Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT

ఫిఫా షాక్‌.. బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిన ఒమర్‌ ఆర్టాన్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Jun 15, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Beckons-Omar-Artan.jpg

ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫిఫా వరల్డ్‌కప్‌లో మ్యాచ్‌లను నిర్వహించాల్సిన ఓ రిఫరీకి ఊహించని అవమానం ఎదురైంది. సోమాలియాకు చెందిన ప్రముఖ రిఫరీ ఒమర్ అబ్దుల్‌కదీర్ ఆర్టాన్‌కు అమెరికాలోకి ప్రవేశం నిరాకరించారు. అందుకు సరైన కారణాలేవీ చూపించకపోవడమూ తీవ్ర దుమారం రేపింది. దీంతో.. ఆయన ప్రపంచకప్‌ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే.. ఈ పరిస్థితుల్లోనూ ఆయనోక బంపర్‌ ఆఫర్‌ తగిలింది.. 

సోమాలియా రిఫరీ ఓమర్ ఆర్టాన్‌కు అమెరికాలో ఊహించని షాక్‌ ఎదురైంది. మియామీ ఎయిర్‌పోర్ట్‌ చేరుకున్న ఆయన్ని.. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు ఆయన్ని ఆపేసి విచారణ పేరుతో 11 గంటలపాటు ప్రశ్నించారు. ఈ విచారణలో ఆయన ప్రయాణ ఉద్దేశ్యం, ప్రపంచకప్‌లో తన అధికారిక బాధ్యతలు, అలాగే సోమాలియాలోని రాజకీయ పరిస్థితులు, భద్రతా నేపథ్యం వంటి అంశాలపై అధికారులు ప్రశ్నలు వేసినట్లు సమాచారం. అంతేకాకుండా సోమాలియాలో క్రియాశీలంగా ఉన్న అల్-షబాబ్ ఉగ్రవాద సంస్థకు సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. 

విచారణ అనంతరం అధికారులు ఆయనను ‘అమెరికాలో ప్రవేశానికి అనర్హుడు’ (inadmissible)గా ప్రకటించి.. తిరిగి పంపించారు. జూన్‌ 6వ తేదీన ఈ ఘటన జరిగింది. సాధారణంగా ఇలాంటి నిర్ణయాలు పాస్‌పోర్ట్ వెరిఫికేషన్, భద్రతా డేటా మ్యాచ్ లేదంటే వెట్టింగ్ ప్రాసెస్‌లో వచ్చిన సందేహాల ఆధారంగా తీసుకుంటారు. అయితే ఆర్టాన్ విషయంలో ఖచ్చితమైన కారణాన్ని అధికారులు బహిర్గతం చేయకపోవడంతో వివాదం మొదలైంది. 

ఈ క్రమంలో తమ వైపు నుంచి వివరణ ఇస్తూ అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్.. ఇది సాధారణ భద్రతా తనిఖీల్లో భాగమేనని, అవసరమైన వెట్టింగ్ ప్రక్రియ కారణంగానే ప్రవేశం నిరాకరించాల్సి వచ్చిందని పేర్కొంది. అంతర్జాతీయ ఈవెంట్ అధికారుల విషయంలో కూడా భద్రతా ప్రోటోకాల్‌లు కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేసింది.

ఈ ఘటనపై అంతర్జాతీయ ఫుట్‌బాల్ వర్గాల్లో విమర్శలు కూడా వచ్చాయి. ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నమెంట్‌కు అధికారికంగా ఎంపికైన రిఫరీకి ఇలా ప్రవేశం నిరాకరించడం సరైన చర్య కాదని పలువురు అభిప్రాయపడ్డారు.

అయితే.. వరల్డ్‌కప్‌లో అంపైరింగ్ చేసే అవకాశం కోల్పోయినా, ఒమర్ ఆర్టాన్ కెరీర్ అక్కడితో ఆగిపోలేదు. అమెరికాలో ప్రవేశం నిరాకరించబడటంతో ఆయనకు ప్రపంచకప్ మ్యాచ్‌లను ఆఫిషియేట్ చేసే అవకాశం దక్కలేదంతే. కానీ ఆయన అనుభవం, ప్రతిభను గుర్తించిన యూరప్ ఫుట్‌బాల్ సంస్థ యూఈఎఫ్‌ఏ ఆయనకు కీలక బాధ్యతను అప్పగించింది. దీని ప్రకారం ఆర్టాన్‌కు యూఈఎఫ్‌ఏ సూపర్ కప్ మ్యాచ్‌లో రిఫరీగా పనిచేసే అవకాశం లభించింది. ఈ మ్యాచ్ సాధారణంగా యూరప్‌లోని రెండు ప్రధాన క్లబ్ టోర్నమెంట్ల విజేతల మధ్య జరుగుతుంది. ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ క్లబ్ మ్యాచ్‌లలో ఒకటిగా పరిగణిస్తారు.

34 ఏళ్ల ఆర్టాన్ ఆఫ్రికా ఖండంలో అత్యుత్తమ రిఫరీలలో ఒకరిగా గుర్తింపు పొందారు. 2025లో ఆఫ్రికా ఫుట్‌బాల్ సమాఖ్య(CAF కాఫ్‌) రిఫరీ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా గెలుచుకున్నారు. అంతకుముందు ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్,  కాఫ్‌ చాంపియన్స్ లీగ్ ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లకు ఆయన రిఫరీగా వ్యవహరించారు.

ఫిఫా షాక్‌తో స్వదేశానికి తిరిగి వచ్చిన ఆర్టాన్‌కు సోమాలియాలో ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయంలో వందలాది అభిమానులు, అధికారులతో కలిసి ఆయనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టాన్ మాట్లాడుతూ వచ్చే వరల్డ్‌కప్‌లో తప్పకుండా పాల్గొంటానని ఆశాభావం వ్యక్తం చేశారు. “దేవుని ఆశీస్సులతో తదుపరి టోర్నమెంట్‌లో ఉంటాను” అని ఆయన పేర్కొన్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
FIFA World Cup
FIFA World Cup 2026
referee
USA
ban
Sports News
Somalia
miami
Entry Ban
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

FIFA World Cup 2026 : ఫిఫా 2026 విశ్వవిజేత స్పెయిన్‌ (ఫొటోలు)

FIFA World Cup 2026 : ఫిఫా 2026 విశ్వవిజేత స్పెయిన్‌ (ఫొటోలు)

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

మెస్సి మ్యాజిక్.. వరుస విజయలతో అర్జెంటీనా జోరు..

మెస్సి మ్యాజిక్.. వరుస విజయలతో అర్జెంటీనా జోరు..

క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన స్విట్జర్లాండ్‌

క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన స్విట్జర్లాండ్‌

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

రొనాల్డో కథ ముగిసింది.. ప్రీ క్వార్టర్స్‌లో పోర్చుగల్‌ ఓటమి

రొనాల్డో కథ ముగిసింది.. ప్రీ క్వార్టర్స్‌లో పోర్చుగల్‌ ఓటమి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
Advertisement
 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.