Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

సౌతాఫ్రికాపై ప్రతీకారం తీర్చుకున్న ఇంగ్లండ్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Oct 8, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
saeng.jpg

గత టీ20 ప్రపంచ కప్‌ సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన అనూహ్య పరాజయానికి ఇంగ్లండ్‌ మహిళల జట్టు బదులు తీర్చుకుంది. చివరి ఓవర్‌ వరకు ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో సఫారీ జట్టును ఓడించి ఈ టోర్నీలో ఇంగ్లండ్‌ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది.

ఫలితంగా గ్రూప్‌ ‘బి’లో తమ అగ్రస్థానాన్ని ఇంగ్లండ్‌ పటిష్టపర్చుకుంది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. కెప్టెన్‌ లారా వోల్‌వార్ట్‌ (39 బంతుల్లో 42; 3 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సోఫీ ఎకెల్‌స్టోన్‌ (2/15)తో పాటు ఇతర బౌలర్లు ప్రత్యర్థిని నిలువరించారు. అనంతరం ఇంగ్లండ్‌ 19.2 ఓవర్లలో 3 వికెట్లకు 125 పరుగులు సాధించి గెలిచింది. నాట్‌ సివర్‌ బ్రంట్‌ (36 బంతుల్లో 48 నాటౌట్‌; 6 ఫోర్లు), డానీ వ్యాట్‌ (43 బంతుల్లో 43; 4 ఫోర్లు) మూడో వికెట్‌కు 55 బంతుల్లో 64 పరుగులు జోడించి జట్టును గెలిపించారు.  

రాణించిన కెప్టెన్‌
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ వోల్‌వార్ట్‌ మినహా మిగతా వారెవ్వరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చలేదు. తొలి వికెట్‌కు వోల్‌వార్ట్, తజ్‌మీన్‌ బ్రిట్స్‌ (19 బంతుల్లో 13; 1 ఫోర్‌)తో కలిసి 31 బంతుల్లో 31 పరుగులు జోడించడంతో జట్టుకు మెరుగైన ఆరంభం లభించింది. ఆ తర్వాత అనేక్‌ బాష్‌ (26 బంతుల్లో 18; 1 ఫోర్‌) కూడా కొద్దిసేపు కెప్టెన్‌కు అండగా నిలిచింది. 10 ఓవర్లు ముగిసేసరికి సఫారీ టీమ్‌ స్కోరు 54 పరుగులకు చేరింది. ఈ దశలో ఇంగ్లండ్‌ స్పిన్నర్లు ప్రత్యరి్థని కట్టడి చేయడంలో సఫలమయ్యారు. అనంతరం వేగంగా ఆడే ప్రయత్నంలో ఉన్న

వోల్‌వార్ట్‌ను ఎకెల్‌స్టోన్‌(Sophie Ecclestone) చక్కటి బంతితో బౌల్డ్‌ చేయడంతో ఇంగ్లండ్‌ పైచేయి సాధించింది. కెప్టెన్‌ వెనుదిరిగిన తర్వాత మిగిలిన 26 బంతుల్లో దక్షిణాఫ్రికా 36 పరుగులు చేసింది. మరిజాన్‌ కాప్‌ (17 బంతుల్లో 26; 3 ఫోర్లు), ఇన్నింగ్స్‌ చివర్లో డెర్క్‌సెన్‌ (11 బంతుల్లో 20 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ప్రదర్శన దక్షిణాఫ్రికాకు గౌరవప్రదమైన స్కోరును అందించాయి.

కీలక భాగస్వామ్యం... 
షార్జా మైదానంలో గత నాలుగు మ్యాచ్‌లతో పోలిస్తే మెరుగైన స్కోరును దక్షిణాఫ్రికా నమోదు చేయగా... దానిని ఛేదించే లక్ష్యంతో ఇంగ్లండ్‌ బరిలోకి దిగింది. ఆరంభంలోనే మయా బౌచర్‌ (20 బంతుల్లో 8; 1 ఫోర్‌) వెనుదిరిగినా... వ్యాట్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. అలైస్‌ క్యాప్సీ (16 బంతుల్లో 19; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించినా ఎక్కువ సేపు నిలవలేదు. ఈ దశలో వ్యాట్, బ్రంట్‌ భాగ స్వామ్యం జట్టును గెలుపు దిశగా నడిపించింది.

ఈ ఇద్దరు సీనియర్ల జోడీని విడదీసేందుకు సఫారీ బౌలర్లు ఎంత శ్రమించినా లాభం లేకపోయింది. 11–15 ఓవర్ల మధ్యలో 39 పరుగులు చేసిన ఇంగ్లండ్‌ చివరి 5 ఓవర్లలో 31 పరుగులు చేయాల్సిన స్థితిలో నిలిచింది. అయితే చివర్లో కొంత ఒత్తిడి ఎదురైనా ఇంగ్లండ్‌ గెలుపు గీత దాటింది. 

విజయానికి 11 పరుగుల దూరంలో వ్యాట్‌ వెనుదిరగ్గా... బ్రంట్‌ మిగిలిన పనిని పూర్తి చేసింది. సఫారీ ఫీల్డర్లు మూడు క్యాచ్‌లు వదిలేయడం కూడా ఇంగ్లండ్‌కు కలిసొచ్చింది. మంగళవారం జరిగే గ్రూప్‌ ‘ఎ’ లీగ్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టుతో న్యూజిలాండ్‌ తలపడుతుంది.   

ఇంగ్లండ్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా స్కోర్లు
వేదిక- షార్జా
టాస్‌- సౌతాఫ్రికా.. బ్యాటింగ్‌
సౌతాఫ్రికా స్కోరు: 124/6 (20)
ఇంగ్లండ్‌ స్కోరు: 125/3 (19.2)
ఫలితం: సౌతాఫ్రికాపై ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ విజయం.

చదవండి: IPL 2025: ఐపీఎల్‌లో విలువ పెరిగింది

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Womens T20 World Cup 2024
England Vs South Africa
T20 match
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

టి20 ప్రపంచకప్‌లో తుది పోరుకు భారత్‌. సెమీస్‌లో 7 పరుగులతో ఇంగ్లండ్‌పై గెలుపు

టి20 ప్రపంచకప్‌లో తుది పోరుకు భారత్‌. సెమీస్‌లో 7 పరుగులతో ఇంగ్లండ్‌పై గెలుపు

పైచేయి కోసం...

పైచేయి కోసం...

#WPL2026 : ఫైనల్లో ఆర్సీబీ విజయం..రూ. 6 కోట్లు ప్రైజ్‌మనీ (ఫొటోలు)

#WPL2026 : ఫైనల్లో ఆర్సీబీ విజయం..రూ. 6 కోట్లు ప్రైజ్‌మనీ (ఫొటోలు)

ఇండియా Vs న్యూజిలాండ్ T20 లాస్ట్ ఫైట్!

ఇండియా Vs న్యూజిలాండ్ T20 లాస్ట్ ఫైట్!

IND Vs NZ: నాలుగోది చేజారె...

IND Vs NZ: నాలుగోది చేజారె...

ఉతికారేసిన భారత్.. 15.2 ఓవర్లలోనే 208 ఛేజ్

ఉతికారేసిన భారత్.. 15.2 ఓవర్లలోనే 208 ఛేజ్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.