Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. పప్పుల అంగడి!
ADVERTISEMENT 

పప్పుల అంగడి!

Telangana Sakshi User Sakshi Sakshi Time Dec 15, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
pappulu.jpg

కామారెడ్డి జిల్లా జుక్కల్‌ అంగళ్లలో అన్ని రకాల పప్పులు 

పాలిష్‌ చేయకుండా అమ్మే పొట్టు పప్పునకు గిరాకీ 

తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ప్రజల కొనుగోలు  

అన్ని సీజన్లలోనూ పప్పులు లభ్యం

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన కామారెడ్డి జిల్లాలోని జుక్కల్‌ నియోజకవర్గంలో ఆచార వ్యవహారాలన్నీ భిన్నంగా కనిపిస్తాయి. ఇక్కడ సంప్రదాయాలు ఎక్కువగా పాటిస్తారు. చాలా మంది ఇక్కడ శాకాహారులే ఉంటారు. ఈ ప్రాంతంలోని ప్రజలు తెలుగు, మరాఠీ, కన్నడ భాషలు మాట్లాడుతారు. అందుకే దీన్ని త్రిభాషా సంగమం అని అంటుంటారు. 

జుక్కల్‌ నియోజకవర్గంలో జుక్కల్, మద్నూర్, పిట్లం, పెద్దకొడప్‌గల్, డోంగ్లీ, బిచ్కుంద, నిజాంసాగర్, మహ్మద్‌నగర్‌ మండలాలున్నాయి. ఆయా మండలాల్లో పలుచోట్ల అంగళ్లు (వారసంతలు) జరుగుతాయి. బిచ్కుంద మండల కేంద్రంలో బుధవారం, జుక్కల్‌లో గురువారం, పి ట్లంలో శుక్రవారం, మద్నూర్‌లో సోమవారం, డోంగ్లీ, మేనూర్‌లో శుక్రవారం అంగళ్లు జరుగుతాయి. ఆ ప్రాంత ప్రజలు ఇంటికి అవసరమైన నిత్యావసరాలు, బట్టలు, వంట పాత్రలు.. ఏవైనా సరే అంగడికి వచ్చి కొనుగోలు చేస్తుంటారు. 

పేద, మధ్య తరగతి వర్గాలు కూరగాయలు, నిత్యావసరాల కోసం అంగళ్లపైనే ఎక్కువగా ఆధారపడతారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా పప్పులు అమ్ముతుంటారు. స్థానికంగా ఉన్న రైతులు వారు పండించిన పప్పుదినుసులను అంగళ్లలో అమ్ముతారు. పెసర, కంది, మినుము, శనగ, ఎర్రపప్పులతో పాటు జొన్నలు, గోధుమలు, ఆవాలు కూడా విక్రయిస్తారు.  

పొట్టు పప్పునకు భలే డిమాండ్‌ 
సాధారణంగా పంట చేతికి వచ్చిన తర్వాత పప్పు దినుసులు ఎక్కువ మొత్తంలో అమ్మకానికి వస్తాయి. ఆ సమయంలో ధర కొంత తక్కువగా ఉంటుంది. దీంతో ప్రజలు ఆయా అంగళ్లకు వెళ్లి కొనుగోలు చేస్తుంటారు. దుకాణాల్లో మరపట్టిన, పాలిష్‌ చేసినవి అమ్ముతుంటే అంగళ్లలో మాత్రం రైతులు నేచురల్‌ గా పండించిన పప్పుదినుసులు దంచి పొట్టుతో అమ్ముతుంటారు. చాలా మంది వాటిని ఇష్టంగా కొనుగోలు చేస్తుంటారు. క్వింటాళ్ల కొద్దీ పప్పులు అమ్ముడు పోతాయని చెబుతున్నారు. 

దేశంలో ఎక్కడైనా పప్పులకు కొరత రావచ్చు గానీ, జుక్కల్‌ ప్రాంతంలో మాత్రం ఏనాడూ పప్పుదినుసులకు కొరత ఏర్పడదని స్థానికులు చెబుతుంటారు. ఇక్కడే ఎక్కువగా పప్పుదినుసులు పండిస్తారు. అలాగే పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలోని పలు గ్రామాల్లో కూడా పప్పుదినుసులు సాగుచేస్తారు. జొన్నలు, గోధుమలు కూడా విక్రయిస్తారు. 
 
పొరుగు రాష్ట్రాల నుంచి కూడా.. 
జుక్కల్, పిట్లం, మద్నూర్, బిచ్కుంద అంగళ్లకు పొరుగున ఉన్న మహారాష్ట్రలోని దెగ్లూర్, హనేగావ్‌ ప్రాంతాల నుంచే కాకుండా కర్ణాటకలోని ఔరద్‌ ప్రాంతానికి చెందిన వారు కూడా పప్పులు అమ్మడానికి వస్తుంటారు. అలాగే అంగళ్లలో పప్పులు, నిత్యావసరాలు, ఇతర వస్తువులు కొనుగోలు చేయడానికి మూడు రాష్ట్రాల ప్రజలు రావడం విశేషం. జుక్కల్‌ అంగడికి జుక్కల్‌ మండలంలోని ఆయా గ్రామాల ప్రజలతో పాటు పొరుగున ఉన్న కర్ణాటకలోని కొన్ని గ్రామాల ప్రజలు కూడా వస్తుంటారు. 

మద్నూర్, మేనూర్‌లో జరిగే అంగళ్లకు చుట్టుపక్కల గ్రామాలు, మహారాష్ట్రలోని దేగ్లూర్‌ తాలూకాలోని గ్రామాల ప్రజలు వస్తారు. బిచ్కుంద అంగడికి బిచ్కుంద మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వస్తుంటారు. పిట్లం మండల కేంద్రంలో జరిగే అంగడికి పిట్లం, పెద్దకొడప్‌గల్, నిజాంసాగర్‌ మండలంలోని కొన్ని గ్రామాల ప్రజలతో పాటు పొరుగున ఉన్న సంగారెడ్డి జిల్లాలోని కంగి్ట, కల్హేర్‌ మండలాల నుంచి వచ్చి కొనుగోళ్లు చేస్తారు.

రెండు తరాలుగా ఇదే దందా 
మా కుటుంబం రెండు తరాలుగా పప్పులు, జొన్నలు పిట్లం అంగడిలో అమ్ముతున్నం. మా నాయిన అమ్మేవారు. తర్వాత నేనూ పదేళ్లుగా పప్పులు, జొన్నలు అమ్ముతున్నాను. చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పప్పులు, జొన్నలు కొంటారు.   – రంజిత్, తిమ్మానగర్‌ (విక్రయదారుడు)  

పిట్లం అంగడిలోనే కొంటాను  
పిట్లం అంగడిలో ఏళ్ల నుంచి పప్పులు కొనుగోలు చేస్తున్నాం. తక్కువ ధరకు దొరుకుతాయి. పప్పులతో పాటు జొన్నలు కూడా అమ్ముతారు. ఇంట్లో అవసరం ఉన్నప్పుడల్లా వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తాను. ఎన్నో ఏళ్లుగా పిట్లం అంగడిలో కొన్నవే తింటున్నాం.  – రాజు, ఎల్లారెడ్డి (కొనుగోలుదారుడు)

నాణ్యమైన పప్పులు దొరుకుతాయి 
పిట్లంకు మా ఊరు దగ్గరగా ఉంటుంది. వారం వారం అంగడికి ఇక్కడికే వచ్చి అవసరం ఉన్నవి కొనుగోలు చేస్తాం. పప్పులు ప్రతిసారీ పిట్లం అంగడిలోనే కొంటాం. ఇక్కడ నాణ్యమైనవి దొరుకుతాయి.   – రాజేశ్వర్, తాడ్కోల్, సంగారెడ్డి జిల్లా (కొనుగోలుదారుడు) 
 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
kamareddy district
Telangana
pulses
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.