నో ప్యాలెస్‌లు ఆయన సొంతం. భారత్‌లో హైదరాబాద్‌ సంస్థానం విలీ నం సమయంలో అధికారికంగా సంక్ర మించిన ఆస్తులున్నాయి. మా నాన్న హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ముకరం జా ట్రస్ట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ లెర్నింగ్‌లో నన్ను సభ్యుడిగా నియమించారు.

దాని ద్వారా పేదలకు చవకగా చదువు చెప్పించాలన్నది ఆయన తాపత్రయం. ఆ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని నేనూ నిర్ణయించుకున్నా. కానీ, ముకరం జా వారసులుగా చెప్పుకునేవాళ్లు అందులో ఎన్నో అవకతవకలకు తెరలేపారు. నేను అందులో ఉంటే వారి కుట్రలు సాగవని తేలుసుకుని అందులోనుంచి నన్ను తొలగించారు. నా బాల్యంలో హైద రాబాద్‌లోని చిరాన్, చౌమహల్లా, ఫలక్‌నుమా ప్యాలెస్‌లలో గడిపిన వాడిని. కానీ, ఇప్పుడు అన్ని ప్యాలెస్‌లు ఉండి కూడా, హైదరాబాద్‌కు వస్తే హోటల్‌ గదిలో ఉండాల్సిన దుస్థితి కల్పించారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందన్న నమ్మకంతో ఉన్నాను. ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాను.  

నాకు న్యాయమైన వాటా అందాల్సి ఉంది  
ముస్లిం పర్సనల్‌ లా, ఇస్లామిక్‌ షరియా ప్రకారం ... ఆస్తులను ఆరు భాగాలు చేసి అందులో ఓ భాగం నాకు దక్కాల్సి ఉంది. భారత న్యాయ సూత్రాల ప్రకారం చూసినా నా వాటా నాకు దక్కాల్సిందే. దాదాపు రూ.10 వేల కోట్లకు పైగా ఉండే ఆస్తుల విలువలో నాకు న్యాయమైన వాటా అందాల్సి ఉంది. కానీ, అది అందకుండా నన్ను ఆవేదనకు గురిచేస్తున్నారు. ప్యాలెస్‌లలో ఉన్న విలువైన నిజాం వస్తువులను అక్రమంగా తరలించుకుపోతుంటే బాధగా ఉంది. తరలిన వస్తువులు నిజాంవేనని ధ్రువపరిచే ఆధారాలు నా వద్ద ఉన్నాయి. నా తండ్రి నుంచి విడాకులు పొందిన మహిళ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నా తండ్రి బతికున్నప్పుడు ఆయనను ఇబ్బంది పెట్టిన వారు, ఇప్పుడు ఆయన ఆస్తికి వారసులుగా అక్రమాలకు తెర దీశారు.

హుస్సేన్‌ గుర్తుకొస్తారు..
చిరాన్‌ ప్యాలెస్, కింగ్‌ కోఠి ప్యాలెస్‌లలో నా బాల్యం సంతోషంగా గడిచింది. ఈ సమయంలో నా కేర్‌టేకర్‌గా మా నాన్న హుస్సేన్‌ అనే వ్యక్తిని ఏర్పాటు చేశారు. నన్ను సైకిల్‌పై తిప్పడం, వీధుల్లో విహారానికి తీసుకెళ్లడం, నేను సంతోషంగా ఉండేలా చేయడం... ఇలా ఆయన చేసిన సేవలు అపారం. ఇప్పు డు హైదరాబాద్‌ వీధుల్లో తిరుగుతుంటే ఆనాడు హుస్సేన్‌తో గడిపిన రోజులు గుర్తొచ్చి మనసు భారంగా మారుతోంది.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Sakshi Interview
Nizam
Mukarram jha
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.