Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

WC 2023: చెలరేగిన సౌతాఫ్రికా బౌలర్లు.. ఆసీస్‌కు ఘోర పరాభవం! వరుసగా రెండో‘సారీ’

Sports Sakshi User Sakshi Sakshi Time Oct 13, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
southafrica4.jpg

ICC Cricket World Cup 2023- Australia vs South Africa, 10th Match: వన్డే వరల్డ్‌కప్‌-2023లో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభం నుంచే షాకుల మీద షాకులిచ్చింది సౌతాఫ్రికా. ప్రొటిస్‌ బౌలర్ల దెబ్బకు ఆసీస్‌ బ్యాటర్లు విలవిల్లాడిపోయారు. ముఖ్యంగా పేసర్‌ కగిసో రబడ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 71 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన కంగారూ జట్టు కష్టాల్లో కూరుకుపోయింది.

ఆరో ఓవర్‌ ఐదో బంతికి మిచెల్‌ మార్ష్‌(7)ను మార్కో జాన్సెన్‌ అవుట్‌ చేయడంతో మొదలైంది ఆసీస్‌ వికెట్ల పతనం. ఆ తర్వాత ఎంగిడి బౌలింగ్‌లో డేవిడ్‌ వార్నర్‌(13), రబడ బౌలింగ్‌లో స్మిత్‌(19) ఎల్బీడబ్ల్యూ, జోష్‌ ఇంగ్లిస్‌ను బౌల్డ్‌ కాగా.. మహరాజ్‌ బౌలింగ్‌లో మాక్స్‌వెల్‌(3) క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు.

ఆ తర్వాత మళ్లీ రంగంలోకి దిగిన రబడ స్టొయినిస్‌(5)ను అవుట్‌ చేయడంతో ఆసీస్‌ కష్టాల్లో కూరుకుపోయింది. ఇలాంటి దశలో మార్నస్‌ లబుషేన్‌కు తోడుగా టెయిలెండర్‌ మిచెల్‌ స్టార్క్‌(51 బంతుల్లో 27 పరుగులు) పట్టుదలగా క్రీజులో నిలబడిన వేళ మార్కో జాన్సెన్‌ దెబ్బకొట్టాడు. ఆ వెంటనే 46 పరుగులతో నిలకడగా ఆడుతున్న లబుషేన్‌ను కేశవ్‌ మహరాజ్‌ పెవిలియన్‌కు పంపాడు. 

ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌.. నాలుగు బౌండరీల సాయంతో 22 పరుగులతో నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. అయితే, 41వ ఓవర్‌ మూడో బంతికి తబ్రేజ్‌ షంసీ బౌలింగ్‌లో కమిన్స్‌ ఇచ్చిన క్యాచ్‌ను మిల్లర్‌ ఎలాంటి పొరపాటు చేయకుండా ఒడిసిపట్టాడు. దీంతో షంసీ ఖాతాలో వరల్డ్‌కప్‌ క్రికెట్‌లో తొలి వికెట్‌ చేరింది.  

అదే ఓవర్లో హాజిల్‌వుడ్‌ను కూడా షంసీ అవుట్‌ చేయడంతో ఆసీస్‌ కథ ముగిసిపోయింది. 177 పరుగులకే ఆలౌట్‌ కావడంతో సౌతాఫ్రికా చేతిలో ఏకంగా 134 పరుగులు భారీ తేడాతో ఓడి ఘోర పరాభవం మూటగట్టుకుంది. ప్రొటిస్‌ పేసర్లలో రబడకు మూడు, జాన్సెన్‌కు రెండు, లుంగి ఎంగిడికి ఒక వికెట్‌ దక్కగా.. స్పిన్నర్లు కేశవ్‌ మహారాజ్‌, తబ్రేజ్‌ షంసీ చెరో రెండు వికెట్లు తీశారు.

డికాక్‌ సెంచరీతో..

లక్నోలోని అటల్‌ బిహారీ వాజ్‌పేయి స్టేడియం వేదికగా గురువార నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న విషయం తెలిసిందే. కంగారూ జట్టు ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన ప్రొటిస్‌ టీమ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది.

ఓపెనర్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ క్వింటన్‌ డికాక్‌ వన్డే వరల్డ్‌కప్‌-2023లో వరుసగా రెండో శతకం(109) నమోదు చేయగా.. నాలుగో నంబర్‌ బ్యాటర్‌ ఎయిడెన్‌ మార్కరమ్‌ 56 పరుగులతో రాణించాడు. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌.. స్టార్‌ బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో భారీ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. కాగా ఈ మెగా టోర్నీ తాజా ఎడిషన్‌లో ఆసీస్‌కు ఇది వరుసగా రెండో పరాజయం.తొలుత చెన్నైలో టీమిండియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఆసీస్‌ ఓడిపోయిన విషయం తెలిసిందే.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
ICC ODI World Cup 2023
South Africa vs Australia
Quinton de Kock
Kagiso rabada
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ప్రేమ నుంచి పెళ్లిదాకా.. చీర్‌లీడ‌ర్స్‌తో క్రికెట‌ర్ల బంధం!

ప్రేమ నుంచి పెళ్లిదాకా.. చీర్‌లీడ‌ర్స్‌తో క్రికెట‌ర్ల బంధం!

IPL 2026: వైభవ్‌ తగ్గేదేలే!.. ఎవరికెంత ప్రైజ్‌ మనీ?

IPL 2026: వైభవ్‌ తగ్గేదేలే!.. ఎవరికెంత ప్రైజ్‌ మనీ?

ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే సూప‌ర్ బాల్‌.. దెబ్బకు స్టంప్స్ ఎగిరిపోయాయి

ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే సూప‌ర్ బాల్‌.. దెబ్బకు స్టంప్స్ ఎగిరిపోయాయి

AUS Vs SA: అసాధ్యం సుసాధ్యమైన రోజు!

AUS Vs SA: అసాధ్యం సుసాధ్యమైన రోజు!

T20 WC 2026: సౌతాఫ్రికా-న్యూజిలాండ్‌ మ్యాచ్‌లో షాకింగ్‌ సన్నివేశం

T20 WC 2026: సౌతాఫ్రికా-న్యూజిలాండ్‌ మ్యాచ్‌లో షాకింగ్‌ సన్నివేశం

సౌతాఫ్రికా ఘన విజయం.. టీమిండియాకు గుడ్‌న్యూస్‌!

సౌతాఫ్రికా ఘన విజయం.. టీమిండియాకు గుడ్‌న్యూస్‌!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.