Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

మరోసారి మెగా ఫైనల్లో భారత్‌ X పాకిస్తాన్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Dec 20, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
indvspak.jpg

మరోసారి మెగా ఫైనల్లో భారత్‌- పాకిస్తాన్‌ తలపడనున్నాయి. ఏసీసీ మెన్స్‌ ఆసియా కప్‌-2025 టోర్నీ టైటిల్‌ పోరులో దాయాదులు అమీతుమీ తేల్చుకోనున్నాయి. కాగా దుబాయ్‌ వేదికగా శుక్రవారం జరిగిన తొలి సెమీస్‌లో ఆయుశ్‌ మాత్రే (Ayush Mhatre) సారథ్యంలోని భారత్‌ 8 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయఢంకా మోగించిన విషయం తెలిసిందే. 

ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. పవర్‌ప్లేలో 28 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన లంకను కాసేపు కెప్టెన్‌ విమత్‌ దిన్సార (32; 4 ఫోర్లు), చమిక హీనతిగల (42; 3 ఫోర్లు) ఆదుకున్నారు. ఇద్దరు తర్వాతి 6 ఓవర్ల పాటు వికెట్‌ పడనీయకుండా నాలుగో వికెట్‌కు 45 పరుగులు జతచేశారు.

ఆఖర్లో సేత్మిక సేనెవిరత్నే (22 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడటంతో లంక 130 పైచిలుకు స్కోరు చేయగలిగింది.  యువ భారత ఓపెనర్లు ఆయుశ్‌ మాత్రే (7), వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi- 9)లు విఫలమయ్యారు. 25/2 స్కోరు వద్ద లంక పండగ చేసుకుంది.

విహాన్‌ మల్హోత్ర, ఆరోన్‌ జార్జ్‌ ధనాధన్‌
అయితే, వైస్‌ కెప్టెన్‌ విహాన్‌ మల్హోత్ర (45 బంతుల్లో 61 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), హైదరాబాదీ బ్యాటర్‌ ఆరోన్‌ జార్జ్‌ (49 బంతుల్లో 58 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ అర్ధ శతకాలతో లంకేయుల ఆశలపై నీళ్లు చల్లారు. ఇద్దరు జట్టును గెలిపించేదాకా క్రీజును అట్టిపెట్టుకోవడంతో లంక బౌలర్లు ఆపసోపాలు పడ్డారు.

అబేధ్యమైన మూడో వికెట్‌కు విహాన్‌, ఆరోన్‌ 114 పరుగులు జోడించారు. మూడు రోజుల క్రితం జరిగిన ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలంలో లెఫ్ట్‌హ్యాండ్‌ బ్యాటర్‌ విహాన్‌ను రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ ప్రాథమిక ధర రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. కాగా వర్షం వల్ల ఈ యూత్‌ వన్డేను 20 ఓవర్లకు కుదించారు.

పదకొండేళ్ల  తర్వాత
ఇక మరో సెమీఫైనల్లో దుబాయ్‌లోని ది సెవెన్స్‌ స్టేడియంలో పాకిస్తాన్‌ కూడా 8 వికెట్ల తేడాతోనే బంగ్లాదేశ్‌పై గెలుపొందింది. వర్షం కారణంగా 27 ఓవర్లకు మ్యాచ్‌ కుదించగా.. బంగ్లాదేశ్‌ 26.3 ఓవర్లలో 121 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. అనంతరం 16.3 ఓవర్లలోనే పాకిస్తాన్‌ కేవలం రెండు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని పూర్తి చేసింది. తద్వారా ఫైనల్‌కు అర్హత సాధించింది.

కాగా పదకొండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత యువ చిరకాల ప్రత్యర్థులు భారత్‌- పాక్‌ (అండర్‌–19లో) ఆసియా కప్‌ ఫైనల్లో తలపడనున్నాయి. చివరిసారిగా 2014లో జరిగిన ఆసియాకప్‌ ఫైనల్లో పాక్‌ను ఓడించిన యువ భారత్‌ టైటిల్‌ సాధించింది.  కాగా తాజా ఆసియా కప్‌ లీగ్‌ దశ మ్యాచ్‌లో భారత్‌ పాక్‌ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.

వేదిక, టైమింగ్స్‌.. లైవ్‌ స్ట్రీమింగ్‌ ఎక్కడంటే
భారత్‌- పాకిస్తాన్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌ వేదిక. భారత కాలమానం ప్రకారం ఉదయం 10.30 నిమిషాలకు మ్యాచ్‌ మొదలు అవుతుంది. సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ (టీవీ), సోనీ లివ్‌ (డిజిటల్‌) యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం.

చదవండి: విరాట్‌ కోహ్లి ఫ్యాన్స్‌కు శుభవార్త.. కెప్టెన్‌గా రిషభ్‌ పంత్‌

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
India vs Pakistan
ACC Mens U19 Asia Cup 2025
Ayush Mhatre
Vaibhav Suryavanshi
Vihaan Malhotra
Aaron George
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వైఫల్యాలపై స్పందించిన వైభవ్‌ సూర్యవంశీ

వైఫల్యాలపై స్పందించిన వైభవ్‌ సూర్యవంశీ

వన్డే, టీ20 ప్రపంచకప్ ఫార్మాట్లలో భారీ మార్పులు​

వన్డే, టీ20 ప్రపంచకప్ ఫార్మాట్లలో భారీ మార్పులు​

సంజూను కావాలనే తప్పించారా?

సంజూను కావాలనే తప్పించారా?

ఎంతైనా సచిన్ సచినే.. 37 ఏళ్ల రికార్డును బద్దలుగొట్టిన బుడ్డోడు..

ఎంతైనా సచిన్ సచినే.. 37 ఏళ్ల రికార్డును బద్దలుగొట్టిన బుడ్డోడు..

వైభవ్‌ ‘అరంగేట్రం’పై విమర్శలు.. స్పందించిన బీసీసీఐ

వైభవ్‌ ‘అరంగేట్రం’పై విమర్శలు.. స్పందించిన బీసీసీఐ

సంజు, ఇషాన్ అవుట్.. వైభవ్ ఎంట్రీ

సంజు, ఇషాన్ అవుట్.. వైభవ్ ఎంట్రీ

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.