Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

World Cup 2025: ఆసీస్‌తో సెమీ ఫైనల్‌.. భారత​ జట్టులో కీలక మార్పు

Sports Sakshi User Sakshi Sakshi Time Oct 28, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
pratikarawal.jpg

ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌-2025 (ICC Women's ODI WC)లో సెమీ ఫైనల్‌ చేరిన టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఓపెనింగ్‌ బ్యాటర్‌ ప్రతికా రావల్‌ (Pratika Rawal) గాయం వల్ల జట్టుకు దూరమైంది. ఈ నేపథ్యంలో భారత జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది.

ప్రతికా రావల్‌ స్థానంలో అండర్‌-19 వరల్డ్‌కప్‌ విన్నింగ్‌​ కెప్టెన్‌ జట్టులోకి వచ్చింది. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఈ విషయాన్ని సోమవారం ప్రకటించింది. ఇంతకీ ఎవరా ప్లేయర్‌ అంటే?!...

కుడికాలి చీలమండకు గాయం
సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో కీలక మ్యాచ్‌లో గెలిచి భారత్‌ సెమీస్‌ బెర్తు ఖరారు చేసుకుంది. లీగ్‌ దశలో చివరగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లోనూ సత్తా చాటి గెలుపొందాలని భావించింది. అయితే, నవీ ముంబై వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్‌ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసి పోయింది.

వాన వల్ల 27 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ మహిళా జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. అయితే, ఆదివారం నాటి ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో ప్రతికా రావల్‌ కుడికాలి చీలమండకు గాయమైంది. నొప్పితో విలవిల్లాడుతూ ఆమె మైదానం వీడింది. ఆ తర్వాత కూడా బ్యాటింగ్‌కు రాలేదు.

మంధానకు జోడీగా అమన్‌జోత్‌ కౌర్‌ 
ప్రతికా రావల్‌ స్థానంలో స్మృతి మంధాన (34 నాటౌట్‌)కు ఓపెనింగ్‌ జోడీగా అమన్‌జోత్‌ కౌర్‌ (15 నాటౌట్‌) వచ్చింది. అయితే, వర్షం ఎక్కువ కావడంతో 8.4 ఓవర్ల వద్ద ఆట నిలిచిపోయింది. అప్పటికి హర్మన్‌ సేన వికెట్‌ నష్టపోకుండా 57 పరుగులు చేసింది.

కాగా ఐసీసీ మహిళల వరల్డ్‌కప్‌ తుది అంకానికి చేరుకుంది. గువాహటిలో అక్టోబరు 29న తొలి సెమీస్‌ మ్యాచ్‌ జరుగనుండగా.. ఇందులో ఇంగ్లండ్‌- సౌతాఫ్రికా పోటీపడనున్నాయి. మరోవైపు.. భారత్‌- ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీ ఫైనల్‌ (అక్టోబరు 30) జరుగనుండగా.. ఇందుకు నవీ ముంబై వేదిక.

లేడీ సెహ్వాగ్‌ వచ్చేసింది
అయితే, పటిష్ట ఆస్ట్రేలియా జట్టుతో కీలక సెమీస్‌కు ముందు ఇన్‌ఫామ్‌ బ్యాటర్‌ ప్రతికా సేవలను భారత్‌ కోల్పోవడం ఆందోళన కలిగించే అంశం. ఆమె స్థానంలో ‘లేడీ సెహ్వాగ్‌’గా పేరొందిన షఫాలీ వర్మ జట్టులోకి వచ్చింది.


కాగా సెమీస్‌ మ్యాచ్‌లో జట్టు మార్పు నేపథ్యంలో నిబంధనల ప్రకారం ఈవెంట్‌ టెక్నికల్‌ కమిటీ నుంచి బీసీసీఐ అనుమతి తీసుకుంది. ఇక భారత జట్టు ఓపెనర్‌గా కొంతకాలం వెలుగొందిన షఫాలీ వర్మ.. తర్వాత ఫామ్‌లేమితో సతమతమైంది.

527 పరుగులు సాధించి..
అదే సమయంలో ప్రతికా రావల్‌ రావడం.. నిలకడగా ఆడటంతో జట్టులో షఫాలీ స్థానం గల్లంతైంది. ఈ క్రమంలోనే వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీలోనూ ఆమె చోటు దక్కించుకోలేకపోయింది. కాగా షఫాలీ చివరగా 2024, అక్టోబరులో భారత్‌ తరఫున వన్డే ఆడింది.

ఇక గతేడాది హర్యానా తరఫున దేశీ వన్డే క్రికెట్‌లో షఫాలీ మెరుగ్గా రాణించింది. 75.28 సగటుతో 527 పరుగులు సాధించింది. ఇదిలా ఉంటే.. 2024 డిసెంబరులో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ప్రతికా రావల్‌.. 23 ఇన్నింగ్స్‌లోనే వన్డేల్లో వెయ్యి పరుగుల మార్కు అందుకుంది.

తద్వారా మహిళల వన్డేల్లో ఫాస్టెస్ట్‌ 1000 రన్స్‌ చేసిన క్రికెటర్‌గా నిలిచింది. మంధానతో కలిసి 23 ఇన్నింగ్స్‌లో ఓపెనింగ్‌ వికెట్‌కు ప్రతికా ఏకంగా 1799 పరుగులు జతచేసి రికార్డు సృష్టించడం గమనార్హం. ఏదేమైనా చాంపియన్‌ జట్టు ఆసీస్‌తో పోరులో ప్రతికా లేని లోటు స్పష్టంగా తెలుస్తుందనడంలో సందేహం లేదు. కాగా సారథిగా షఫాలీ భారత్‌కు అండర్‌-19 ప్రపంచకప్‌-2023 అందించిన విషయం తెలిసిందే.

చదవండి: అతడు అద్భుతం.. అహంకారం వద్దు.. రోహిత్‌- గిల్‌ సూపర్‌: గంభీర్‌

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
ICC Womens World Cup 2025
india vs australia
Semi Fianal
Pratika Rawal
Shafali Verma
Smriti Mandhana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్‌.. ప్రపంచ రికార్డు

చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్‌.. ప్రపంచ రికార్డు

మంధాన మెరుపులు.. నెద‌ర్లాండ్స్ ముందు భారీ స్కోర్‌

మంధాన మెరుపులు.. నెద‌ర్లాండ్స్ ముందు భారీ స్కోర్‌

‘టైమ్‌’ ప్రభావశీలుర జాబితాలో స్మృతి

‘టైమ్‌’ ప్రభావశీలుర జాబితాలో స్మృతి

‘మ్యాచ్‌ విజయంలో ఆ ఇద్దరిదే కీలకపాత్ర’

‘మ్యాచ్‌ విజయంలో ఆ ఇద్దరిదే కీలకపాత్ర’

మహిళల జట్టు టి20 ప్రపంచకప్‌...పాకిస్తాన్‌పై భారత ఘనవిజయం (ఫొటోలు)

మహిళల జట్టు టి20 ప్రపంచకప్‌...పాకిస్తాన్‌పై భారత ఘనవిజయం (ఫొటోలు)

పాక్‌ను తిప్పేశారు

పాక్‌ను తిప్పేశారు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.