Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. ధాన్యం నమోదులో దగా! 
ADVERTISEMENT 

ధాన్యం నమోదులో దగా! 

Telangana Sakshi User Sakshi Sakshi Time Jul 1, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
bill.jpg

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్‌ వేసంగిలో 104 బస్తాల ధాన్యం తూకం వేశాడు. మిల్లు వద్ద ట్రక్‌షీట్‌లో 104 బస్తాలుగానే నమోదు చేశారని భావించాడు. కింద 104 మైనస్‌ 4 అని రాసినట్టుగా గమనించలేదు. తీరా 100 బస్తాలకు మాత్రమే నగదు జమ కావడంతో అవాక్కయ్యాడు.

ఇది ఒక్క కరీంనగర్‌లోనే కాదని, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో మిల్లర్లు రైతుల కష్టాన్ని యథేచ్ఛగా దోచేశారని తెలుస్తోంది. మొన్నటిదాకా తాలు పేరిట కొనుగోలు కేంద్రాల్లో, నాణ్యత లేదని రైస్‌మిల్లులో క్వింటాలుకు 9 నుంచి 11 కిలోల వరకు కోతపెట్టారు. వీటికి తోడు తాజాగా మరో కొత్త తరహా దోపిడీకి మిల్లర్లు తెరతీసినట్లు.. శ్రీనివాస్‌ తరహా ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి.  



రూ.వందల కోట్ల విలువైన ధాన్యానికి ఎసరు 

గతేడాది 50.23 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. అయితే ఈసారి అకాల వర్షాలు ఇబ్బంది పెట్టినా దిగుబడి పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 7,037 కొనుగోలు కేంద్రాల్లో 11,39,597 మంది రైతుల నుంచి ఇప్పటివరకూ 66.49 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. ఈ మొత్తం ధాన్యం విలువ రూ.12,011 కోట్లుగా అధికారులు పేర్కొన్నారు.

ఇందులో దాదాపు రూ.1,500 కోట్లు మినహా మొత్తం ధాన్యం డబ్బులు ప్రభుత్వం చెప్పిన విధంగా రైతుల ఖాతాల్లో జమ చేసింది. వాస్తవానికి ప్రతి క్వింటాలుకు సగటున 10 కిలోల చొప్పున లెక్కలు వేసుకుంటే.. వేలాది క్వింటాళ్ల వరకు ధాన్యం కోతకు గురైంది. సాధారణ తరుగుతోనే రూ.కోట్లు వెనకేసుకున్న మిల్లర్లు ట్రక్‌ïÙట్ల మాయాజాలం కుంభకోణంతో రూ.వందల కోట్ల విలువైన ధాన్యాన్ని పోగు చేసుకున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.  



మొత్తం 21 బస్తాలకు కోత..! 

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం చిన్న»ొంకురుకి చెందిన రైతులు 10 మంది స్థానిక పీఏసీఎస్‌లో ధాన్యం అమ్ముకున్నారు. ధాన్యం కాంట వేస్తున్నప్పుడే తరుగు పేరుతో 2 కిలోలు కోత విధించారు. 10 మంది రైతులకు చెందిన 625 బస్తాల ధాన్యం లారీలో లోడ్‌ చేసి మిల్లుకు తరలించారు.

అయితే రైతులకు తెలియకుండానే మిల్లుల్లో సైతం మరోసారి కటింగ్‌ పెట్టారు. తర్వాత ట్రక్‌ షీట్‌ మాయాజాలంతో కేవలం 604 బస్తాలకే లెక్కగట్టారు. ఆ మేరకే డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. దీంతో తమకు ధాన్యం డబ్బులు తక్కువపడ్డాయని రైతులు వాపోతున్నారు. ఎంతలేదన్నా వీరి వద్దనుంచి 9 క్వింటాళ్ల వరకు ధాన్యం దోపిడీకి గురైంది. 

11 బస్తాలు కొట్టేశారు 

వేసంగి ధాన్యాన్ని మహమ్మదాబాద్‌లోని కొను గోలు కేంద్రం ద్వారా విక్రయించాం. నాతో పాటు మరో ఇద్దరు రైతుల బస్తాలు కలిపి మొ త్తం 383 బ్యాగులు తూకం వేశారు. తొలుత కొనుగోలు కేంద్రంలోనే తరుగు పెట్టారు. మళ్లీ మిల్లు వద్దకు వెళ్లాక మొత్తం మీద 372 బస్తాలుగా ట్రక్‌ïÙటులో నమోదు చేశారు.  – ఎండీ ఆలీ, కంచన్‌పల్లి, మహబూబ్‌నగర్‌ 



తేమ, తాలు పేరుతో కట్‌ చేశారు.. 

యాసంగి సీజన్‌లో పండించిన ధాన్యాన్ని ఇప్పగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్‌కు తీసుకెళ్లా. కాంటా పూర్తయిన తర్వాత, 439 బస్తాలు ఉన్నట్లు లెక్కవేసి రైస్‌ మిల్లుకు పంపించారు. ధాన్యం బస్తాలు మిల్లుకు వెళ్లిన తర్వాత తేమ, తాలు పేరిట కొన్ని బస్తాలు కట్‌ చేశారు. మొత్తం మీద 428 బస్తాలనే బిల్లులో చూపించారు.  –జి.వెంకటయ్య, ఇప్పగూడెం, స్టేషన్‌ఘన్‌పూర్‌ 



రైతుల ఇష్టం మేరకే తరుగు 

ఎడతెరిపిలేని వర్షాల వల్ల ధాన్యం డామేజ్‌ వచి్చంది. దానివల్ల రైతుల ఇష్టం మేరకే మిల్లర్లు తరుగు తీశారు. ధాన్యం ఆరబెట్టడం, మళ్ళీ వర్షం పడటం పక్షం రోజులు అదే పరిస్థితి. కానీ ఒకసారి తరుగు తీశాక మళ్ళీ తీయడం ఉండదు.     – అన్నమనేని సుధాకర్‌రావు, రైస్‌ మిల్లర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి 

మొత్తం డబ్బులు పడలేదు 

మా ఊరిలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్మిన. అప్పుడు తరుగుతో 142 బస్తాలు లెక్క గట్టారు. తీరా ఇప్పుడు 138 బస్తాలకే డబ్బులు పడ్డాయి. సెంటర్‌ వాళ్ళను అడిగితే.. మాకేమీ తెలియదు మిల్లు వాళ్ళను అడగమంటున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు.  –ప్రశాంత్, కౌలు రైతు, చిన్న బొంకూర్, సుల్తానాబాద్‌ 

4.4 క్వింటాళ్ల కోత.. రూ.9,800 నష్టం 

కొనుగోలు కేంద్రం నుంచి మొత్తం 303 బస్తాలు తూకం వేశారు. ఒకలారీలో 199 బస్తాలు పోగా.. ఆరు బ్యాగులు కట్‌ చేశారు. మరో దాంట్లో 104 బ్యాగులు పోయినయి.. ఐదు బ్యాగులు కట్‌ చేశారు. మొత్తంగా 4.4 క్వింటాళ్లు కోతతో మొత్తం రూ.9,800 నష్టం జరిగింది. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు.   – విష్ణువర్ధన్, కరీంనగర్‌ 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
grains
srinivas
cutting
extortion
Millers
Farmers
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

పొలం.. కదలని హలం!

పొలం.. కదలని హలం!

బాబు ప్రేమ బూటకం.. మోసం నిజం!

బాబు ప్రేమ బూటకం.. మోసం నిజం!

అన్నదాతలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు దారుణలు: వైఎస్‌ జగన్‌

అన్నదాతలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు దారుణలు: వైఎస్‌ జగన్‌

‘రైతులపై బాబు ప్రేమ బూటకం- మోసం.. నిజం’

‘రైతులపై బాబు ప్రేమ బూటకం- మోసం.. నిజం’

అరేయ్ ప్రభాకర్.. నీకు నిజంగా దమ్ముంటే ఇప్పుడు రా ఈడ్పుగంటి శ్రీనివాసబాబు వార్నింగ్

అరేయ్ ప్రభాకర్.. నీకు నిజంగా దమ్ముంటే ఇప్పుడు రా ఈడ్పుగంటి శ్రీనివాసబాబు వార్నింగ్

ప్రతి గింజా కాదు.. 'కోటా మేరకే'!

ప్రతి గింజా కాదు.. 'కోటా మేరకే'!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.