Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమి.. గౌతమ్‌ గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు 

Sports Sakshi User Sakshi Sakshi Time Jun 12, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Untitled-3.jpg

వరల్డ్‌ టెస్ట్‌ ఛాం‍పియన్‌షిప్‌ 2021-23 ఫైనల్లో టీమిండియా ఓటమి అనంతరం భారత మాజీ ఓపెనింగ్‌ బ్యాటర్‌ గౌతమ్‌ గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత పదేళ్లుగా టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవకపోవడానికి గల కారణాలను విశ్లేషించాడు. ఇతర దేశాల క్రీడా సంస్కృతికి భారత్‌లో జరుగుతున్న తంతుకు మధ్య వ్యత్యాసాన్ని వివరించాడు.

క్రికెట్‌లో వ్యక్తి పూజపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. జట్టు కంటే ఆటగాళ్లను ఎక్కువగా ఆరాధించే అభిమానుల వైఖరిపై మండిపడ్డాడు. జట్టు ఓడిపోయినా పర్వాలేదు, తమ ఆరాధ్య ఆటగాడు రాణిస్తే చాలనుకునే మనస్తత్వాన్ని ఫ్యాన్స్‌ వీడాలని పిలుపునిచ్చాడు. భారత దేశంలో క్రికెటర్లు క్రికెట్‌ కంటే ఎత్తుకు ఎదిగిపోయారని అన్నాడు. కొందరు క్రికెటర్లు తాము ఆట కంటే గ్రేట్‌ అని ఫీలవ్వడానికి అభిమానుల వైఖరే కారణమని తెలిపాడు.      

భారత క్రికెట్‌లో క్రికెటర్లను ఆరాధించే సంస్కృతి పోతే తప్ప టీమిండియా ఐసీసీ టైటిల్‌ గెలవలేదని అభిప్రాయపడ్డాడు. జట్టు కంటే ఆటగాడు ఎప్పుడూ ఎక్కువ కాదని, ఈ విషయంలో భారత క్రికెట్‌ అభిమానులు ఇతర దేశాల ఫ్యాన్స్‌ను చూసి నేర్చుకోవాలని అన్నాడు. భారత్‌లో లాగా ఇతర దేశాల్లో క్రికెటర్లను దేవుళ్లతో సమానంగా ఆరాధించరని, వ్యక్తిగత భజన కంటే వారికి జట్టు ప్రయోజనాలే ముఖ్యమని తెలిపాడు.

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ దేశాల్లో ఈ సంస్కృతి ఉంది కాబట్టే ఆ జట్లు విశ్వవేదికపై భారత్‌ కంటే మెరుగ్గా రాణిస్తున్నాయని అన్నాడు. గంభీర్‌ చేసిన ఈ వ్యాఖ్యలు టీమిండియా స్టార్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలను ఉద్దేశించి చేసినవిగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, గత పదేళ్లుగా టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవని విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో భారత జట్టు నాలుగు సందర్భాల్లో ఫైనల్‌కు చేరినా నిరాశే మిగిలింది. నిన్న (జూన్‌ 11) ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఆసీస్‌ చేతిలో 209 పరుగుల తేడాతో ఓటమిపాలై, నాలుగో సారి ఐసీసీ ట్రోఫీ గెలిచే అవకాశాన్ని చేజార్చుకుంది.

444 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్‌ 234 పరుగులకే ఆలౌటై, ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 164/3 స్కోర్‌ వద్ద ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌ కనీస ప్రతిఘటన కూడా లేకుండా చేతులెత్తేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. ట్రవిస్‌ హెడ్‌ (163), స్టీవ్‌ స్మిత్‌ (121) శతకాలతో చెలరేగడంతో 469 పరుగుల భారీ స్కోర్‌ చేసి ఆలౌట్‌ కాగా.. భారత్‌ 296 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం ఆసీస్‌ 270/8 స్కోర్‌ వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేయగా... భారత్‌ 234 పరుగులకు ఆలౌటైంది. 

ఇటు సోషల్ మీడియాలోనూ భారత్ ఓటమిని జీర్ణించుకోవట్లేదు అభిమానులు. తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు ఫ్యాన్స్.

Indians trying to hold ICC trophy in last 10 yearspic.twitter.com/p0iK63TzK7

— Sagar (@sagarcasm) June 11, 2023

చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా తొలి రోజే ఓడిపోయింది..!

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Gautam Gambhir
ICC tournament
team india
WTC Final 2021-2023
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

టీమిండియా ఆటతీరుపై శ్రేయస్‌ ఆగ్రహం

టీమిండియా ఆటతీరుపై శ్రేయస్‌ ఆగ్రహం

పృథ్వీ షాపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్

పృథ్వీ షాపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

నితీశ్‌రెడ్డికి గాయం.. ఇంగ్లండ్‌ టూర్‌కు దూరం!

నితీశ్‌రెడ్డికి గాయం.. ఇంగ్లండ్‌ టూర్‌కు దూరం!

 బీసీసీఐకి సునీల్‌ గావస్కర్‌ కీలక విజ్ఞప్తి!

బీసీసీఐకి సునీల్‌ గావస్కర్‌ కీలక విజ్ఞప్తి!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.