Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

మథ్యూస్‌ ఆల్‌రౌండ్‌ షో.. ఆర్సీబీని చిత్తు చేసిన ముంబై

Sports Sakshi User Sakshi Sakshi Time Mar 6, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
rcb.jpg

మథ్యూస్‌ ఆల్‌రౌండ్‌ షో.. ముంబై ఘన విజయం

మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ లీగ్‌లో భాగంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ముంబై విజయభేరి మోగించింది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌.. కేవలం 14.2 ఓవర్లలోనే వికెట్‌ నష్టపోయి చేధించింది.

ముంబై విజయంలో ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ మాథ్యూస్ కీలక పాత్ర పోషించింది. తొలుత బౌలింగ్‌లో మూడు వికెట్లు పడగొట్టిన మాథ్యూస్, బ్యాటింగ్‌లో 77 పరుగులతో ఆజేయంగా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, ఒక సిక్సర్‌ ఉన్నాయి. మాథ్యూస్‌తో పాటు నాట్‌ స్కివర్‌ కూడా అద్భుత ఇన్నింగ్స్‌ ఆడింది. 29 బంతులు ఎదుర్కొన్న స్కివర్‌ 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 55 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. 

ఆర్సీబీ 18.4 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. ముంబై బౌలర్లలో హేలీ మాథ్యూస్ మూడు వికెట్లు పడగొట్టగా.. అమీలియా కేర్‌, ఇషాక్‌ తలా రెండు వికెట్లు సాధించారు. ఆర్సీబీ బ్యాటర్లలో రిచా ఘోష్‌ 28 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. ఆమెతో పాటు మంధాన(23), కనికా అహుజా(22) పరుగులతో రాణించారు.

►10 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్‌  వికెట్‌ నష్టానికి 95 పరుగులు చేసింది. క్రీజులో మాథ్యూస్(50), నాట్ స్కివర్(22) పరుగులతో ఉన్నారు.

►6 ఓవర్లు ముగిసే సరికి ముంబై వికెట్‌ నష్టానికి 54 పరుగులు చేసింది. క్రీజులో మాథ్యూస్(31), నాట్ స్కివర్(0) పరుగులతో ఉన్నారు.

►156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. 2 ఓవర్లకు వికెట్‌ నష్టపోకుండా 15 పరుగులు చేసింది. క్రీజులో మాథ్యూస్,యస్తికా భాటియా ఉన్నారు.

►టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ 18.4 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. ముంబై బౌలర్లలో హేలీ మాథ్యూస్ మూడు వికెట్లు పడగొట్టగా.. అమీలియా కేర్‌, ఇషాక్‌ తలా రెండు వికెట్లు సాధించారు. ఆర్సీబీ బ్యాటర్లలో రిచా ఘోష్‌ 28 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. ఆమెతో పాటు మంధాన(23), కనికా అహుజా(22) పరుగులతో రాణించారు.

►18 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. క్రీజులో స్కాట్‌(14), రేణుకా సింగ్‌ ఉన్నారు.

►71 పరుగులు వద్ద ఆర్సీబీ ఐదో వికెట్‌ కోల్పోయింది. 13 పరుగులు చేసిన పెర్రీ రనౌట్‌ రూపంలో వెనుదిరిగింది. 9 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 5 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. క్రీజులో రిచాఘోష్‌, కనికా ఉన్నారు.

43 పరుగులకే 4 వికెట్లు.. కష్టాల్లో ఆర్సీబీ 

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ కేవలం 43 పరుగులుకే నాలుగు వికెట్లు కోల్పోయింది. స్మృతి మంధాన(11), డివైన్‌(6),దిశా కసత్(0), నైట్‌(0) పెవిలియన్‌కు చేరారు. ముంబై బౌలర్లలో  హేలీ మాథ్యూస్, సైకా ఇషాక్ చెరో రెండు వికెట్లు సాధించారు.

►2 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్‌ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. క్రీజులో స్మృతి మంధాన(11), డివైన్‌(6) పరుగులతో ఉన్నారు.

మహిళల ప్రీమియర్‌ లీగ్‌-2023 తొలి మ్యాచ్‌లోనే ఓటమి చవిచూసిన ఆర్సీబీ.. ఇప్పుడు బ్రబౌర్న్‌ వేదికగా ముంబై ఇండియన్స్‌తో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్‌ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. బెంగళూరు మాత్రం ఒక మార్పు చేసింది. 

తుది జట్లు: 

ముంబై ఇండియన్స్ : యస్తికా భాటియా(వికెట్‌ కీపర్‌), హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్‌), అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, ఇస్సీ వాంగ్, అమంజోత్ కౌర్, హుమైరా కాజీ, జింటిమణి కలిత, సైకా ఇషాక్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన (కెప్టెన్‌), సోఫీ డివైన్, ఎల్లీస్ పెర్రీ, దిశా కసత్, రిచా ఘోష్ (వికెట్‌ కీపర్‌), హీథర్ నైట్, కనికా అహుజా, మేగన్ షుట్, శ్రేయాంక పాటిల్, ప్రీతీ బోస్, రేణుకా ఠాకూర్ సింగ్

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
WPL 2023
Royal Challengers Bangalore
Mumbai Indians
smruthi mandhana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ముంబైకి సూర్య గుడ్‌బై!.. గంభీర్‌తో కలిసి ఆ జట్టులోకి?!

ముంబైకి సూర్య గుడ్‌బై!.. గంభీర్‌తో కలిసి ఆ జట్టులోకి?!

మొన్న బీసీసీఐ.. ఇవాళ ముంబై ఇండియ‌న్స్‌!

మొన్న బీసీసీఐ.. ఇవాళ ముంబై ఇండియ‌న్స్‌!

భారత టీ20 జట్టు ఇదే.. వైభవ్‌, భువనేశ్వర్‌కు చోటు!

భారత టీ20 జట్టు ఇదే.. వైభవ్‌, భువనేశ్వర్‌కు చోటు!

మా ఆధిపత్యం కొనసాగింది: పాటీదార్‌ 

మా ఆధిపత్యం కొనసాగింది: పాటీదార్‌ 

రాయల్‌గా సంబరాలు

రాయల్‌గా సంబరాలు

‘కడుపున పుట్టిన పిల్లల్లాగే.. అప్పుడే సగం గెలిచేశాము’

‘కడుపున పుట్టిన పిల్లల్లాగే.. అప్పుడే సగం గెలిచేశాము’

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.