Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. పుస్తకానికి పట్టం
ADVERTISEMENT 

పుస్తకానికి పట్టం

Telangana Sakshi User Sakshi Sakshi Time Dec 29, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
bookfair.jpg

37వ హైదరాబాద్‌ జాతీయ పుస్తక ప్రదర్శనకు భారీగా తరలివస్తున్న ప్రజలు

సాక్షి, హైదరాబాద్‌: పుస్తకప్రియుడు గెలిచాడు... పుస్తకానికి మరోసారి పట్టం కట్టాడు... ఫేస్‌బుక్, వాట్సాప్‌ లాంటి సామాజిక మాధ్యమాలు, ఈ–బుక్‌ల హవా కొనసాగుతున్న కాలంలోనూ సగటు పాఠకుడు పుస్తకానికే జైకొట్టాడు. భాగ్యనగరం వేదికగా జరుగుతున్న 37వ హైదరాబాద్‌ జాతీయ పుస్తక ప్రదర్శనే అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. లక్షలాది మంది పాఠక మహాశయులు పుస్తక ప్రదర్శనను సందర్శించి నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. ఈ నెల 19న ప్రారంభమైన పుస్తక ప్రదర్శన శనివారం 9వ రోజుకు చేరుకుంది. 

ఇప్పటివరకు సుమారు 10 లక్షల మందికిపైగా ప్రజలు పుస్తక ప్రదర్శనను సందర్శించినట్లు నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. 350 స్టాళ్లలో కనీసం రూ. 15 కోట్ల విలువైన పుస్తకాలు అమ్ముడైనట్లు హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ కమిటీ ప్రతినిధులు తెలిపారు. పుస్తక ప్రదర్శనలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, సభలు, సమావేశాలు సైతం సందర్శకులను విశేషంగా ఆకటుకున్నాయి. బుక్‌ ఫెయిర్‌ వేదికగా పదుల సంఖ్యలో కొత్త పుస్తకాల ఆవిష్కరణ సాగింది. రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ సైతం శనివారం బుక్‌ ఫెయిర్‌ను సందర్శించి పలు స్టాళ్లను ఆసక్తిగా తిలకించారు. 

జైకొట్టిన యువత.. 
ఈసారి యువతరం పుస్తక ప్రదర్శనకు భారీగా తరలివచ్చింది. పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలతోపాటు నవలలు, కథల పుస్తకాలు, చరిత్ర గ్రంథాలను యువతీయువకులు విరివిగా కొనుగోలు చేశారు. హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్ల నుంచి తరలివచ్చిన వేలాది మంది చిన్నారులతో పుస్తక ప్రదర్శన ప్రతిరోజూ కళకళలాడింది. దశాబ్దాలు, శతాబ్దాలు గడిచినా చెక్కుచెదరని పాఠకాదరణ కలిగిన గురజాడ కన్యాశుల్కం, గోపీచంద్‌ అసమర్థుని జీవయాత్ర, బుచ్చిబాబు చివరకుమిగిలేది, శ్రీదేవి కాలాతీత వ్యక్తులు, మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానం వంటి పుస్తకాలు పెద్ద ఎత్తున అమ్ముడయ్యాయి. 

రాజ్యాంగంపై ఆంగ్లం, తెలుగు భాషల్లో వెలువడిన పుస్తకాలను చాలా మంది కొనుగోలు చేశారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీల పాలన తదితర పుస్తకాలపట్ల కూడా పాఠకులు ఆసక్తి చూపారు. సామాజిక మాధ్యమ శైలిని అనుకరిస్తూ వెలువడుతున్న నవతరం రచయితల పుస్తకాలకు సైతం ఆదరణ లభించింది. ప్రముఖుల జీవిత చరిత్ర గ్రంథాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు, రామాయణం, మహాభారతం వంటి గ్రంథాలను కూడా పాఠకులు అక్కునజేర్చుకున్నారు.  

నేటితో ముగింపు 
హైదరాబాద్‌ జాతీయ పుస్తక ప్రదర్శన నేటితో ముగియనుంది. సాయంత్రం  5:30 గంటలకు జరిగే ముగింపు వేడుకల్లో మంత్రి జూపల్లి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాధారాణి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం తదితరులు హాజరుకానున్నారు.  

1. పండుగలా ప్రదర్శన  
పుస్తక ప్రదర్శన పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. యువత పెద్ద ఎత్తున వస్తున్నారు. పుస్తకాలు కొంటున్నారు. ప్రచురణ సంస్థలు సైతం  అమ్మకాలపట్ల సంతోషంగా ఉన్నాయి. జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పుస్తక ప్రియులు తరలి వస్తున్నారు. ప్రదర్శన విజయవంతంగా కొనసాగుతోంది. 
– వాసు, హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ కమిటీ కార్యదర్శి 

2. పుస్తక పఠనం పెరిగింది 
ప్రదర్శనకు వచ్చిన సందర్శకులను చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తోంది. ఏటేటా లక్షలాది మంది పుస్తకప్రియులు వస్తూనే ఉన్నారు. ఇది  ఆహా్వనించదగ్గ గొప్ప పరిణామం. పుస్తక పఠనం బాగా పెరిగిందనేందుకు పెరిగిన సందర్శకుల సంఖ్యే నిదర్శనం. తల్లిదండ్రులు పిల్లలతో కలిసి రావడం, కావల్సిన పుస్తకాలు కొనడం శుభపరిణామం. పుస్తకాలు చదవకపోవడం వల్ల పిల్లలు ఏం కోల్పోతున్నారో పెద్దలు గుర్తించినట్లుంది. 
– ఆనంద్, ప్రముఖ వ్యాఖ్యాత/ఆంజనేయరెడ్డి, రిటైర్డ్‌ అధికారి 

3. భక్తి పుస్తకాలు కొన్నా 
పుస్తకప్రదర్శన చాలా బాగుంది. నాకు శ్రీకృష్ణుడు అంటే ఎంతో ఇష్టం, భక్తి. అందుకే భక్తి పుస్తకాలే ఎక్కువగా కొన్నా. నవలలు, కథల పుస్తకాలు కూడా బాగున్నాయి. 
– కృతిక, డిగ్రీ విద్యార్ధిని, హయత్‌నగర్‌ 

4. యద్దనపూడి, యండమూరి నవలల కోసం వచ్చా 
గతంలో చదివినప్పటికీ మరోసారి యండమూరి వీరేంద్రనాథ్, యద్దనపూడి సులోచనారాణి నవలల కోసం వచ్చా. అన్ని స్టాళ్లలో సాహిత్యం పుస్తకాలు చాలా ఉన్నాయి. ప్రదర్శన బాగుంది. 
– రాధాకృష్ణ, హైటెక్‌సిటీ 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Hyderabad Book Fair
national book fair
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.