Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. సాగు లక్ష్యం సాధ్యమేనా?
ADVERTISEMENT 

సాగు లక్ష్యం సాధ్యమేనా?

Telangana Sakshi User Sakshi Sakshi Time Jun 11, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
FARMER-PADDY--2264742883.jpg

వానాకాలం ప్రణాళిక సిద్ధం చేసిన వ్యవసాయశాఖ 

134.66 లక్షల ఎకరాల్లో వివిధ పంటల సాగు అంచనా

సాక్షి, హైదరాబాద్‌: వానాకాలం (ఖరీఫ్‌) సీజన్‌ పంటలకు వ్యవసాయ శాఖ భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 134.66 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేస్తూ...పంటల వారీగా విస్తీర్ణ లక్ష్యాలను ఖరారు చేసింది. ఇందులో వరి 69 లక్షల ఎకరాలు, పత్తి 48 లక్షల ఎకరాల్లో సాగవుతాయని భావిస్తోంది. మొక్కజొన్న, కందులు, సోయాబీన్, పెసలు, మినుములు, జొన్నలు, సజ్జలు, నూనెగింజల పంటలన్నీ కలిపి కేవలం 17.66 లక్షల ఎకరాల్లో సాగు కావొచ్చని అంచనా వేసింది. దీనికి అనుగుణంగా అవసరమైన విత్తనాలతోపాటు యూరియా, ఇతర ఎరువులను కూడా సిద్ధం చేస్తోంది. అయితే వ్యవసాయశాఖ లెక్కలకు భిన్నంగా వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నా యని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరోవైపు ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో వ్యవసాయశాఖ నిర్దేశించిన లక్ష్య మేరుకు సాగు సాధ్యమవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

వరి, పత్తి సాగుకే రైతుల మొగ్గు 
రైతులు ఇప్పటికీ వరి, పత్తి పంటలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి, వరిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తుండడంతో రైతులు ఆ పంటల వైపే మొగ్గు చూపుతున్నాయి. మొత్తం సాగు విస్తీర్ణంలో దాదాపు 90 శాతం వరి, పత్తి పంటలకే రైతులు మొగ్గు చూపుతారని వ్యవసాయశాఖ చెబుతోంది. అయితే వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోతే మొదటి ప్రభావం కూడా వరి, పత్తిపైనే పడుతుంది.  

గత ఏడాది 132 లక్షల ఎకరాల్లో.. 
గత సంవత్సరం ఖరీఫ్‌ సీజన్‌లో రాష్ట్రంలో మొత్తం 1.32 కోట్ల ఎకరాలకు పైగా వివిధ రకాల పంటలు సాగయ్యాయి. అందులో వరి 67.04 లక్షల ఎకరాలు, పత్తి 45.85 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 6.41 లక్షల ఎకరాలు, కందులు 4.92 లక్షల ఎకరాలు, సోయాబీన్‌ 3.62 లక్షల ఎకరాలు ఉన్నాయి. మొత్తంగా సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే 100 శాతానికి పైగా సాగు నమోదైంది. గత ఏడాది మంచి వర్షాలు, చెరువులు–ప్రాజెక్టుల్లో సమృద్ధిగా నీటి నిల్వలు ఉండటం వల్ల రైతులు ధైర్యంగా సాగు చేపట్టగలిగారు. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. వేసవి ప్రారంభం నుంచే నీటి లభ్యతపై ఆందోళన నెలకొంది.  

ప్రాజెక్టుల్లో తగ్గిన నీటి నిల్వలు 
రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రస్తుతం ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేవు. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, లోయర్‌ మానేరు, కడెం వంటి ప్రాజెక్టుల్లో నిల్వలు తగ్గుముఖం పట్టాయి. కాళేశ్వరం పరిధిలోనూ నీటి లభ్యతపై రైతుల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. వానలు ఆలస్యమైతే దుక్కులు దున్నడం నుంచి నాట్ల వరకు మొత్తం వ్యవసాయ కార్యాచరణ ప్రభావితమయ్యే ప్రమాదముందని అధికారులు చెబుతున్నారు. నీటి అవసరం అధికంగా ఉండే వరి సాగుపై దీని ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు సకాలంలో రాష్ట్రంలోకి ప్రవేశించి, సాధారణ వర్షాలు కురిస్తేనే వ్యవసాయశాఖ నిర్దేశించిన 134 లక్షల ఎకరాల సాగు లక్ష్యం చేరుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే వర్షాభావ పరిస్థితులు, నీటి కొరత కారణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చు. అందుకే ఈసారి ఖరీఫ్‌ భవితవ్యం పూర్తిగా వరుణుడి కరుణపైనే ఆధారపడి ఉందని వ్యవసాయ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర రైతాంగం ఇప్పుడు వానల రాక కోసం ఎదురు చూస్తోంది.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Agriculture Department
kharif season
Farmers
Telangana
Crop cultivation
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.