Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

బాధితుడా? కృతజ్ఞత లేనివాడా?.. ఆ స్పీచ్‌ నిజంగానే అవసరమా?

Sports Sakshi User Sakshi Sakshi Time Jan 7, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
usman2.jpg

ఆటపై ప్రేమ.. అంకితభావం.. నిబద్ధతతో కష్టపడి పైకి వచ్చి.. అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని.. సుదీర్ఘకాలం కెరీర్‌లో కొనసాగిన ఏ ఆటగాడైనా రిటైర్మెంట్‌ ప్రకటించే క్షణం తీవ్రమైన భావోద్వేగానికి లోనుకావడం సహజం. అలాంటి తరుణంలో తనకు వెన్నుదన్నుగా నిలిచిన ప్రతి ఒక్కరికి సదరు ప్లేయర్‌ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకొంటాడు.

తాను అధిగమించిన సవాళ్లు, ఆ సమయంలో తనకు అండగా నిలిచిన వారిని గుర్తుచేసుకోవడమూ పరిపాటి. ఆస్ట్రేలియా టెస్టు స్టార్‌ ఉస్మాన్‌ ఖవాజా కూడా తన రిటైర్మెంట్‌ ప్రకటన సందర్భంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రాణంగాప్రేమించిన ఆటకు భారమైన మనసుతో వీడ్కోలు పలికాడు. అయితే, ఆ సమయంలో తాను ఓ బాధితుడినని చెప్పుకొనేందుకే అతడు ప్రాధాన్యం ఇచ్చాడు.

‘‘కెరీర్‌ ఆరంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. పాకిస్తాన్‌లో పుట్టడం, ముస్లిం కావడం వల్ల కఠిన పరిస్థితులు దాటాల్సి వచ్చింది. వాటి గురించి ఇప్పుడు చెప్పాలని లేదు.. కానీ.. నేను సాధించగలిగినప్పుడు ఎవరైనా తమ కలలను సాకారం చేసుకోవచ్చని చెబుతున్నా.

మరో ఉస్మాన్‌ ఖవాజాకు మళ్లీ ఇలాంటి ఇబ్బందులు ఎదురు కాకూడదనే నా తాపత్రయం. మనుషులంతా ఒక్కటే అనేది నా అభిమతం. పుట్టిన ప్రాంతంతోనే, లేక మతంతోనో ఎవరినీ తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు. ప్రపంచం అనేది ఆశల పొదరిల్లు. దాన్ని అందిపుచ్చుకునే అవకాశం ప్రతి ఒక్కరికీ ఉండాలి. ఆస్ట్రేలియా జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడం చాలా కష్టం. కష్టపడకుండా ఆ చాన్స్‌ ఎవరికీ రాదు.

పదిహేనేళ్ల క్రితంతో పోల్చుకుంటే ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నం. అయినా సమస్య మొత్తం తొలగిపోయిందని చెప్పలేను. నేను నల్లజాతీయుడిని కాబట్టి ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిధ్యం వహించలేనని విమర్శించేవారు. కానీ నేను అది సాధించాను. ఆటపై నా అంకితభావం, నిబద్ధతను శంకించడం... నా సన్నద్ధతను ప్రశ్నించడంతో చాలా ఇబ్బందిగా అనిపించేది.

అలాంటి సమయంలో కనీస తోడ్పాటు దక్కేది కాదు. జట్టులో ఇతర ఆటగాళ్లు గాయపడితే... కనిపించే సానుభూతి నా విషయానికి వచ్చేసరికి పూర్తి భిన్నంగా ఉండేది. ముస్లింలందరూ మ్యాచ్‌లు ఫిక్స్‌ చేస్తారు అనుకోవడం తప్పు. ముందు అలాంటి ఆలోచన ధోరణి నుంచి బయట పడాలి. 2023లో పాలస్తీనాపై స్పందించింది కూడా అందుకే.

స్వేచ్ఛ అనేది మానవులందరి హక్కు అని చెప్పాలనుకున్నా. అయితే క్రికెటేతర  అంశాలను ప్రస్తావించడం చాలా మందికి నచ్చలేదు. అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేశా. యువతరానికి స్ఫూర్తిగా నిలిచానని అనుకుంటున్నా. ముఖ్యంగా మాకు అవకాశాలు దక్కవు అని నిరాశలో ఉండేవారికి నాకన్నా మంచి ఉదాహరణ ఇంకేముంటుంది’’ అని ఉస్మాన్‌ ఖవాజా తన రిటైర్మెంట్‌ ప్రసంగంలో పేర్కొన్నాడు.

మద్దతుగా నిలవలేదా?
అయితే, ఆట గురించి కాకుండా తాను క్రికెటేతర అంశాల గురించి మాట్లాడుతూ రాజకీయాలకు తావిచ్చినా.. ఆసీస్‌ ఆటగాళ్లు అతడికి మద్దతుగానే నిలిచారు. ఐసీసీ మొట్టికాయలు వేసినపుడు క్రికెట్‌ ఆస్ట్రేలియా అతడికి అండగానే ఉంది. డ్రెసింగ్‌రూమ్‌లోనూ అతడి పట్ల ఎవరూ వివక్షపూరితంగా వ్యవహరించిన దాఖలాలు లేవనే చెప్పాలి.


కమిన్స్‌ గొప్పగానే స్పందించాడే
ముఖ్యంగా షాంపైన్‌ సెలబ్రేషన్స్‌కు ఖవాజా దూరంగా ఉంటాడని తెలిసి.. కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ ఒకానొక సందర్భంలో ఎంతో పరిణతి కనబరిచాడు. యాషెస్‌ సిరీస్‌ను ఆసీస్‌ 2022లో సొంతం చేసుకున్న తర్వాత.. జట్టంతా ట్రోఫీతో సంబరాలు చేసుకుంటున్న వేళ.. ఖవాజా అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయాడు.

ఈ విషయాన్ని గమనించిన కమిన్స్‌.. సహచర ఆటగాళ్లకు షాంపైన్‌ సెలబ్రేషన్‌ ఆపమని చెప్పాడు. దీంతో వారంతా మిన్నకుండిపోగా.. కమిన్స్‌ ఖవాజాను కూడా వేదికపైకి పిలిచి ట్రోఫీని పట్టుకోమని చెప్పాడు. అప్పట్లో కమిన్స్‌ వ్యవహరించిన తీరు అభిమానుల హృదయాలను దోచుకుంది.

జన్మభూమి పట్ల ప్రేమ ఉండాలి.. కానీ
కమిన్స్‌ మనస్ఫూర్తిగా చేసిన పని గురించి ఖవాజాకు తన స్పీచ్‌ సమయంలో గుర్తుకురాకపోవడం గమనార్హం. తన ‍ప్రసంగం ఆసాంతం తానో బాధితుడినని చెప్పుకొన్న ఖవాజా పదేపదే తను పాకిస్తానీ ముస్లింనంటూ గుర్తుచేసుకున్నాడు. జన్మభూమి పట్ల ప్రేమ ఉండటాన్ని ఎవరూ తప్పుపట్టరు.

అయితే, బతుకుదెరువు కోసం వచ్చిన చోట అనేక అవాంతరాలు దాటి ఆ దేశ జాతీయ జట్టుకు పదిహేనేళ్లుగా ప్రాతినిథ్యం వహించిన తీరును అతడు పెద్దగా గుర్తుచేసుకోకపోవడం విమర్శలకు తావిచ్చింది. క్రికెట్‌ ఆస్ట్రేలియా ఖవాజాకు ‘క్యాప్‌’ ఇవ్వడమే కాదు.. తన ప్రతిభను నిరూపించుకునేందుక చక్కటి వేదిక అందించింది.

సొంత దేశంలో ఉన్నా
అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటేలా ప్రోత్సహించింది. ఆటకు సంబంధం లేని రాజకీయాలు మాట్లాడుతున్నా.. భావ ప్రకటనా స్వేచ్ఛకు విలువనిచ్చింది. ఒకవేళ తన సొంత దేశంలో ఉన్నా ఖవాజాకు ఇంత ఫ్రీడమ్‌ దొరికేది కాదేమో!

అయినా సరే.. అతడు పదే పదే నల్లజాతీయుడినని, పాక్‌కు చెందినవాడినని చెప్పినా.. క్రికెట్‌ ఆస్ట్రేలియా తప్పుపట్టలేదు. కేవలం అతడిలోని ప్రతిభకు పెద్ద పీట వేసి ఓపెనర్‌గా ఎన్నో అవకాశాలు ఇచ్చింది. 

బాధితుడా? కృతజ్నుడా?.. 
ప్రతి ఆటగాడి కెరీర్‌లో మాదిరే ఫామ్‌లో లేనపుడు ఖవాజా కూడా జట్టులో తన స్థానాన్ని కోల్పోయాడు. అంతేతప్ప అతడిని కావాలని పక్కనపెట్టినట్లుగా ఎక్కడా అనిపించలేదు. చివరగా.. తన రిటైర్మెంట్‌ స్పీచ్‌లో ఉస్మాన్‌ ఖవాజా బాధితుడినని చెప్పుకోవడంలో సఫలీకృతమయ్యాడా? లేదంటే కృతజ్నుడిగా మిగిలిపోయాడా?

ఈ మేరకు సోషల్‌ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల బాండీ బీచ్‌లో అమాయక యూదులపై జరిగిన మారణహోమం గురించి  మాత్రం ఖవాజా కనీసం స్పందించకపోవడాన్ని కూడా కొంత మంది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. 

ఏదేమైనా టెస్టు క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన ఉస్మాన్‌ ఖవాజా.. యాషెస్‌ సిరీస్‌తో ఏ చోట మొదలుపెట్టాడో... అదే చోట కెరీర్‌ ముగిస్తున్నాడు. సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌తో తన 88వ, ఫేర్‌వెల్‌ టెస్టు ఆడుతున్న ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. తొలి ఇన్నింగ్స్‌లో ఐదో స్థానంలో వచ్చి 17 పరుగులే చేసి నిష్క్రమించాడు. 

Australia captain Pat Cummins tells players to put away champagne bottles so that Usman Khawaja could celebrate with them.

1.5 years later, Khawaja takes retirement & call his teammates, fans & australians racist as they are of no use to him anymore🤡pic.twitter.com/06gLhaQqiZ

— Rajiv (@Rajiv1841) January 4, 2026

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Usman Khawaja
Cricket Australia
Test retirement
Pat Cummins
Off the field
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

AUS vs BAN: ఆసీస్‌ గడ్డపై ‘మనోడి’ చరిత్ర

AUS vs BAN: ఆసీస్‌ గడ్డపై ‘మనోడి’ చరిత్ర

'మా టికెట్లు ఇచ్చేయండి'.. అభిమానులకు ఫిఫా అభ్యర్థన!

'మా టికెట్లు ఇచ్చేయండి'.. అభిమానులకు ఫిఫా అభ్యర్థన!

గెంటేస్తారన్న భ‌యం.. క‌ట్‌చేస్తే చ‌రిత్ర‌కు అడుగు దూరంలో!

గెంటేస్తారన్న భ‌యం.. క‌ట్‌చేస్తే చ‌రిత్ర‌కు అడుగు దూరంలో!

IPL 2026: ‘మా కారు ట్రక్కు కిందకి దూసుకెళ్లింది’

IPL 2026: ‘మా కారు ట్రక్కు కిందకి దూసుకెళ్లింది’

ఫిఫాకు ట్రోఫీ తిరిగివ్వని బ్రెజిల్‌.. విలువెంతో తెలుసా?

ఫిఫాకు ట్రోఫీ తిరిగివ్వని బ్రెజిల్‌.. విలువెంతో తెలుసా?

‘ఇండియాలో లైఫ్‌ కోహ్లికి అస్సలు ఇష్టం లేదు’

‘ఇండియాలో లైఫ్‌ కోహ్లికి అస్సలు ఇష్టం లేదు’

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.