Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

లండన్‌లో క్రికెటర్‌ మరణం.. నివాళులు అర్పించిన భారత్‌- ఇంగ్లండ్‌ ఆటగాళ్లు

Sports Sakshi User Sakshi Sakshi Time Jun 24, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
indvseng.jpg

టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య తొలి టెస్టు (Indv s Eng 1st Test) ఐదో రోజు ఆట సందర్భంగా ఇరుజట్ల ఆటగాళ్లు బ్లాక్‌ ఆర్మ్‌ బ్యాండ్స్‌తో బరిలోకి దిగారు. భారత మాజీ క్రికెటర్‌ దిలీప్‌ దోషి (Dilip Doshi) మరణానికి సంతాపం వ్యక్తం చేస్తూ మౌనం పాటించారు. కాగా భారత్‌కు చెందిన లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ దిలీప్‌ దోషి 77 ఏళ్ల వయసులో లండన్‌ (London)లో కన్నుమూశారు.

చారిత్రాత్మక విజయంలో కీలక పాత్ర
గుండెపోటు కారణంగా ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. కాగా 1979- 1983 మధ్య కాలంలో దిలీప్‌ దోషి భారత్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడారు. మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో ఐదు వికెట్లు తీసి.. జట్టు చారిత్రాత్మక విజయానికి దోహదం చేశారు.

ఇక తన కెరీర్‌లో మొత్తంగా 33 టెస్టు మ్యాచ్‌లు ఆడిన దిలీప్‌ దోషి  114 వికెట్లతో సత్తా చాటారు. అదే విధంగా.. పదిహేను వన్డేలు ఆడి 22 వికెట్లు పడగొట్టారు. దేశవాళీ క్రికెట్‌లో సౌరాష్ట్ర, బెంగాల్‌ క్రికెట్‌ జట్లకు ఆడిన ఆయన.. ఇంగ్లండ్‌ కౌంటీల్లోనూ భాగమయ్యారు. వార్విక్‌షైర్‌, నాటింగ్‌హామ్‌షైర్‌ జట్లకు ప్రాతినిథ్యం వహించారు.

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత లండన్‌లోనే శాశ్వత నివాసం ఏర్పరచుకున్న దిలీప్‌ దోషి.. సోమవారం మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన మృతికి సంతాపంగా భారత్‌- ఇంగ్లండ్‌ ఆటగాళ్లు మౌనం పాటించడంతో పాటు.. బ్లాక్‌ ఆర్మ్‌ బ్యాండ్స్‌ ధరించారు.

తొలి రోజు.. మూడో రోజు ఆలా
కాగా.. టెండుల్కర్‌- ఆండర్సన్‌ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో భారత​ జట్టు ఐదు టెస్టులు ఆడనుంది. ఇందులో భాగంగా లీడ్స్‌ వేదికగా శుక్రవారం తొలి టెస్టు మొదలుకాగా.. అహ్మదాబాద్‌ విమాన ప్రమాద మృతులకు సంతాప సూచకంగా తొలి రోజు ఇరుజట్ల ఆటగాళ్లు నల్లటి బ్యాండ్స్‌ భుజానికి కట్టుకుని బరిలోకి దిగారు.

అదే విధంగా.. మూడో రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ డేవిడ్‌ వాలంటైన్‌ లారెన్స్‌ (61) మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మౌనం పాటించడంతో పాటు నల్ల బ్యాండ్లు ధరించారు. తాజాగా మంగళవారం నాటి ఆఖరిదైన ఐదో రోజు ఆటలోనూ ఇదే తరహాలో నివాళి అర్పించారు.

భారత్‌కు 10 వికెట్లు.. ఇంగ్లండ్‌కు 350 రన్స్‌
మ్యాచ్‌ విషయానికొస్తే.. హెడింగ్లీ మైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసింది. ఇందుకు దీటుగా బదులిచ్చిన ఇంగ్లండ్‌ 465 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన టీమిండియా 364 పరుగులు చేయగా.. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు పరుగుల ఆధిక్యం కలుపుకొని ఇంగ్లండ్‌కు 371 పరుగుల లక్ష్యాన్ని విధించింది.

ఈ క్రమంలో ఆఖరిదైన ఐదో రోజు ఆటలో ఫలితం తేలనుంది. టీమిండియా పది వికెట్లు తీస్తే విజేతగా నిలుస్తుంది. అదే ఇంగ్లండ్‌ తమ ఓవర్‌ నైట్‌ స్కోరు (21/0)తో ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్‌ విజయానికి 350 పరుగుల దూరంలో ఉంది.

చదవండి: IND vs ENG: రిషబ్‌ పంత్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ..

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
India vs England
test series
Tendulkar-Anderson Trophy
london
Leeds
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

గుర్నూర్‌ బ్రార్‌పై క్రమశిక్షణ చర్యలు

గుర్నూర్‌ బ్రార్‌పై క్రమశిక్షణ చర్యలు

ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన ధోని

ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన ధోని

చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్‌

చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్‌

భారత్‌పై గెలుపు తర్వాత ఇంగ్లండ్ ఆటగాళ్లకు 'ఆ పార్టీకి' అనుమతి

భారత్‌పై గెలుపు తర్వాత ఇంగ్లండ్ ఆటగాళ్లకు 'ఆ పార్టీకి' అనుమతి

టీమిండియా ఆటతీరుపై శ్రేయస్‌ ఆగ్రహం

టీమిండియా ఆటతీరుపై శ్రేయస్‌ ఆగ్రహం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.