Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

క్రికెట్‌ నుంచి ఎన్బీఏ వరకు.. ఈ ఏడాది క్రీడా రంగాన్ని కుదిపేసిన వివాదాలు ఇవే

Sports Sakshi User Sakshi Sakshi Time Dec 20, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
yeraending.jpg

2025 సంవత్సరం.. క్రీడా రంగంలో అనేక విజయాలతో పాటు వివాదాలకు కూడా వేదికైంది.  ఆసియాకప్ నో షేక్ హ్యాండ్ నుంచి ఎన్బీఏ (NBA) బెట్టింగ్ స్కామ్ వరకు చాలా వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో టాప్‌-5 కాంట్రవర్సీలపై ఓ లుక్కేద్దాం.

నో హ్యాండ్‌ షేక్‌..
ఆసియాకప్‌-2025లో భారత్‌-పాకిస్తాన్ జట్ల మధ్య ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా 'నో హ్యాండ్‌షేక్' వివాదం క్రీడా ప్రపంచంలో పెను సంచలనం సృష్టించింది. సాధారణంగా  టాస్ సమయంలో, మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు, ఆటగాళ్లు కరచాలనం చేసుకోవడం ఒక సంప్రదాయం. 

కానీ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ సమయంలో పాక్ కెప్టెన్‌తో కరచాలనం చేయడానికి నిరాకరించారు. సూర్య బాటలోనే మిగితా భారత ప్లేయర్లు కూడా నడిచారు. టోర్నీ అసాంతం పాక్ ఆటగాళ్లతో భారత జట్టు అంటిముట్టనట్టుగానే వ్యవహరిచింది. ఈ వివాదంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి కూడా ఫిర్యాదు చేసింది. మ్యాచ్ రిఫరీని తప్పించాలని పీసీబీ డిమాండ్ చేసింది. కానీ ఐసీసీ మాత్రం పాక్ క్రికెట్ బోర్డు అందుకు అంగీకరించలేదు.

ఆ తర్వాత ఆసియా కప్ గెలిచిన తర్వాత ఏసీసీ చైర్మెన్ మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి టీమిండియా నిరాకరించింది. నఖ్వీ ఏసీసీ చైర్మెన్‌తో పాటు పాకిస్తాన్ మంత్రిగా ఉండడంతో భారత్ ఆ నిర్ణయం తీసుకుంది. అయితే ఆసియాకప్‌లో చోటు చేసుకున్న ఉద్రిక్తల కారణంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌, పాక్ పేసర్ హారిస్ రౌఫ్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది.

ఈ ఏడాది అక్టోబర్‌లో అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (NBA)ని బెట్టింగ్ కుంభకోణం కుదిపేసింది.  ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) చేసిన దాడులలో కొంతమంది బాస్కెట్‌బాల్ దిగ్గజాలు.. మాఫియా ముఠాలతో సంబంధం కలిగి ఉన్నట్లు తేలింది. ఆటగాళ్లు మాఫియా ముఠాలతో కలిసి  ఇన్‌సైడర్ సమాచారాన్ని బెట్టింగ్ కోసం వాడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో మొత్తం 34 మందిని అరెస్టు చేశారు. ఈ కుంభకోణంలో చాన్సీ బిలప్స్, టెర్రీ రోజియర్, డామన్ జోన్స్ వంటి దిగ్గజాలు నిందితులగా ఉన్నారు.


'గ్రోవెల్' (Grovel) వివాదం
ఈ ఏడాది న‌వంబ‌ర్‌లో భార‌త్‌తో జ‌రిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో సౌతాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. అయితే రెండో టెస్టు నాలుగో రోజు ఆట‌లో ద‌క్షిణాఫ్రికా హెడ్ కోచ్ షుక్రీ నాడ్‌.. భార‌త జ‌ట్టును ఉద్దేశించి "గ్రోవెల్" (మా ముందు సాష్టాంగపడేలా చేస్తాం) అనే పదాన్ని వాడటం పెద్ద రచ్చకు దారితీసింది. ఇది జాత్యహంకారానికి ప్రతీకగా పరిగణించబడింది. దీనిపై సౌతాఫ్రికా మాజీ ఆట‌గాడు డేల్ స్టెయిన్ సైతం త‌ప్పుబ‌ట్టాడు. ఆ త‌ర్వాత షుక్రీ నాడ్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు.


మెద్వెదేవ్ ఆగ్రహం
యూఎస్ ఓపెన్ 2025 తొలి రౌండ్‌లోనే రష్యా టెన్నిస్ ఆటగాడు డానియిల్ మెద్వెదేవ్ వెనుదిరిగాడు. ఫ్రాన్స్‌ ప్లేయర్ బెంజమిన్‌ బోంజి చేతిలో ఓడిపోడంతో మెద్వెదేవ్ అస‌హ‌నానికి గురయ్యాడు. అత‌డు  తన రాకెట్‌ను అక్కడే విరగ్గొట్టాడు. అంతకుముందు కోర్టులో ప్రేక్షకులతోను అనుచితంగా ప్రవర్తించాడు. అంపైర్లతో కూడా వాగ్వాదానికి దిగాడు. దీంతో అతడికి 42,500 డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 37 లక్షలు) జరిమానాను నిర్వాహకులు విధించారు.


హర్భజన్ సింగ్ అనుచిత వ్యాఖ్య‌లు
ఐపీఎల్‌-2025 సీజ‌న్ స‌మ‌యంలో భార‌త మాజీ స్పిన్న‌ర్ హర్భజన్ సింగ్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు.  వ్యాఖ్యాతగా వ్య‌హరించిన హర్భజన్.. ఇంగ్లండ్ ఫాస్ట్‌బౌల‌ర్ జోఫ్రా ఆర్చ‌ర్‌ను లండన్‌లోని 'నల్ల టాక్సీ' (Kaali Taxi) తో పోల్చాడు. దీంతో  జాత్యహంకార వ్యాఖ్య‌లు చేశాడ‌ని భ‌జ్జీపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిసింది.
 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Year Ender
Asia Cup
India vs Pakistan
NBA
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వన్డే, టీ20 ప్రపంచకప్ ఫార్మాట్లలో భారీ మార్పులు​

వన్డే, టీ20 ప్రపంచకప్ ఫార్మాట్లలో భారీ మార్పులు​

T20 WC 2026: పాకిస్తాన్‌కు షాకిచ్చిన ఐసీసీ

T20 WC 2026: పాకిస్తాన్‌కు షాకిచ్చిన ఐసీసీ

భారత జట్టుపై అక్కసు వెళ్లగక్కిన ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌

భారత జట్టుపై అక్కసు వెళ్లగక్కిన ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌

పాక్ ప్లేయ‌ర్ క‌వ్వింపు చ‌ర్య‌లు.. గొంతుప‌ట్టుకున్న హ‌ర్మ‌న్‌!

పాక్ ప్లేయ‌ర్ క‌వ్వింపు చ‌ర్య‌లు.. గొంతుప‌ట్టుకున్న హ‌ర్మ‌న్‌!

చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ.. 'హనుమంతుడి దయ వల్లే ఇదంతా'

చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ.. 'హనుమంతుడి దయ వల్లే ఇదంతా'

‘మ్యాచ్‌ విజయంలో ఆ ఇద్దరిదే కీలకపాత్ర’

‘మ్యాచ్‌ విజయంలో ఆ ఇద్దరిదే కీలకపాత్ర’

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.