Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. ‘దిల్‌’పై మానని గాయం
ADVERTISEMENT 

‘దిల్‌’పై మానని గాయం

Telangana Sakshi User Sakshi Sakshi Time Feb 21, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
41.jpg

ఏడాదిలోనే పట్టుబడిన ఐఎం ఉగ్రవాదులు 

 2016లో ఉరిశిక్ష వేసిన ఎన్‌ఐఏ న్యాయస్థానం 

న్యాయ ప్రక్రియలతో ఇప్పటికీ అమలు కాని వైనం  

సాక్షి, హైదరాబాద్: సొత్తు సంబంధిత నేరాల్లో కోల్పోయింది రికవరీ అయినప్పుడు...  బాడీలీ అఫెన్సులతో పాటు ఉగ్రవాద సంబంధిత కేసుల్లో నిందితులు దోషులుగా నిరూపితమై, వారికి పడిన శిక్ష అమలైతేనే బాధితులకు పూర్తి స్థాయి న్యాయం జరిగినట్లు. 13 ఏళ్ల క్రితం చోటు చేసుకున్న దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్లలో అశువులుబాసిన, క్షతగాత్రులుగా మారిన కుటుంబాలకు ఇప్పటికీ ఈ న్యాయం దక్కలేదు. ఈ కేసులో దోషులకు ఉరిశిక్ష పడినా...న్యాయ ప్రక్రియ నేపథ్యంలో పదేళ్లుగా అది అమలు కాకపోవడమే దీనికి కారణం.  

ఏడాదిలోనే పూర్తి అయిన అరెస్టులు...  
దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతంలో 2013 ఫిబ్రవరి 21న జంట పేలుళ్లు జరిగాయి. అక్కడి 107 బస్టాప్‌లో మొదటి బాంబు సాయంత్రం 6 గంటల 58 నిమిషాల 38 సెకండ్లకు,   ఏ–1 మిర్చ్‌ సెంటర్‌ వద్ద రెండోది సాయంత్రం 6 గంటల 58 నిమిషాల 44 సెకండ్లకు పేలింది. ఈ దుశ్చర్యలో ఓ గర్భస్థ శిశువు సహా 18 మంది చనిపోగా... దాదాపు 65 మంది క్షతగాత్రులయ్యారు. ఉగ్రవాద సంస్థ ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) ఈ విధ్వంసానికి పాల్పడినట్లు తేలింది. 

ఈ కేసును దర్యాప్తు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కీలక నిందితుడు యాసీన్‌ భత్కల్, అతడి ప్రధాన అనుచరుడు హడ్డీలను 2013 ఆగస్టు 29న బీహార్‌లోని రక్సుల్‌ ప్రాంతంలో, ఎజాజ్‌ షేక్‌ను అదే ఏడాది సెపె్టంబర్‌ 6న ఉత్తరప్రదేశ్‌లోని పశి్చమ ప్రాంతమైన సహరంగ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో, జియా ఉర్‌ రెహా్మన్‌ను రాజస్థాన్‌లోని అజీ్మర్‌ రైల్వేస్టేషన్‌లో 2014 మార్చ్‌ 22న, తెహసీన్‌ అక్తర్‌ను పశి్చమ బెంగాల్‌లోని కాఖర్‌ర్బిత ప్రాంతంలో 2014 మార్చి 25న పట్టుకున్నారు.  

ఆరేళ్లలో పూర్తి అయిన ఈ కేసుల విచారణ
యాసీన్‌ భత్కల్‌ అరెస్టు తర్వాత మాత్రమే ఎజాజ్‌ షేక్‌కు దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ళలో పాత్ర ఉన్నట్లు తేలింది. దీనికి ముందే అతడిని ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ మరో కేసులో అరెస్టు చూపింది. ఆపై వీరందరినీ వేర్వేరు సమయాల్లో ఎన్‌ఐఏ హైదరాబాద్‌కు తీసుకువచ్చి దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ళ కేసుల్లో అరెస్టు చూపించింది. యాసీన్, హడ్డీలపై 2013 మార్చి 14న, రియాజ్, వఖాస్‌ తెహసీన్‌లపై 2014 సెపె్టంబర్‌ 16, ఎజాజ్‌ షేక్‌పై 2015 జూన్‌ ఆరున అభియోగపత్రాలు దాఖలు చేసింది. 

చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో వీరి విచారణ జరిగింది. 2016 నవంబర్‌ 21న విచారణ పూర్తి కాగా... డిసెంబర్‌ 13న రియాజ్‌ మినహా మిగిలిన ఐదుగురినీ దోషులుగా తేలుస్తూ న్యాయస్థానం తీర్పు ఇచి్చంది. అదే నెల 19న ఈ దోషులకు ఉరి శిక్ష విధించినట్లు కోర్టు ప్రకటించింది. ఈ శిక్షను 2025 ఏప్రిల్‌ 8న తెలంగాణ హైకోర్టు సైతం ఖరారు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రియాజ్‌ భత్కల్‌ ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు.  

అమలు వరకు సుదీర్ఘ ప్రక్రియ... 
ఉగ్రవాదులకు పడిన ఈ ఉరి శిక్ష అమలుకు ముందు సుదీర్ఘ ప్రక్రియే ఉంటుంది. ఇప్పటికి ట్రయల్‌ కోర్టు విధించిన శిక్షను హైకోర్టు ఖరారు చేసింది. ఇప్పుడు దోషులు పిటిషన్‌ దాఖలు చేయడం ద్వారా సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశమూ ఉంది. సుప్రీం కోర్టులోనూ వీరికి చుక్కెదురైతే క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసుకోవచ్చు. దోషి లేదా వారి తరఫు వారో ఈ పిటిషన్లను దాఖలు చేయడానికి ఆస్కారం ఉంది. రాష్ట్రపతి సైతం క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరిస్తే దోషులకు విధించిన మరణశిక్ష ఖరారైనట్లే. దీంతో శిక్ష విధించిన న్యాయస్థానం పరిధిలోకి వచ్చే రాష్ట్రంలో దీన్ని అమలు చేయడానికి సన్నాహాలు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం ఐఎం ఉగ్రవాదులు వివిధ రాష్ట్రాల్లోని జైళ్లల్లో ఉన్నారు. అక్కడ నమోదైన కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు.    

 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
terrorists
Hyderabad
Dilsukhnagar
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.