Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

డివిలియర్స్‌ విధ్వంసం.. ఇండియా చాంపియన్స్‌కు షాక్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Jul 23, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
abd.jpg

వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌-2025 (WCL 2025)సీజన్‌ను ఇండియా చాంపియన్స్‌ ఓటమితో ఆరంభించింది. సౌతాఫ్రికా చాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్‌ సేన 88 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. నార్తాంప్టన్‌ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇండియా చాంపియన్స్‌ తొలుత బౌలింగ్‌ చేసింది.

డివిలియర్స్‌ విధ్వంసం
ఈ క్రమంలో ఓపెనర్లు హషీమ్‌ ఆమ్లా (22), జాక్వెస్‌ రుడాల్ఫ్‌ (24) సౌతాఫ్రికాకు శుభారంభం అందించారు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ సరేల్‌ ఎర్వీ (15) నిరాశపరచగా.. ఏబీ డివిలియర్స్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు. రీఎంట్రీలో నాలుగో స్థానంలో బరిలో దిగిన ఈ లెజెండరీ బ్యాటర్‌ అజేయ అర్ధ శతకం సాధించాడు. కేవలం 30 బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 63 పరుగులు సాధించాడు.

Ball by ball highlights of AB de Villiers' 63*(30) vs India legends. Still got it.🐐pic.twitter.com/8S1sty9lKU

— . (@ABDszn17) July 22, 2025

 

భారీ స్కోరు
మిగతావాళ్లలో స్మట్స్‌ (17 బంతుల్లో 30), వాన్‌ విక్‌ (5 బంతుల్లో 18) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో సౌతాఫ్రికా చాంపియన్స్‌ ఆరు వికెట్ల నష్టానికి ఏకంగా 208 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.

ఇండియా చాంపియన్స్‌ బౌలర్లలో పీయూశ్‌ చావ్లా, యూసఫ్‌ పఠాన్‌ రెండేసి వికెట్లు తీయగా.. అభిమన్యు మిథున్‌కు ఒక వికెట్‌ దక్కింది. ఇక లక్ష్య ఛేదనలో ఇండియా చాంపియన్స్‌ చేతులెత్తేసింది. ఓపెనర్లు రాబిన్‌ ఊతప్ప (2), శిఖర్‌ ధావన్‌ (1) పూర్తిగా విఫలం కాగా.. సురేశ్‌ రైనా (16), అంబటి రాయుడు (0) నిరాశపరిచారు.

బిన్నీ ఒక్కడే.. యువీ గాయం వల్ల
ఈ క్రమంలో స్టువర్ట్‌ బిన్నీ (39 బంతుల్లో 37 నాటౌట్‌) ఒంటరి పోరాటం చేశాడు. మిగిలిన వారిలో యూసఫ్‌ పఠాన్‌ (5) విఫలం కాగా.. ఇర్ఫాన్‌ పఠాన్‌ (10), పీయూశ్‌ చావ్లా (9), పవన్‌ నేగి (0), వినయ్‌ కుమార్‌ (13) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. మరోవైపు.. కెప్టెన్‌ యువరాజ్‌ సింగ్‌ గాయం కారణంగా బ్యాటింగ్‌ చేయలేకపోయాడు. 

ఈ నేపథ్యంలో 18.2 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయిన ఇండియా చాంపియన్స్‌ 111 పరుగులు చేయగలిగింది. ఈ మ్యాచ్‌ వర్షం అంతరాయం కలిగించిన నేపథ్యంలో డీఎల్‌ఎస్‌ పద్ధతిలో సౌతాఫ్రికా 88 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఈ సీజన్లో రెండో విజయం నమోదు చేసి నాలుగు పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

చివరన యువీ సేన
మరోవైపు.. ఇండియా చాంపియన్స్‌ పాకిస్తాన్‌తో ఆడాల్సిన తొలి మ్యాచ్‌ను రద్దు చేసుకోగా ఒక పాయింట్‌ వచ్చింది. తాజా మ్యాచ్‌లో ఓటమి కారణంగా ఆరుజట్ల టోర్నీలో యువీ సేన ప్రస్తుతం ఆఖరి స్థానంలో ఉంది. 

కాగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఆటగాళ్లతో కూడిన జట్లతో.. ఇంగ్లండ్‌లో జరుగుతున్న ఈ టీ20 టోర్నమెంట్లో భారత్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగింది. తొలి సీజన్‌లో యువీ సేన ఫైనల్లో పాక్‌ను ఓడించి గెలుపొందిన విషయం తెలిసిందే.

చదవండి: రెండు నెలల్లోనే 17 కిలోలు తగ్గాడు.. సర్ఫరాజ్‌ ఖాన్‌కు ఇదెలా సాధ్యమైందంటే?
 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
WCL 2025
AB de Villiers
yuvraj singh
India Champions
South Africa Champions
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

IPL 2027: యువరాజ్‌ సింగ్‌ ఐపీఎల్‌ రీఎంట్రీ?

IPL 2027: యువరాజ్‌ సింగ్‌ ఐపీఎల్‌ రీఎంట్రీ?

అతడిని తప్పించమని ధోని చెప్పలేదు: మాజీ చీఫ్‌ సెలక్టర్‌

అతడిని తప్పించమని ధోని చెప్పలేదు: మాజీ చీఫ్‌ సెలక్టర్‌

శాంస‌న్ కాదు.. అత‌డే అందుకు అర్హుడు: డివిలియర్స్‌

శాంస‌న్ కాదు.. అత‌డే అందుకు అర్హుడు: డివిలియర్స్‌

సంజూను యువీతో పోల్చొద్దు.. అతడొక స్పెషల్‌ ప్లేయర్‌: గంభీర్‌

సంజూను యువీతో పోల్చొద్దు.. అతడొక స్పెషల్‌ ప్లేయర్‌: గంభీర్‌

T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు

T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు

చ‌రిత్ర సృష‍్టించిన ఇషాన్ కిషన్‌.. యువరాజ్ రికార్డు బ్రేక్‌

చ‌రిత్ర సృష‍్టించిన ఇషాన్ కిషన్‌.. యువరాజ్ రికార్డు బ్రేక్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.