టీజీ20 లీగ్లో శుక్రవారం వరంగల్ వారియర్స్, పాలమూరు స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. టాస్ గెలిచిన పాలమూరు స్ట్రైకర్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్కు దిగిన వరంగల్ వారియర్స్ 2.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది. హర్షిత్ చౌదరీ (8), రిషికేత్ సిసోడియా (1) పరుగులతో ఆడుతున్నారు.
ఈ దశలో వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ను నిలిపివేశారు. ఆ తర్వాత వర్షం ఎంతకీ తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్ రద్దుకే అంపైర్లు మొగ్గు చూపారు. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ సిరీస్ లో ఇప్పటివరకు పాలమూరు స్ట్రైకర్స్, వరంగల్ వారియర్స్ ఆరు చొప్పున మ్యాచ్లు ఆడగా.. ఒక్కో మ్యాచ్లో విజయం సాధించాయి.