Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. జేఈఈ ప్రశ్నావళి @ ఏఐ
ADVERTISEMENT 

జేఈఈ ప్రశ్నావళి @ ఏఐ

Telangana Sakshi User Sakshi Sakshi Time Dec 25, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ai.jpg

జాతీయ ప్రవేశ పరీక్షల్లో కీలకపాత్ర పోషించనున్న కృత్రిమ మేధ

డేటా ఆధారిత ప్రశ్నపత్రాల రూపకల్పన

తొలుత జేఈఈ మెయిన్స్‌తో ప్రయోగం

తర్వాత అన్ని పోటీ పరీక్షలకు ఏఐ టూల్‌

బాంబే ఐఐటీ నివేదిక

సవాళ్లను తేలికగా తీసుకోవద్దు అంటున్న మద్రాస్‌ ఐఐటీ

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ పోటీ పరీక్షల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) కీలకపాత్ర పోషించబోతోంది. కేంద్ర విద్యాశాఖ ఈ దిశగా కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రధానంగా జేఈఈ మెయిన్స్‌లో వీలైనంత త్వరగా ఏఐని అందుబాటులోకి తేనున్నారు. కాన్సెప్ట్‌ క్లారిటీ మాడ్యూల్స్‌ను రంగంలోకి దించబోతున్నారు. ఐఐటీ ముంబై ఇందుకు సంబంధించిన అధ్యయనం పూర్తిచేసింది. సాధ్యాసాధ్యాలపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఐఐటీలు, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీతో కేంద్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు త్వరలో సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. వచ్చే ఏడాది జరిగే జేఈఈ మెయిన్స్‌ రెండో విడత పరీక్షలో కొంతమేర దీన్ని అనుసరించాలని నిర్ణయించినట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రయోగంలో ఎదురయ్యే సవాళ్లపై సమీక్షిస్తారు. మార్పులు, చేర్పుల తర్వాత 2027లో పూర్తిస్థాయిలో ఏఐని అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. తొలుత జేఈఈ వరకూ పరిమితం చేసి, ఆ తర్వాత నీట్, ఇతర ప్రవేశ పరీక్షలకు ఏఐని అందుబాటులోకి తేవాలనే యోచనలో ఉన్నారు. 

సెక్యూరిటీ మాడ్యూల్స్‌పై కసరత్తు 
జేఈఈ పరీక్షను దేశవ్యాప్తంగా 10 లక్షల మందికిపైగా విద్యార్థులు రాస్తున్నారు. ఆన్‌లైన్‌ విధానంలో జరిగే ఈ పరీక్షకు ప్రశ్నపత్రం రూపకల్పన మొదలు, మూల్యాంకనం వరకూ జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. సైబర్‌ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో పటిష్టమైన సెక్యూరిటీ ఫీచర్స్‌ ఉండాలని ఐఐటీ–బాంబే కేంద్రానికి సూచించింది. ప్రతీ పోటీ పరీక్షకు ప్రత్యేక లాంగ్‌ లెర్నింగ్‌ మాడ్యూల్స్‌ అవసరం ఉందని పేర్కొంది. ప్రశ్నపత్రాల తయారీ, ఏఐ ఆధారిత డేటా అనలిటిక్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపింది. అమెరికా, కెనడా, ఆ్రస్టేలియాతోపాటు పలు దేశాల్లో ఏఐ ఆధారిత మాడ్యూల్స్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. 

సైబర్‌ నేరాలకు సాధ్యం కాని ఫైర్‌వాల్స్‌ రూపొందించినట్లు ముంబై–ఐఐటీ అధ్యయనంలో వెల్లడైంది. ప్రస్తుతం జేఈఈ ప్రశ్నపత్రాన్ని దాదాపు పది సెట్లుగా తయారు చేస్తారు. ఇందులో కఠినం, మధ్యస్థం, సాధారణ ప్రశ్నలు ఉంటాయి. వీటిలో సాఫ్ట్‌వేర్‌ ఆధారంగానే పది సెట్ల నుంచి ప్రశ్నలు ఎంపికవుతాయి. ఏఐ టెక్నాలజీతో చాప్టర్స్, సిలబస్‌ ఆధారంగా డేటాను ఫీడ్‌ చేస్తారు. వీటిలో ఏఐ మాడ్యూల్స్‌ అవసరమైన ప్రశ్నలను ఎంపిక చేస్తాయి. తుది కూర్పు తర్వాత ప్రశ్నపత్రం కేంద్రీకృత అధికారి పాస్‌వర్డ్‌తోనే పరీక్ష కేంద్రాల్లో ఓపెన్‌ అవుతుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ హాక్‌ అవ్వడానికి, ప్రశ్నపత్రం లీక్‌ అయ్యేందుకు ఆస్కారం ఉండదని నిపుణులు అంటున్నారు. ఏఐకి అందించే డేటా కూడా అత్యంత గోప్యంగా ఉండాలని చెబుతున్నారు.  

సమస్యల పరిష్కారంపై సాధన 
డేటా ప్రైవసీ, అల్గారిథమ్‌లో కొన్ని సమస్యలున్నాయని ఐఐటీ–మద్రాస్‌ నిపుణులు అంటున్నారు. ఫీడ్‌ చేసే డేటా ఇతర సంస్థలకు వెళ్తే, ఏఐ టూల్‌ అక్కడా ఉంటే ప్రశ్నలు కొన్ని ముందే తెలిసే వీలుందని భావిస్తున్నారు. సంప్రదాయంగా జరిగే ప్రశ్నపత్రం కూర్పులో మేథ్స్, ఫిజిక్స్‌లో ట్విస్ట్‌ చేసే ప్రశ్నల తయారీ కోసం ఏఐకి సరికొత్త మాడ్యూల్స్‌ అందించాలి. లేకపోతే చాప్టర్‌ ఆధారంగానే సాధారణ ప్రశ్నావళి వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏఐ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది.. అనేక దేశాల డేటా కేంద్రాలకు సమన్వయం అవుతుంది. కాబట్టి ప్రశ్నావళి రూపకల్పనలో ఇతర డేటాను ఏఐ తీసుకుంటే, విద్యార్థులు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. దేశంలోని పోటీ పరీక్షలకు, అందులోనూ ప్రతీ సబ్జెక్టుకు విస్తృతమైన దేశీయ డేటాను డేటా సెంటర్‌కు ఫీడ్‌ చేయడం, దాన్ని నిర్వహించడంపై కసరత్తు జరగాలని సూచిస్తున్నారు.  

కోచింగ్‌లోనూ ఏఐ దూకుడు
వాస్తవానికి ఆన్‌లైన్‌ కోచింగ్‌ కేంద్రాలు, కార్పొరేట్‌ కాలేజీలు ఇప్పటికే ఏఐని విరివిగా వాడుతున్నాయి. విద్యార్థి బలాలు, బలహీనతలు,వ్యక్తిగత స్టడీప్లాన్, రోజువారీ ప్రాక్టీస్‌ ప్రశ్నలు, సందేహాల నివృత్తికి 6.5 లక్షల మంది జేఈఈ రాసే విద్యార్థులు ఏఐ, చాట్‌బాట్‌ను వాడుతున్నారు. గత రెండేళ్ల ప్రశ్నల ఆధారంగా ట్రెండ్‌ అనాలసిస్‌ను ఏఐ అందిస్తోంది.  

విద్యార్థి స్థాయికి అనుగుణంగా ప్రశ్నలు తయారు చేస్తూ మాక్‌ టెస్టులు, అడాప్టివ్‌ లెర్నింగ్‌ టెస్టులను ఏఐ ట్యూటర్లు అందిస్తున్నాయి. సమయ పాలన, స్కోర్, ర్యాంకు అంచనాలను ఎప్పటికప్పుడు విశ్లేషించే ఏఐ అనుసంధాన ప్రిపరేషన్‌ మాడ్యూల్స్‌ అందుబాటులోకి వచ్చాయి.  

ఏఐ ప్రాక్టరింగ్‌తో ఫేస్‌ రికగ్నిషన్, విద్యార్థి ప్రవర్తనను గుర్తించే ఎల్‌ఎల్‌ఆర్‌ఎంలు రెండేళ్లుగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. దీని ఆధారంగా పోటీ పరీక్షల్లో విద్యార్థిస్థాయి, ఆందోళనను ఆన్‌లైన్‌లో అందిస్తున్నారు. సలహాలు, సూచనలు ఏఐ నుంచి అందుతున్నాయి. ఏఐ ఆధారిత డిజిటల్‌ ప్లాట్‌ఫాంతో స్మార్ట్‌ కోచింగ్‌ వల్ల గ్రామీణ విద్యార్థులు నాణ్యమైన కంటెంట్‌ అందుకుంటున్నారు. ఆబ్జెక్టివ్‌ ప్రశ్నల్లో వేగంగా ఫలితాలు వస్తున్నాయి.   

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Artificial Intelligence (AI)
JEE Mains
IIT Madras
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ఇప్పుడంతా AI.. మరి రేపు ఏంటి?

ఇప్పుడంతా AI.. మరి రేపు ఏంటి?

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కనుమరుగవుతాయ్!?

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కనుమరుగవుతాయ్!?

మస్క్ ప్రసంశలు.. ఏఐ రంగంలో వారే టాప్!

మస్క్ ప్రసంశలు.. ఏఐ రంగంలో వారే టాప్!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.