Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

లెఫ్టాండర్స్‌ టెస్టు, వన్డే అత్యుత్తమ జట్లు ఇవే!

Sports Sakshi User Sakshi Sakshi Time Aug 14, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
zw.jpg

క్రికెట్‌లో ఎడమచేతి వాటం ఉన్న ఆటగాళ్లు చాలా తక్కువే మందే ఉంటారు. అందులోనూ అత్యుత్తమంగా రాణించేవాళ్లు ఇంకా తక్కువ. అయితే, ఆ జాబితాలో ఈ 22 మందికి తప్పక చోటు ఉంటుంది అంటున్నాడు టీమిండియా మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్‌! ఒకరోజు ఆలస్యంగానైనా సరే.. లెఫ్టాండర్లకు తాను ఇచ్చే ట్రిబ్యూట్‌ ఇదేనంటూ బుధవారం ఓ ట్వీట్‌ చేశాడు.

ప్రపంచ టెస్టు, వన్డే అత్యుత్తమ లెఫ్టాండర్లతో కూడిన తన తుదిజట్లను ప్రకటించాడు వసీం జాఫర్‌. టెస్టు ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్‌, శ్రీలంక లెజెండ్‌ కుమార్‌ సంగక్కరకు చోటిచ్చిన ఈ ముంబై బ్యాటర్‌.. వెస్టిండీస్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ బ్రియన్‌ లారాను వన్‌డౌన్‌ బ్యాటర్‌గా ఎంచుకున్నాడు.

ఇక నాలుగో స్థానంలో సౌతాఫ్రికాకు చెందిన గ్రేమ్‌ పొలాక్‌, ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా అలెన్‌ బోర్డర్‌, విండీస్‌ గ్రేట్‌ సర్‌ గ్యారీఫీల్డ్‌ సోబర్స్‌, ఆసీస్‌ ఆడం గిల్‌క్రిస్ట్‌లకు చోటు ఇచ్చాడు వసీం జాఫర్‌. ఇక బౌలింగ్‌ విభాగంలో ముగ్గురు సీమర్లు వసీం అక్రం(పాకిస్తాన్‌), జహీర్‌ ఖాన్‌(టీమిండియా)తో పాటు మిచెల్‌ జాన్సన్‌/చమిందా వాస్‌/ట్రెంట్‌ బౌల్ట్‌లలో ఒకరిని ఎంచుకుంటానని తెలిపాడు. 

కెప్టెన్‌గా ఆసీస్‌ లెజెండ్‌ 
ఈ జట్టులో ఒకే స్పిన్నర్‌, టీమిండియా చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌కు కూడా స్థానం ఇచ్చాడు. ఈ జట్టుకు కెప్టెన్‌గా అలెన్‌ బోర్డర్‌ను ఎంచుకున్న వసీం జాఫర్‌.. వికెట్‌ కీపర్‌గా గిల్‌క్రిస్ట్‌కు అవకాశం ఇచ్చాడు. ఇక ఈ జట్టులోని ఓపెనర్లు హెడెన్‌, సంగక్కర టెస్టుల్లో వరుసగా 8,625, 12, 400 పరుగులు సాధించారు. 

అదే విధంగా.. లారా 11,953 రన్స్‌ స్కోరు చేయడంతో పాటు.. ఫస్ల్‌క్లాస్‌ క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 501 రన్స్‌ నాటౌట్‌, టెస్టుల్లో 400 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఆల్‌టైమ్‌ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఇక పొలాక్‌ ఆడింది కేవలం 23 టెస్టులే అయినా.. అతడి సగటు 60.97. 

మరోవైపు.. కెప్టెన్‌ అలెన్‌ బోర్డర్‌ టెస్టుల్లో 11,174 పరుగులతో ఓవరాల్‌గా పదకొండవ స్థానంలో ఉన్నాడు. మిగిలిన వాళ్లలో గ్యారీఫీల్డ్‌ సోబర్స్‌ ఎనిమిది వేలకు పైగా పరుగులతో పాటు.. 235 వికెట్లు తీసి సత్తా చాటాడు. వికెట్‌ కీపర్‌ ఆడం గిల్‌క్రిస్ట్‌ 47.60 సగటు కలిగి ఉండటంతో పాటు ఏకంగా 416 డిస్మిసల్స్‌లో భాగమయ్యాడు.

వసీం జాఫర్‌ లెఫ్టాండర్స్‌ అత్యుత్తమ టెస్టు ప్లేయింగ్‌ ఎలెవన్‌
మాథ్యూ హెడెన్‌, కుమార్‌ సంగక్కర, బ్రియన్‌ లారా, గ్రేమ్‌ పొలాక్‌, అలెన్‌ బోర్డర్‌(కెప్టెన్‌), గ్యారీఫీల్డ్‌ సోబర్స్‌, ఆడం గిల్‌క్రిస్ట్‌, వసీం అక్రం, జహీర్‌ ఖాన్‌, మిచెల్‌ జాన్సన్‌/చమిందా వాస్‌/ట్రెంట్‌ బౌల్ట్‌, కుల్దీప్‌ యాదవ్‌.

ఇక వన్డే జట్టు విషయానికొస్తే.. మాథ్యూ హెడెన్‌(ఆస్ట్రేలియా), సనత్‌ జయసూర్య(శ్రీలంక), కుమార్‌ సంగక్కర(శ్రీలంక- వికెట్‌ కీపర్‌), బ్రియన్‌ లారా(కెప్టెన్‌), యువరాజ్‌ సింగ్‌(టీమిండియా ఆల్‌రౌండర్‌), మైకేల్‌ బెవాన్‌(ఆస్ట్రేలియా), వసీం అక్రం(పాకిస్తాన్‌), జహీర్‌ ఖాన్‌(టీమిండియా), కుల్దీప్‌ యాదవ్‌(టీమిండియా)లను వసీం జాఫర్‌ ఎంపిక చేసుకున్నాడు.  

అన్నట్లు ఆగష్టు 13న లెఫ్టాండర్స్‌ డే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వసీం జాఫర్‌ ఈ టీమ్స్‌ను సెలక్ట్‌ చేశాడన్నమాట!

చదవండి: కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ సాధించిన రోహిత్‌ శర్మ

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Wasim Jaffer
Left Handers Day
Allan Border
Kumar Sangakkara
Zaheer Khan
kuldeep yadav
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

IND vs AFG: కేఎల్‌ రాహుల్‌ను పక్కనపెట్టారా?

IND vs AFG: కేఎల్‌ రాహుల్‌ను పక్కనపెట్టారా?

ఢిల్లీకి పంత్‌... లక్నోకు కుల్దీప్‌!

ఢిల్లీకి పంత్‌... లక్నోకు కుల్దీప్‌!

BCCI: ప్రపంచకప్‌ గెలిచినా.. ఆ ఐదుగురిపై ‘వేటు’!.. కారణం?

BCCI: ప్రపంచకప్‌ గెలిచినా.. ఆ ఐదుగురిపై ‘వేటు’!.. కారణం?

కుల్దీప్‌ యాదవ్‌ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)

కుల్దీప్‌ యాదవ్‌ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)

కుల్దీప్ పెళ్లి సందడి.. డ్యాన్స్‌ చేసిన చాహల్‌! వీడియో

కుల్దీప్ పెళ్లి సందడి.. డ్యాన్స్‌ చేసిన చాహల్‌! వీడియో

మా అన్న పెళ్లికి ధూంధాం చేస్తా!

మా అన్న పెళ్లికి ధూంధాం చేస్తా!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.