Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

చెలరేగిన జేడన్‌ సీల్స్‌.. దంచికొట్టిన కింగ్‌.. విండీస్‌దే సిరీస్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Dec 11, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
wi.jpg

బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. పర్యాటక జట్టును ఏడు వికెట్ల తేడాతో ఓడించి.. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ కైవసం చేసుకుంది. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు విండీస్‌ పర్యటనకు వచ్చింది.

ఈ క్రమంలో తొలుత టెస్టు సిరీస్‌ జరుగగా.. మొదటి టెస్టులో వెస్టిండీస్‌ 201 పరుగుల భారీ తేడాతో గెలిచింది. అయితే, రెండో టెస్టులో ఊహించని రీతిలో పుంజుకున్న బంగ్లా 101 పరుగుల తేడాతో విండీస్‌ను కంగుతినిపించింది. దీంతో సిరీస్‌ 1-1తో సమంగా ముగిసింది.

అనంతరం.. సెయింట్‌ కిట్స్‌ వేదికగా వన్డే సిరీస్‌ మొదలుకాగా.. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య విండీస్‌ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. అదే జోరులో మంగళవారం రాత్రి జరిగిన రెండో వన్డేలోనూ జయభేరి మోగించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన వెస్టిండీస్‌.. బంగ్లాను 227 పరుగులకు ఆలౌట్‌ చేసింది.

స్పెషలిస్టు బ్యాటర్లు విఫలమైన వేళ
బంగ్లాదేశ్‌ ఆటగాళ్లలో ఓపెనర్‌ తాంజిద్‌ హసన్‌(46) ఫర్వాలేదనిపించగా.. వెటరన్‌ బ్యాటర్‌ మహ్మదుల్లా అర్ధ శతకం(62)తో మెరిశాడు. వీరికి తోడు అనూహ్యంగా టెయిలెండర్‌ తంజీమ్‌ హసన్‌ సకీబ్‌ 45 పరుగులతో రాణించాడు. 

స్పెషలిస్టు బ్యాటర్లు విఫలమైన వేళ.. ఈ బౌలర్‌ బ్యాట్‌ ఝులిపించి నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

చెలరేగిన జేడన్‌ సీల్స్‌.. దంచికొట్టిన కింగ్‌
ఇక విండీస్‌ బౌలర్లలో జేడన్‌ సీల్స్‌ నాలుగు వికెట్లతో చెలరేగగా.. గుడకేశ్‌ మోటీ రెండు, మిండ్లే, రొమారియో షెఫర్డ్‌, జస్టిన్‌ గ్రీవ్స్‌, రోస్టన్‌ చేజ్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. కాగా బంగ్లా విధించిన నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌.. 36.5 ఓవర్లలోనే పనిపూర్తి చేసింది. ఓపెనర్లలో బ్రాండన్‌ కింగ్‌ సూపర్‌ హాఫ్‌ సెంచరీతో దుమ్ములేపాడు. 76 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, మూడు సిక్స్‌ల సాయంతో 82 పరుగులు సాధించాడు.

మరో ఓపెనర్‌ ఎవిన్‌ లూయీస్‌ 49 రన్స్‌ చేయగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ కేసీ కార్టీ 45 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక కెప్టెన్‌ షాయీ హోప్‌(17)తో కలిసి షెర్ఫానే రూథర్‌ఫర్డ్‌(24 ఆఖరి వరకు అజేయంగా నిలిచి సిక్సర్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. 

ఏడు వికెట్ల తేడాతో గెలిచి 
ఈ క్రమంలో కేవలం మూడు వికెట్లు నష్టయి 230 పరుగులు చేసిన వెస్టిండీస్‌.. ఏడు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. విండీస్‌ పేసర్‌ జేడన్‌ సీల్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కించుకున్నాడు. ఇక బంగ్లాదేశ్‌- విండీస్‌ మధ్య గురువారం నామమాత్రపు మూడో వన్డే జరుగనుంది.

చదవండి: SMT 2024: షమీ మళ్లీ మాయ చేస్తాడా?.. నేటి నుంచే ముస్తాక్‌ అలీ ట్రోఫీ క్వార్టర్స్‌ పోరు

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
West Indies vs Bangladesh
Brandon King
Shai Hope
Sherfane Rutherford
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

డబుల్‌ సెంచరీ చేజార్చుకున్న గ్రీవ్స్‌.. హోప్‌ శతకం

డబుల్‌ సెంచరీ చేజార్చుకున్న గ్రీవ్స్‌.. హోప్‌ శతకం

హోల్డర్ సిక్సర్ల వర్షం.. సిరీస్ కైవసం చేసుకున్న విండీస్‌

హోల్డర్ సిక్సర్ల వర్షం.. సిరీస్ కైవసం చేసుకున్న విండీస్‌

ఇద్దరు ప్రపంచకప్‌ సభ్యులపై వేటు

ఇద్దరు ప్రపంచకప్‌ సభ్యులపై వేటు

స్వార్థపరుడు.. అతడు జట్టులో దండగ: భారత మాజీ కెప్టెన్‌ ఫైర్‌

స్వార్థపరుడు.. అతడు జట్టులో దండగ: భారత మాజీ కెప్టెన్‌ ఫైర్‌

నేపాల్‌ మీదైనా గెలిచాం.. సంతోషం: హ్యారీ బ్రూక్‌

నేపాల్‌ మీదైనా గెలిచాం.. సంతోషం: హ్యారీ బ్రూక్‌

రూథర్‌ఫోర్డ్‌ వీరంగం​.. హోల్డర్‌ మెరుపులు.. విండీస్‌ భారీ స్కోర్‌

రూథర్‌ఫోర్డ్‌ వీరంగం​.. హోల్డర్‌ మెరుపులు.. విండీస్‌ భారీ స్కోర్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.