Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

‘పద్మభూషణ్‌’ విజయ్‌ అమృత్‌రాజ్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Jan 26, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
padmabhushan.jpg

భారత టెన్నిస్‌ దిగ్గజానికి దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం

క్రికెటర్లు రోహిత్‌ శర్మ, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌లకు ‘పద్మశ్రీ’  

న్యూఢిల్లీ: తన ఆటతీరుతో అంతర్జాతీయస్థాయిలో భారత టెన్నిస్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన విజయ్‌ అమృత్‌రాజ్‌ను కేంద్ర ప్రభుత్వం సముచితరీతిలో గౌరవించింది. 2026 సంవత్సరానికి ప్రకటించిన కేంద్ర పౌర పురస్కారాల్లో విజయ్‌ అమృత్‌రాజ్‌కు మూడో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మ భూషణ్‌’ లభించింది. ఈసారి క్రీడా విభాగంలో మొత్తం తొమ్మిది మంది ‘పద్మ’ అవార్డులకు ఎంపికయ్యారు. 

క్రికెటర్లు రోహిత్‌ శర్మ (మహారాష్ట్ర), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ భుల్లర్‌ (పంజాబ్‌)... పారాథ్లెట్‌ ప్రవీణ్‌ కుమార్‌ (ఉత్తరప్రదేశ్‌), భారత మహిళల హాకీ జట్టు గోల్‌కీపర్‌ సవితా పూనియా (హరియాణా), హాకీ కోచ్‌ బల్‌దేవ్‌ సింగ్‌ (పంజాబ్‌), యుద్ధకళల్లో వెటరన్‌ కోచ్‌లు భగవాన్‌దాస్‌ రైక్వార్‌ (మధ్యప్రదేశ్‌), పజానివెల్‌ (పుదుచ్చేరి), జార్జియాకు చెందిన రెజ్లింగ్‌ కోచ్, దివంగత వ్లాదిమిర్‌ మెస్త్‌విరిష్విలిలకు ‘పద్మశ్రీ’ అవార్డులు లభించాయి. 

ఒలింపిక్స్‌లో కాంస్య పతకాలు గెలిచిన భారత రెజ్లర్లు యోగేశ్వర్‌ దత్, బజరంగ్‌ పూనియాలకు వ్లాదిమిర్‌ శిక్షణ ఇచ్చారు. 35 ఏళ్ల సవితా పూనియా భారత హాకీ జట్టుకు 308 మ్యాచ్‌ల్లో గోల్‌కీపర్‌గా వ్యవహరించింది. టోక్యో, రియో ఒలింపిక్స్‌లో పోటీపడింది. మూడుసార్లు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) ఉత్తమ గోల్‌కీపర్‌గా ఎంపికైంది. 

పారాథ్లెటిక్స్‌లో హైజంప్‌ ఈవెంట్‌లో ఆడే 22 ఏళ్ల ప్రవీణ్‌ రెండు ఒలింపిక్‌ పతకాలు సాధించాడు. టి64 కేటగిరీలో పోటీపడే ప్రవీణ్‌ 2024 పారిస్‌ పారాలింపిక్స్‌లో స్వర్ణ పతకం, 2020 టోక్యో పారాలింపిక్స్‌లో రజత పతకం సాధించాడు. గత ఏడాది ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెల్చుకున్నాడు. 2022 ఆసియా పారా క్రీడల్లో బంగారు పతకం సొంతం చేసుకున్నాడు.  

తమిళనాడుకు చెందిన 72 ఏళ్ల విజయ్‌ అమృత్‌రాజ్‌ అమెరికాలోని కాలిఫోరి్నయాలో స్థిరపడ్డారు. 1970 నుంచి 1993 వరకు ఆయన ప్రొఫెషనల్‌ కెరీర్‌ సాగింది. విజయ్‌ 15 సింగిల్స్‌ టైటిల్స్, 13 డబుల్స్‌ టైటిల్స్‌ సాధించారు. ఓవరాల్‌గా 405 మ్యాచ్‌ల్లో గెలిచారు. 312 మ్యాచ్‌ల్లో ఓడిపోయారు. 1980లో కెరీర్‌ బెస్ట్‌ 18వ ర్యాంక్‌ను అందుకున్నారు. 13,30,503 డాలర్లు ప్రైజ్‌మనీ సంపాదించారు. టెన్నిస్‌లోని నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో ఆయన బరిలోకి దిగారు. 

32 సార్లు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో ఆడిన విజయ్‌ వింబుల్డన్‌లో రెండుసార్లు (1973, 1981), యూఎస్‌ ఓపెన్‌లో రెండుసార్లు (1973, 1974) క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. 2024లో అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో చోటు సంపాదించిన విజయ్‌... ప్రపంచ పురుషుల టీమ్‌ టెన్నిస్‌ టోర్నీ డేవిస్‌కప్‌లోనూ ఆకట్టుకున్నారు. డేవిస్‌కప్‌లో రెండుసార్లు (1974, 1987) భారత జట్టు రన్నరప్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించారు. 1983లో ‘పద్మశ్రీ’ పొందిన విజయ్‌కు 1974లో ‘అర్జున అవార్డు’ కూడా లభించింది. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర టెన్నిస్‌ సంఘం అధ్యక్షుడిగా ఉన్న విజయ్‌ హాలీవుడ్‌ సినిమాల్లోనూ నటించారు. 

తన నాయకత్వ పటిమతో రోహిత్‌ శర్మ భారత క్రికెట్‌ జట్టుకు ఎన్నో గొప్ప విజయాలు అందించాడు. రోహిత్‌ కెప్టెన్సీలోనే టీమిండియా 2024లో టి20 ప్రపంచకప్‌ టైటిల్‌... 2025లో చాంపియన్స్‌ ట్రోఫీ టైటిల్‌ సాధించింది. ఐపీఎల్‌లో రోహిత్‌ సారథ్యంలో ముంబై ఇండియన్స్‌ జట్టు ఐదుసార్లు విజేతగా నిలిచింది. 2024లో అంతర్జాతీయ టి20ల నుంచి, 2025లో టెస్టు క్రికెట్‌ నుంచి రిటైరైన రోహిత్‌ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. 38 ఏళ్ల రోహిత్‌ భారత్‌ తరఫున 67 టెస్టులు ఆడి 4301 పరుగులు... 282 వన్డేలు ఆడి 11,577 పరుగులు... 159 టి20లు ఆడి 4231 పరుగులు సాధించాడు.

గత 17 ఏళ్లుగా భారత మహిళల క్రికెట్‌ జట్టులో సభ్యురాలిగా ఉన్న హర్మన్‌ప్రీత్‌ కెప్టెన్సీలో గత ఏడాది టీమిండియా వన్డే వరల్డ్‌కప్‌ టైటిల్‌ గెలిచింది. స్వదేశంలో జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికా జట్టును ఓడించిన భారత్‌ తొలిసారి ఈ ఘనత సాధించింది. 36 ఏళ్ల హర్మన్‌ ఇప్పటి వరకు 6 టెస్టులు ఆడి 200 పరుగులు... 161 వన్డేలు ఆడి 4409 పరుగులు, 187 టి20లు ఆడి 3784 పరుగులు చేసింది. మూడు ఫార్మాట్‌లలో కలిపి 8 సెంచరీలు, 38 అర్ధ సెంచరీలు సాధించిన హర్మన్‌ 75 వికెట్లు కూడా పడగొట్టింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Padma shri award
Padma Bhushan
rohit sharma
Harmanpreet Kaur
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

హర్మన్‌ సేనకు మిథాలీరాజ్‌ కీలక సూచన

హర్మన్‌ సేనకు మిథాలీరాజ్‌ కీలక సూచన

సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. భారత్‌ సెమీస్‌ చేరాలంటే!

సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. భారత్‌ సెమీస్‌ చేరాలంటే!

చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

రాణించిన భారత బ్యాటర్లు.. సౌతాఫ్రికా టార్గెట్‌ ఎంతంటే?

రాణించిన భారత బ్యాటర్లు.. సౌతాఫ్రికా టార్గెట్‌ ఎంతంటే?

రోహిత్‌ సరికొత్త రికార్డు.. భారత వన్డే క్రికెట్‌ హిస్టరీలోనే

రోహిత్‌ సరికొత్త రికార్డు.. భారత వన్డే క్రికెట్‌ హిస్టరీలోనే

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.