Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Technology
  4. Business Home
ADVERTISEMENT 

ఇంధన సర్దు‘బాదుడు’కు బ్రేక్‌ !

Technology Sakshi User Sakshi Sakshi Time Jul 12, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
PWER.jpg

4 త్రైమాసికాల ఎఫ్‌ఎస్‌ఏ చార్జీల వసూళ్లకు అనుమతి కోరిన డిస్కంలు 

ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలు లెక్కించి ముందుగా పత్రికల్లో యాడ్స్‌ ఇవ్వడంలో డిస్కంల విఫలం 

డిస్కంల వెబ్‌సైట్‌లో సైతం పొందుపరచని వైనం 

దీంతో డిస్కంల పిటిషన్లకు విచారణ అర్హత లేదని తోసిపుచ్చిన ఈఆర్సీ 

రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎఫ్‌ఎస్‌ఏల వసూళ్లకు అనుమతి కోరడం ఇదే తొలిసారి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని విద్యుత్‌ వినియోగదారుల నుంచి ఇంధన సర్దుబాటు చార్జీలు(ఎఫ్‌ఎస్‌ఏ) వసూలు చేసేందుకు ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలు(టీజీఎన్పిఈసీఎల్‌/టీజీఎస్పీడీసీఎల్‌) చేసిన విజ్ఞప్తిని తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్సీ) తోసిపుచ్చింది. 

ఎఫ్‌ఎస్‌ఏ చార్జీల వసూళ్లకు అనుమతిస్తూ 2023 జనవరి 18న ఈఆర్సీ జారీ చేసిన మూడో సవరణ నిబంధనలు–2023ను డిస్కంలు అమలుపరచకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 2023– 2024 ఆర్థిక సంవత్సరంలోని నాలుగు త్రైమాసికాలకు సంబంధించిన ఎఫ్‌ఎస్‌ఏ చార్జీల వసూళ్లకు అనుమతి కోరుతూ డిస్కంలు దాఖలు చేసిన పటిషన్లకు విచారణ అర్హత లేదని తిరస్కరిస్తూ బుధవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది.

2023 ఏప్రిల్‌–జూన్, 2023 జూలై–సెప్టెంబర్, 2023 అక్టోబర్‌–డిసెంబర్, 2024 జనవరి–మార్చి త్రైమాసికాలకు సంబంధించిన ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలు వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు రెండు డిస్కంలు చెరో నాలుగు పిటిషన్లు దాఖలు చేయగా, అన్నింటినీ ఈఆర్సీ కొట్టి వేసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యుత్‌ వినియోగదారుల నుంచి ఎఫ్‌ఎస్‌ఏ చార్జీల వసూళ్లకు డిస్కంలు అనుమతి కోరడం ఇదే తొలిసారి.  

ఎందుకు తిరస్కరించిందంటే..? 
నిబంధనల ప్రకారం..  N నెలకు సంబంధించిన ఇంధన సర్దుబాటు చార్జీలను  N+2 వ నెలకు సంబంధించిన బిల్లుతో కలిసి  N+3వ నెలలో డిస్కంలు జారీ చేయాలి.  N+2 నెల 15వ తేదీలోగా ఎఫ్‌ఎస్‌ఏ చార్జీల వివరాలను డిస్కంలు తమ వైబ్‌సైట్‌లో ప్రకటించాలి. ఉదాహరణకు జనవరి నెల ఇంధన సర్దుబాటు చార్జీలను డిస్కంలు ఆ తర్వాతి మార్చి నెల బిల్లుతో కలిపి ఏప్రిల్‌ నెలలో వినియోగదారులపై విధించాల్సి ఉంటుంది. డిస్కంలు ఒక నెలకు సంబంధించిన ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలను లెక్కించి సంబంధిత నెల ముగిశాక 45 రోజుల్లోగా దిన పత్రికల్లో యాడ్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. 45 రోజులు దాటితే ఆ నెలకు సంబంధించిన ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలను అనుమతించరు. 

విద్యుత్‌ బిల్లుల్లో ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలను ప్రత్యేకంగా చూపించడంతోపాటు వసూలైన ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలను ప్రత్యేక ఖాతా కింద నమోదు చేయాలి. ప్రతి త్రైమాసికం ముగిసిన తర్వాత 60 రోజుల్లోగా ఆ త్రైమాసికంలోని నెలలకు సంబంధించిన ఎఫ్‌ఎస్‌ఏ చార్జీల వివరాలను ఈఆర్సీకి అందజేయాలి. డిస్కంలు విధించిన ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలను ఈఆర్సీ క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదిస్తుంది. యూనిట్‌ విద్యుత్‌కు గరిష్టంగా 30పైసల వరకు ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలను ఈఆర్సీ ముందస్తు అనుమతి లేకుండా డిస్కంలు విధించవచ్చు. 

ఒకవేళ ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలు యూనిట్‌కి 30పైసలకు మించితే ముందస్తు అనుమతి లేకుండా ఆపైన ఉండే అదనపు చార్జీలు విధించడానికి వీలులేదు. 30 పైసల సీలింగ్‌కు మించి ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలు వసూలు చేయాల్సి వస్తే ఈఆర్సీ నుంచి ముందస్తు అనుమతి పొందాలి. ఈ నిబంధనలను పాటించకపోవడంతో ఎఫ్‌ఎస్‌ఏ చార్జీల వసూలు చేసేందుకు ఉత్తర/దక్షిణ తెలంగాణ డిస్కంలు చేసిన విజ్ఞప్తిని ఈఆర్సీ తాజాగా తిరస్కరించింది.  

కేంద్రం నిబంధనల ఆధారంగా  
ఇంధన/ విద్యుత్‌ కొనుగోలు వ్యయ సర్దుబాటు చార్జీల భారాన్ని ఆటోమెటిక్‌గా విద్యుత్‌ బిల్లుల్లో బదిలీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2021 అక్టోబర్‌ 22న ఎలక్ట్రిసిటీ (టైమ్లీ రికవరీ ఆఫ్‌ కాస్ట్‌ డ్యూ టు చేంజ్‌ ఇన్‌లా) రూల్స్‌ 2021ను అమల్లోకి తెచ్చింది. బొగ్గు, ఇతర ఇంధనాల ధరల పెరుగుదలతో విద్యుత్‌ కొనుగోలు వ్యయం కూడా ఎక్కువ కావడంతో ఎప్పటికప్పుడు వినియోగదారుల నుంచి ఇంధన సర్దుబాటు చార్జీల రూపంలో వసూలు చేసేందుకు కేంద్రం ఈ నిబంధనలు తీసుకొచ్చింది. దీని ఆధారంగానే గతేడాది ఈఆర్సీ ఎఫ్‌ఎస్‌ఏ చార్జీల వసూళ్లకు అనుమతిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది.   

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Discom
Telangana
charge
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.