Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT

IPL 2025, MI VS RCB: భారీ రికార్డుపై కన్నేసిన కోహ్లి

Sports Sakshi User Sakshi Sakshi Time Apr 7, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
hjklash.jpg

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో ఇవాళ (ఏప్రిల్‌ 7) మరో ఆసక్తికర మ్యాచ్‌ జరుగనుంది. ఫైవ్‌ టైమ్‌ ఛాంపియన్స్‌ ముంబై ఇండియన్స్‌ తమ సొంత మైదానంలో (వాంఖడే స్టేడియంలో) ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో ఆర్సీబీ ఎన్నడూ లేనంత పటిష్టంగా కనిపిస్తుండగా.. వరుస పరాజయాలతో ముంబై ఇండియన్స్‌ కాస్త ఢీలాగా కనిపిస్తుంది. 

అయితే నేటి మ్యాచ్‌లో ముంబైకి కూడా జోష్‌ రావచ్చు. ఈ మ్యాచ్‌తో వారి తరుపుముక్క జస్ప్రీత్‌ బుమ్రా బరిలోకి దిగనున్నాడు. గాయం కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న బుమ్రా ఆ​ర్సీబీ మ్యాచ్‌తోనే పునరాగమనం చేయనున్నాడు. నేటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ మరో శుభవార్త కూడా ఉంది. 

గాయం కారణంగా గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న రోహిత్‌ శర్మ కూడా నేటి మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. బుమ్రా, రోహిత్‌ చేరికతో ముంబై ఇండియన్స్‌లో కొత్త జోష్‌ వచ్చింది. ముంబై ఇండియన్స్‌ ఈ సీజన్‌లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడి మూడింట ఓడింది. ఆర్సీబీ విషయానికొస్తే.. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచి, కేవలం ఒకే మ్యాచ్‌లో ఓడింది.

ముంబైదే పైచేయి
హెడ్‌ టు హెడ్‌ రికార్డులను పరిశీలిస్తే.. ఆర్సీబీపై ముంబైదే పైచేయిగా ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 33 మ్యాచ్‌ల్లో తలపడగా.. ముంబై 19, ఆర్సీబీ 14 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.

భారీ రికార్డుపై కన్నేసిన కోహ్లి
ముంబైతో ఇవాళ జరుగబోయే మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. నేటి మ్యాచ్‌లో విరాట్‌ మరో 17 పరుగులు చేస్తే టీ20ల్లో 13000 పరుగుల మైలురాయిని తాకుతాడు. ప్రస్తుతం విరాట్‌ ఖాతాలో 12983 పరుగులు (385 ఇన్నింగ్స్‌ల్లో 41.47 సగటున) ఉన్నాయి. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్‌ ఐదో స్థానంలో ఉన్నాడు. 

విరాట్‌ టీ20ల్లో 13000 పరుగులు పూర్తి చేస్తే ఈ ఘనత సాధించిన ఐదో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. టీ20ల్లో క్రిస్‌ గేల్‌ (455 ఇన్నింగ్స్‌ల్లో 14562 పరుగులు), అలెక్స్‌ హేల్స్‌ (490 ఇన్నింగ్స్‌ల్లో 13610), షోయబ్‌ మాలిక్‌ (514 ఇన్నింగ్స్‌ల్లో 13557), కీరన్‌ పోలార్డ్‌ (617 ఇన్నింగ్స్‌ల్లో 13537) మాత్రమే విరాట్‌ కంటే అత్యధిక పరుగులు చేశారు.

ప్రస్తుత సీజన్‌లో విరాట్‌ ఓ మోస్తరు ఫామ్‌లో ఉన్నాడు. కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ (59 నాటౌట్‌) చేసిన అతను.. సీఎస్‌కేపై (31) పర్వాలేదనిపించి, గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో (7) విఫలమయ్యాడు. కేకేఆర్‌ మ్యాచ్‌లో విరాట్‌ ఆర్సీబీ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. విరాట్‌ ప్రస్తుతం ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. విరాట్‌ ఐపీఎల్‌లో 247 ఇన్నింగ్స్‌లు ఆడి 8101 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 56 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

తుది జట్లు (అంచనా)..
ముంబై ఇండియన్స్‌: రోహిత్ శర్మ, విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), నమన్ ధీర్, రాజ్ బవా, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, విఘ్నేష్ పుత్తూర్

ఆర్సీబీ: ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్‌), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్‌కీపర్‌), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్, సుయాష్ శర్మ

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
IPL 2025
Virat Kohli
RCB
MI vs RCB
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇంగ్లండ్‌కు నో చెప్పిన ఆర్సీబీ హెడ్‌ కోచ్‌

ఇంగ్లండ్‌కు నో చెప్పిన ఆర్సీబీ హెడ్‌ కోచ్‌

కోహ్లి బాటలో సంజూ శాంసన్‌..!

కోహ్లి బాటలో సంజూ శాంసన్‌..!

భార‌త జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. సెంచ‌రీ హీరోకు నో ఛాన్స్‌

భార‌త జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. సెంచ‌రీ హీరోకు నో ఛాన్స్‌

ఇంగ్లండ్‌ సిరీస్‌కు పాండ్యా దూరం.. కోహ్లీ ఆడడంపై ఆరోజే క్లారిటీ!

ఇంగ్లండ్‌ సిరీస్‌కు పాండ్యా దూరం.. కోహ్లీ ఆడడంపై ఆరోజే క్లారిటీ!

 రోహిత్‌, కోహ్లీ భ‌విత‌వ్యంపై బీసీసీఐ స్పందన!

రోహిత్‌, కోహ్లీ భ‌విత‌వ్యంపై బీసీసీఐ స్పందన!

IND vs AFG: యశస్వి జైస్వాల్‌ ఫెయిల్‌

IND vs AFG: యశస్వి జైస్వాల్‌ ఫెయిల్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.